యుద్ధంలో ఇరాన్ చమురు ఆదాయం రెట్టింపు

ఇరాన్ అభివృద్ధిని అణగదొక్కి, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ను తిరుగులేని శక్తిగా అవతరింప జేయాలన్న కాంక్షతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఇరాన్ యుద్ధం సత్ఫలితాలను ఇవ్వటం లేదని పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు మొత్తుకుంటున్నాయి. ఇరాన్ అణు విధానంను సాకుగా చూపిస్తూ ఇరాన్ తన చమురు అమ్ముకోనివ్వకుండా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు 45 యేళ్లుగా ఆంక్షలు విధించి అమలు చేస్తున్నాయి. ప్రపంచ అణు పెత్తనం కోసం అమెరికా, ఐరోపా లు ఏర్పాటు చేసిన అంతరాతీయ అణు ఇంధన…

చర్చలు జరపండి, ప్లీజ్! -సౌదీ అరేబియా

– అమెరికా, తాను ప్రకటించిన దిగ్బంధనం ఎత్తివేసి ఇరాన్ తో చర్చలు జరపాలని లేకుంటే ఇరాన్ దేశం మరిన్ని ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని సౌదీ అరేబియా, అమెరికాకు విజ్ఞప్తి చేసింది. కాగా, వచ్చే శుక్ర, శని వారాల్లో అమెరికా, ఇరాన్ ల మధ్య రెండో విడత చర్చలకు అవకాశం ఉన్నట్లు పత్రికలు ఊహాగానాలు చేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి పైన అమెరికా ప్రకటించిన బ్లాకేడ్ కొనసాగితే ఇరాన్ అందుకు ప్రతీకారంగా ఎర్ర సముద్రానికి దారి తీసే…

అద్భుత విజయం సాధించిన ఇరాన్ ప్రతిఘటన!

– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలలో ఉన్నది మెదడా లేక ఇంకేమన్నా పదార్ధం పెట్టుకున్నాడా అన్నది తెలియక ప్రపంచం సతమతం అవాల్సిన పరిస్ధితి దాపురించింది. ట్రంప్ లాంటి మనిషి ఇంకోసారి ఏ దేశానికైనా అధ్యక్షుడుగా ఎన్నిక కాకుండా అన్ని దేశాల ప్రజలు శపధం చేయాల్సిన అత్యవసర పరిస్ధితి వచ్చి పడింది. హోర్ముజ్ జలసంధి ని తెరిచే విషయంలో నిన్నటి వరకు ఇరాన్ ని బెదిరిస్తూ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్! “ఓపెన్ ద ఫ_ _ హోర్ముజ్…

“నీచ అమెరికా…” చర్చలపై ఇరాన్ ప్రకటన!

“అత్యంత నీచ, దుర్మార్గ మరియు కపట బుద్ధితో కూడిన శత్రు అమెరికా – తాను యుద్ధం ద్వారా సాధించ లేని దానిని చర్చల బల్ల వద్ద సాధించాలని ప్రయత్నించింది.

“అమెరికా చేసిన డిమాండ్లలో, ఇరాన్ ఇప్పటి వరకు శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించటం, హోర్ముజ్ జలసంధి పైన ఇరాన్ సార్వభౌమాధికారం గురించి ఏమీ తేలకుండానే బేషరతుగా తెరవటం లాంటివి ఉన్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ లను లొంగదీసిన ఇరాన్ ప్రతిఘటనకు ప్రపంచం మద్దతు ఇవ్వాలి!

అసలు అమెరికా, ఇరాన్ దేశాల నుండి అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం సావధానంగా చర్చలకు కూర్చోవటమే ఒక అద్భుతం అని పత్రికలన్నీ పొగుడుతున్నాయి. నిజమే కావచ్చు. కానీ ఆ అద్భుతం కేవలం ఇరాన్ ధైర్య సాహసాలతో అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపాలు 6 వారాల పాటు సాగించిన నరహంతక, మానవీయతా వ్యతిరేక యుద్ధాన్ని ప్రతిఘటించటం వల్లనే సాధ్యపడింది.

ఇరాన్ యుద్ధం, సీజ్ ఫైర్: నోట్స్ & అప్ డేట్స్ 5

సీజ్ ఫైర్ ఒప్పందాల తర్వాతకూడా దాడులు కొనసాగించటం ఇజ్రాయెల్ కు అలవాటే. గాజా పై అనేకసార్లు దాడులు చేసినప్పుడు, ఆ తర్వాత కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాలను ఇజ్రాయెల్ ఎన్నడూ గౌరవించలేదు. గాజా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినా, అది ఇంకా గాజా పై అడపా దడపా దాడులు చేస్తూనే ఉంది. హిజ్బొల్లా పైన దాడుల విషయంలో కూడా ఇజ్రాయెల్ పదే పదే ఒప్పందాలను ఉల్లంఘించటం జరిగింది. ఒకోసారి ఇజ్రాయెల్ అమెరికా కంటే పెద్ద రోగ్ స్టేట్ అనిపించేలా ఆ దేశ ప్రవర్తన ఉంటుంది.

