బ్లాగ్మిత్రులకు నమస్కారం
తెలుగులో ప్రచురితమయ్యే పత్రికలు ప్రధానంగా రాష్ట్రానికి, కొంత దేశానికి సంబంధించిన వార్తలకు తప్ప జాతీయ, అంతర్జాతీయ వార్తలకు పెద్దగా ప్రాచుర్యం ఇవ్వటం లేదని నా భావన. ఆ లోటు నేను తీరుస్తానని నేను అతి సాహసానికి పోవటం లేదు. కాని కొంత మేరకయినా ప్రయత్నించటంలో తప్పు లేదనిపించింది. అందులో భాగంగానే ఈ బ్లాగు ప్రారంభించాను. వార్తలతో పాటు ఆ వార్తలకు సంబంధించిన విశ్లేషణ కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఆ విశ్లేషణ అందరికీ నచ్చక పోవచ్చు. నచ్చిన వారు, నచ్చని వారు కూడా తమ అభిప్రాయలను తెలియ జేస్తే బ్లాగు మరింత పరిపూర్ణత సాధించే అవకాశం ఉంటుంది.
జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగే పరిణామాల్లో ముఖ్యమైన వాటిని ఎంచుకొని (కనీసం నాకు ముఖ్యమైనవిగా అనిపించినవి) వాటి గురించిన విశేషాలను తెలుగు పాఠకులకు అందించాలన్న నా ఈ చిరు ప్రయత్నానికి మిత్రులు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
గమనిక
పాత పేజీల్లోని పాత టపాలు చూడదలిచినవారు ఎడమవైపు బాగా కింద ఉన్న భాగంలో ‘మార్గదర్శిని’ అనే శీర్షిక కింద ‘పాత టపాలు’ అనే లింక్ ని క్లిక్ చేస్తే తక్షణ పాత టపాలు కనపడతాయి. వాటి కంటే ముందరి టపాలు చూడదలిస్తే మళ్లీ అదే స్ధానంలో ‘పాత టపాలు’ లింక్ ని మళ్ళీ క్లిక్ చెయ్యాలి.
అప్‌డేట్ (12/12/2011):
ఇంకొక ముఖ్య విషయం చెప్పదలిచాను. ఈ బ్లాగ్ లో నేను రాసే అంశాలు నేను స్వయంగా విలేఖరిగా దేశ విదేశాలు తిరిగి సేకరించినవి కావు. వివిధ వార్తా పత్రికలు, మేగజైన్లు, వార్తా పత్రికల సంస్ధల వెబ్ సైట్లు చూసి, చదివి సేకరించిన వార్తలనే ఈ బ్లాగ్ లో రాస్తాను. తిరిగి సేకరించేంత సీన్ నాకు లేదు.
ఇది పూర్తిగా నేను రాసే బ్లాగ్. వివిధ వార్తాంశాలను సేకరించి రాస్తూ నాకున్న దృక్పధంతో విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. ఎవ్వరైనా చేయగలిగింది అదే. మరొకరి దృక్పధంతో వార్తలు రాయాల్సిన అవసరం నాకెందుకు చెప్పండి!
కొంతమంది మిత్రులు రాసిన ఆర్టికల్స్ అప్పుడప్పుడూ ప్రచురిస్తాను. అలా ప్రచురించినప్పుడు వారి పేరుతోనే ప్రచురిస్తాను.
నేను ప్రధానంగా చదివే పత్రికలు ఇవే: రాయిటర్స్, బిబిసి, ది హిందూ, ది గార్డియన్, ఫస్ట్ పోస్ట్, ఆసియా టైమ్స్, ఎం.ఆర్.జైన్, జేమ్స్ పెట్రాస్ బ్లాగ్, టెలిగ్రాఫ్, జిన్‌హువా, డి.ఎన్.ఎ, డెయిలీ భాస్కర్ ఇంకా మరి కొన్ని. నేను రాసే ప్రతి పోస్టుకీ క్రెడిట్ వీటిలో ఏదో ఒక పత్రికకు గానీ, కొన్ని పత్రికలకు గానీ దక్కుతుంది.
చక్కని ప్రయత్నం! అభినందనలు…
Keep up the good work., follow this http://www.democracynow.org
http://www.facebook.com/democracynow
you’ll get some good feed on the international front.
Hi Jaya Prakash, Thank you for providing a source. I want to reveal that I’ve been visiting ‘democracynow’ web site for a few months. An Indian lady journalist is also working with that channel. She recently reported from Egypt and Libya. By the way, are you associated with ‘Democracy now’?
Thank you for your suggestion.
Com. visekhar! Your comments on TRS are very fine. About Euro, it is a general phenomenon. Capitalism crisis temporarily set aside. So capitalist heads try to wars -PR
excellent blog…
మీ ప్రయత్నం చాలా బావుంది.మీ బ్లాగు చాలా బాగుంది.
ధన్యవాదాలు వాసు గారు.
మీ టపాలు చాలా బాగున్నాయి. మంచి విషయాలతో క్లుప్తంగా వివరణాత్మకంగా వుంటున్నాయి. ధన్యవాదములు.
వాసవ్యగారు, కృతజ్ఞతలు.
manchi aalochan and prayatnam pls continue
[telugulo ela typala teliyaledu]
చక్కని ప్రయత్నం!
మీ టపాలు చాలా బాగున్నాయి. మంచి విషయాలతో క్లుప్తంగా వివరణాత్మకంగా వుంటున్నాయి.
