అమెరికాలో రెండేళ్లలో 240% పెరిగిన ఇండియా వ్యతిరేక విద్వేషం!

అమెరికాలో భారతీయులు మరియు ఇతర దక్షిణాసియా వాసులకు వ్యతిరేకంగా విద్వేషం పెచ్చరిల్లుతోంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆయన విధానాల వలన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక సెంటిమెంట్లు పెట్రేగి పోవటంతో భారతీయుల పైనా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారి పైనా భౌతిక దాడులు సైతం పెరిగాయి. జూన్ 2024 నుండి జూన్ 2026 వరకు దక్షిణాసియా నుండి వలస వచ్చినవారిపై ముఖ్యంగా భారతీయులపై అమెరికన్లలో విద్వేషం, X వేదికగా 240 శాతం పెరిగిందని సెంటర్ ఫర్…

ఎస్ఐఆర్ ఫలితం: 22 లక్షల బెంగాల్ వోటర్లు 12 యేళ్ళ దాకా ఓటు వేయలేరు!

– బెంగాల్ లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అప్పటిదాకా బెంగాల్ లో ముక్కుతూ మూలుగుతున్న బిజెపి ఒక్క సారిగా బంపర్ మెజారిటీ తో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది కానీ ఈ ఎన్నికల్లో 38 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. కారణం వాళ్ల ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ పేరుతొ తొలగించటమే. ఎస్ఐఆర్ వలన ఓట్లు కోల్పోయిన వాళ్లు అప్పీలు…

ఇండియాకు చమురు సప్లై చేయలేం -సౌదీ అరేబియా

– ఇండియా రిఫైనరీలకు ఇక క్రూడ్ ఆయిల్ సరఫరా చేయలేమని సౌదీ అరేబియా చెప్పేసింది. యెమెన్ లోని ఇరాన్ మద్దతు కలిగిన హుతీ గ్రూప్ సైన్యం ఎర్ర సముద్రం ముఖ ద్వారంలో నెలకొన్న రెండు కీలక ద్వీపాలను రెండు రోజుల క్రితం జరిపిన మెరుపు దాడిలో స్వాధీనం చేసుకోవటంతో సౌదీ అరేబియా చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచి పోయాయి. దానితో ఇండియాకు ఇతర దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేయటం సౌదీ అరేబియా కు సాధ్యం కావటం…

అమెరికా స్థావరాన్ని ఇరాన్ చావుదెబ్బ కొట్టింది -అమెరికా ఒప్పుకోలు

అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పైన ఆధిపత్య దురాక్రణ యుద్ధాన్ని ప్రారంభించి 6 నెలలు పైనే గడించాయి. ఈ కాలంలో అమెరికా బాంబు దాడుల్లో ఇరాన్ లో పలు రోడ్లు, బ్రిడ్జ్ లు, భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇరాన్ సైనికులు పలువురు చనిపోయారు. ఈ సంగతి ఇరాన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నది. అదే సమయంలో పశ్చిమాసియా అరబ్ దేశాలలో ఉన్న అమెరికా మిలటరీ, నావిక, వైమానిక స్థావరాల పైన కూడా ఇరాన్ పలుమార్లు ఎదురు దాడులు…

పుస్తకాలతో టెర్రరిజం సాధ్యం కాదు -జెకెఎల్ హైకోర్టు

పుస్తకాలు టెర్రరిస్టు నేరస్థులను తయారు చేయవని జమ్మూ, కాశ్మీర్ & లడఖ్ హై కోర్టు ఒక నిందితునికి బెయిల్ మంజూరు చేస్తూ స్పష్టం చేసింది. కాశ్మీర్ కు చెందిన స్మాలర్ షాఫత్ మక్బూల్ వాని వద్ద అభ్యంతరకర పుస్తకాలు ఉన్నాయని, సదరు పుస్తకాలు టెర్రరిజాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రజా భద్రతా చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ -పిఎస్ఏ) కింద గత సంవత్సరం నిర్బంధం లోకి తీసుకుంది. ఆయన అరెస్ట్ చట్ట విరుద్ధం…

Podcast Episode: న్యాయం రాజకీయం భద్రత

– ఈ టపా ఈ బ్లాగ్ లో మొదటి పోడ్ కాస్ట్. దీనిని వర్డ్ ప్రెస్ ప్లాట్ ఫారం వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తనకు తానే తయారు చేసి అందించింది. గత వారం రోజుల్లో బ్లాగ్ లో పోస్ట్ అయిన తపాలను పోడ్ కాస్ట్ గా మార్చి ఇస్తామని ఆఫర్ వర్డ్ ప్రెస్ వాళ్లు ఇవ్వగా దానికి ఓ.కె చెప్పాను. ఒక అరగంట టైమ్ తీసుకుని మూడు టపాల లోని ముఖ్యమైన అంశాలను తానే గుర్తించి ఆడియో…

చర్చల నాటకంతో ఆందోళనను బలహీన పరిచేందుకు ప్రభుత్వం కుట్ర -అభిజిత్

– ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోటల్లా ఆ పార్టీల ఎం.ఎల్.ఏ లు, ఎం.పి లను బెదిరించి లేదా ప్రలోభ పెట్టి వారిలో చీలికలు తెచ్చి ప్రభుత్వాలను పడగొట్టి, వారి అవినీతిని వాషింగ్ మిషన్ లో వేసి కడిగి శుభ్రం చేసి సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం గత కొన్నేళ్లుగా బిజెపి పార్టీ చేస్తున్న ఘనకార్యం! ఇదే తరహా మోసపూరిత ఎత్తుగడలను తన పాలనలో ఉన్న విద్యార్ధులు, యువకుల పైన కూడా బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం…

బొద్దింకలతో ప్రభుత్వం చర్చలు: నిరసనకు ప్రభుత్వం తల ఒగ్గనున్నదా?