సీజ్ ఫైర్ చర్చలు ఇక అర్ధ రహితం -ఇరాన్

– చర్చలు మొదలు కాకముందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ లు రెండూ అడ్డంగా ఉల్లంఘించిన నేపధ్యంలో ఇక “సీజ్ ఫైర్ చర్చలకు అర్ధం లేదు” అని ఇరాన్ ప్రకటించింది. ఏ అంశాల పునాదిగా అయితే చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు అన్నాడో ఆ పునాది అంశాలనే అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఉల్లంఘించాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్-బఘర్ ఘాలీబాఫ్ ట్విట్టర్ లో చేసిన ప్రకటనలో ఆరోపించాడు. “ఇరాన్ అందజేసిన…

ఫ్లాష్! గల్ఫ్ లో రెండు వారాల కాల్పుల విరమణ!

ఏప్రిల్ 7 సాయంత్రం 8 గంటల లోగా (అమెరికా కాలమానం ప్రకారం) హోర్ముజ్ జలసంధి ని బేషరతుగా తెరవక పోయినట్లయితే ఇరాన్ నరకం చవి చూస్తుందని డొనాల్డ్ ట్రంప్ నిన్న హెచ్చరించాడు. ఇరాన్ లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పైన, మౌలిక నిర్మాణాలైన వంతెనలు, ప్రభుత్వ భవనాలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు సమస్తం అమెరికా బాంబు దాడుల్లో సర్వ నాశనం అవుతాయని హుంకరించాడు. వేల సంవత్సరాల ఇరాన్ నాగరికత ఒక్క క్షణంలో ఆవిరి చేసేస్తా అన్నాడు. అలా…

ఇరాన్ పై అమెరికా ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -4

హార్ముజ్ జల సంధి ని ఇరాన్ నియంత్రణ కు వదిలేస్తూ యుద్ధ విరమణ కు అంగీకరించటానికి ట్రంప్ సుముఖంగా ఉండటం గల్ఫ్ రాజ్యాలకు మింగుడు పడటం లేదు. సౌదీ అరేబియా, యు ఏ ఈ, కతార్ దేశాలు ఇప్పటి దాకా యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్ కి తెర వెనుక చెబుతూ వచ్చాయి. ట్రంప్ ప్రకటన వారిని భయాందోళనలకు గురి చేస్తూ ఉండాలి.

ఇరాన్ పై ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -3

హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపధ్యంలో G7 గ్రూపు దేశాలు చమురు ధరల్ని తగ్గించటానికి వివిధ దేశాలను తమ రిజర్వ్ నిల్వలను విడుదల చేయాలని కోరుతున్నాయి. ఇప్పటిదాకా జపాన్, అమెరికా ఈ అంశం లో ఆమోదం చెప్పాయి. ఇందులో కలిసేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. అంటే చమురు ధరలు తగ్గించేందుకు G7 కూటమి చేసే ప్రయత్నాలకు మద్దతుగా తమ (స్ట్రాటజిక్) నిల్వలను మార్కెట్ లో విడుదల చేసేందుకు ఇండియా నిరాకరించింది.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం -నోట్స్ & అప్-డేట్స్

– ఒక పక్క ఇరాన్ తో చర్చలు జరుపుతూనే అమెరికా, ఇజ్రాయెల్ లు హఠాత్తుగా ఫిబ్రవరి 28 తేదీన ఇరాన్ దేశం పైన నరహంతక దాడి ప్రారంభించాయి. దానితో అమెరికా, ఇజ్రాయెల్ లు నిజాయితీగా, ఘర్షణని నివారించే ఉద్దేశంతో చర్చలు జరపడం లేదని లోకానికి అర్ధం అయింది. చర్చల పేరుతో ఇరాన్ ను ఏమరుపాటు స్థితిలో ఉంచి మెరుపుదాడి చేయటమే అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యం అని స్పష్టం అయింది. ఇజ్రాయెల్, అమెరికా లు కుట్ర చేసినట్టే ఫిబ్రవరి 28…

ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసిసి అరెస్ట్ వారంట్!

Yoav Gallant and Benjamin Netanyahu ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎట్టకేలకు ఇజ్రాయెల్ ని ఏలుతున్న టెర్రరిస్టు ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూ అరెస్టుకు, ఈ రోజు అనగా నవంబర్ 21 తేదీన, అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ప్రధాని నెతన్యాహూతో పాటు ఇటీవలి వరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా పని చేసిన యెవ్ గాలంట్ అరెస్టుకు కూడా ఐసిసి వారంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన హమాస్ సంస్థ రాజకీయ నేత ఇస్మాయిల్…

ఇజ్రాయెల్ పై ఇరాన్ ముందస్తు దాడి? రష్యా మద్దతు?

అక్టోబర్ 1 తేదీన ఇరాన్ దాదాపు 180 కి పైగా మిసైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ లో ఉండగా మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. హమాస్ సుప్రీం నేత హసన్ నాసరల్లా తో పాటు మరో 7 గురు హిజ్బోల్లా టాప్ కమాండర్లు బీరూట్ లోని బంకర్లలో సమావేశమై ఉండగా వరుస మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని…

గాజా: నేను చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను!

యధాతధ రాజకీయాల్ని, సెంట్రిస్ట్ ఇంక్రిమెంటలిజాన్ని భరించే ఓపిక కలిగి ఉండటానికి, నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. నవంబర్ లో అమెరికన్లు ఎవర్ని ఎన్నుకుంటారో పట్టించుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. డెమొక్రాట్లకు ఓటు వేస్తే “అపాయం తగ్గుతుందన్న” ఐడియాను సీరియస్ గా తీసుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. ఇజ్రాయెల్, దాని పశ్చిమ మిత్ర దేశాల్ని ఎప్పటికైనా క్షమించటానికి నేనిప్పటికే…