– పార్లెమెంటు వద్దకు నిరసనకారులు, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో వేల సంఖ్యలో పార్లమెంటు వద్దకు తరలి వచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర మంత్రి జె పి నడ్డా, సిజెపి పార్టీ ప్రతినిధులైన సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లతో చర్చలు జరిపారు. చర్చలలో సిజెపి ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. కాగా సిజిపి డిమాండ్ల గురించి ప్రభుత్వంతో చర్చించేందుకు తమకు…

చైనా ఇప్పుడు మనకు ఆత్మ బంధువా?

నిన్న మొన్నటి వరకు చైనా, ఇండియా సంబంధాలు ఎలా ఉండేవి? ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి భజరంగ్ దళ్ చివరాఖరి కార్యకర్త వరకు చైనా అంటే మండి పడేవాళ్లు. చైనా మనకు ఆజన్మ శత్రువు అని ఒకటే ఊదర గొట్టేవాళ్లు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలని చైనా దేశ భక్తులు అని పడ దిట్టేవాళ్లు. మరి ఇప్పుడో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని చైనా మన శతృదేశం అన్న సంగతి మర్చిపోయాం. చైనా మనకిప్పుడు ఆపన్న…

50% అమెరికా సుంకాల తగ్గింపుకి బ్రోకర్లని నియమించిన ఇండియా!

Mercury Public Affairs ఇండియాలో వివిధ వ్యాపారాల్లో అనేక రకాల బ్రోకర్లు ఉంటారు. పల్లెల్లో గేదెలు, దున్నలు లాంటివి అమ్మి పెట్టటానికి కొనుగోలుదారుల్ని వెతికి పెట్టడానికి ఉండే బ్రోకర్లను ‘కాయిదా’ మనుషులు అంటారు. స్థలాలు, ఇళ్లు అమ్మి పెట్టడం – కొనుగోలుదార్లను వెతికి పెట్టేవాళ్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటారు. సినిమా యాక్టర్లకు సినిమాలు సంపాదించి పెట్టే ట్యాలెంట్ బ్రోకర్లు మరి కొందరు. షేర్ మార్కెట్ లో షేర్లు అమ్మటం కొనటం చేసే వాళ్ళను స్టాక్ బ్రోకర్లు…

అమెరికాలో వామపక్షం అంటే అర్ధమే వేరు!

అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్…

ఓటమి దిశలో ఉక్రెయిన్!

Mariupol city destroyed in war ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఉక్రెయిన్ ఓటమితో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికుల పోరాట పటిమ గురించీ, రష్యా సైన్యానికి ఉక్రెయిన్ సైన్యం చెమటలు పట్టించడం గురించీ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పడంలో ఇన్నాళ్లూ మునిగి ఉన్న పశ్చిమ కార్పొరేట్ పత్రికలు మెల్లగా ఉక్రెయిన్ సైన్యం వెనక పట్టు పట్టడం గురించి వార్తలు ప్రచురిస్తున్నాయి. దానితో ఉక్రెయిన్ ఓటమి దగ్గర పడుతోందన్నదే నిజమైన వార్తగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండు…

అమెరికా ఎన్నికల్ని రష్యా, చైనా, ఇరాన్ ప్రభావితం చేస్తున్నాయిట!

“ఆడలేక మద్దెల ఓడు” అన్నాట్ట వెనకటికొకడు! ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన ప్రాజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం మాది అని ఒకటే ప్రచారం చేసుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా లాంటి దేశాలపై దుర్మార్గమైన దాడులు చేసి ఆ దేశ వ్యవస్థలని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు తగుదునమ్మా అంటూ “మా దేశ ఎన్నికలని ప్రభావితం చేస్తున్నాయ్ బాబోయ్” అంటూ తెగ ఏడ్చి చస్తోంది! “అయినా…, మన బంగారం మంచిది కానప్పుడు…”…

మోడీ పుణ్యం: కార్పొరేట్ల కంటే మిడిల్ క్లాస్ చెల్లించే పన్నులే ఎక్కువ!

ఇండియాలో చాలా మందికి తెలియని సంగతి ఏమిటంటే ఇక్కడి కార్పొరేట్ కంపెనీల కంటే మధ్య తరగతి జీవులు చెల్లిస్తున్న పన్నుల మొత్తమే ఎక్కువ అని. బిజెపి ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాలు ఈ పరిస్ధితికి దారితీశాయి. యుపిఏ హయాంలో కార్పొరేట్లు తెగ పన్నులు కట్టేశాయని కాదు గానీ, కొద్దో గొప్పో మిడిల్ క్లాస్ కంటే కాసింత ఎక్కువ పన్నుల ఆదాయం కార్పొరేట్ కంపెనీల నుండి వచ్చేది. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా 2021-22 ఆర్ధిక సం.…

బడ్జెట్ 24-25: ఆదాయ పన్నులో నలుసంత ఉపశమనం!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అనగా జులై 23 తేదీన 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎప్పటి లాగానే కార్పోరేట్ సూపర్ ధనిక వర్గాలకు రాయితీలు ప్రకటించిన ఆర్ధిక మంత్రి మధ్య తరగతి ఉద్యోగులకు మాత్రం నాలుగు మెతుకులు విధించారు. ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను విధింపును ఉద్యోగులు కలిగి ఉన్నారు. ఒకటి ఓల్డ్ రెజిం, రెండు కొత్త రెజిం. రెండేళ్ళ క్రితం కొత్త రెజిం…