తెలుగులో అంతర్జాతీయ వార్తలని పరిచయం చేస్తూ మీ బ్లాగ్ ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. మీ బ్లాగుని రెగ్యులర్ గా చదువుతున్నాను. చదవమని నా స్నేహితులకి కూడా చెబుతున్నాను. మీ బ్లాగ్ రచనలు ఏదైనా పత్రికలో వచ్చే మీ రచనల ( ఎన్.వేణుగోపాల్, తె.రవి మొదలగువారిలా ) పునర్ముద్రితాలా? మీ ఓపికకీ, విషయ పరిజ్ణానానికీ, సులభ రచనా శైలికీ అభినందనలు.
రమణ గారూ, అదేం లేదు. నేనిక్కడ రాసినవన్నీ మొదట ఇక్కడ ప్రచురితమైనవే. ఆ తర్వాత వేరే ఎక్కడైనా ప్రచురితం అయ్యాయో లేదో నాకు తెలియదు. ప్రచురితం అయినా నాకేమీ అభ్యంతరం లేదు. మీ అభిమానం మీ విషయాసక్తిని ప్రతిబింబిస్తోంది. కృతజ్ఞతలు.
I have been following your blog quite some time. I really appreciate your time,energy for bringing this out and writing style to make anyone understand it better.
Once again, thank you very much for your effort.
సుబ్బారెడ్డి గారూ ధన్యవాదాలు.
I am only one woman, who is opposing B J P in this blogging world. your posts about B J P gave me energy to do anything in future.
నీహారిక గారూ, “రౌడీ రాజ్యం” బ్లాగ్ లో మీ రచన చదివాను. మొదటి నుండీ చివరి వరకూ రెండు సార్లు చదివాను. కొన్ని అర్ధం అయినా చాలా వరకు అర్ధం కాలేదు. అర్ధం చేసుకోవాల్సిన విషయాలుగా అనిపించలేదు కాని ఆ విషయాల వెనుక దాగిన మీ అంతరంగం పట్ల కొంత క్యూరియాసిటీ పెరిగిన మాట వాస్తవం. ఈ కె.బ్లా.స లాంటి బ్లాగ్స్ ని నేను చూడను.
బ్లాగింగ్ అన్నది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనిషికి అందిన ఒక సాధనం. దానిని మనుషుల మధ్య సత్సంబంధాలు పెంచుకోవడానికీ, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడానికీ, భావాలు కలబోసుకోవడానికి వాడుకోవాలన్నది నా అభిప్రాయం. పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ సవ్యంగా, సంయమనంతో నచ్చ జెప్పి ఒప్పించడానికి ప్రయత్నాలు చెయ్యవచ్చు. లేదా వ్యతిరేక భావాల్ని మనం కూడా చదివి ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ తెలియజేస్తూ చర్చ జరుపుతూ ఒకరి భావాలు మరొకరితో కలబోసుకోవచ్చు. అసలు కుదరదనుకుంటే అది మీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం అని చెప్పుకుని చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు.
కానీ నేను తెలుగు బ్లాగింగ్ మొదలు పెట్టాక కొంతమంది నుండి వచ్చిన అసభ్యకరమైన వ్యతిరేకత నన్ను హతాశుడిని చేసింది. చాలా వరకు స్పందించకుండా తొలగించినప్పటికీ కొన్నింటికి నా స్ధాయిలో నేను స్పందించాను. తర్వాత వదిలేశాను. ఇప్పటికీ అసభ్యంగా తిడుతూ రాస్తున్నారు. కాని తొలగిస్తున్నాను.
నాకు అర్ధం అయిందేమంటే వీళ్ళు ఒక లక్ష్యంతో పని చేస్తున్నారు. కొన్ని భావాలు ఉన్నవారిని బ్లాగింగ్ చేయకుండా అడ్డుకోవడం వీరి పని. రెచ్చగొట్టి రొంపిలోకి దింపితే బ్లాగింగ్ మర్చిపోయి వీరిని తిడుతూ కూర్చోవాలన్నమాట. అందువలన వారి లక్ష్యాన్ని నెరవేర్చడం నేను పెట్టుకోదలుచుకోలేదు. కనుక వదిలేశాను.
మీరు రాసినదాన్ని బట్టి మీరు కొంతవరకు నాలాగే కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నారని గ్రహించాను. వివిధ అంశాలను -మీ వ్యక్తిగత విషయాల దగ్గర్నుండి రామాలయం మీదుగా, తెలంగాణ వరకు- రాసిన క్రమం వివిధ రకాల భావాల (ఐడియా) పట్ల మీలోని అయోమయాన్ని ఒకవైపు తెలుపుతుండగా, తీవ్రమైన ఎమోషన్స్ తో కూడిన మీ అంతరంగం మరొకవైపు వ్యక్తమవుతోంది.
కె.సి.ఆర్ నుండి చంద్రబాబు వరకూ వ్యక్తిగతంగా కలిసి కదిలించాలని చేసిన మీ ప్రయత్నం నాకు అచ్చెరువు గొలుపుతోంది. మీ లోని ధైర్యాన్నీ, మీ చేతలతనాన్నీ (చెప్పడంతో పరిమితం కాకుండా చేతలతో చూపడం అని నా భావన) అవి తెలుపుతున్నాయి. అయితే, అవి మీ చేతలలోని లక్ష్యం లేని తనాన్ని కూడా తెలుపుతున్నాయని చెబితే మీరు మరోలా భావించవలదు.
బహుశా ఇదంతా ఇప్పటి రాజకీయాలలో పైకి కనపడుతున్న లక్ష్య రాహిత్యమే మీపై ప్రభావం చూపి ఉండవచ్చు. అది తప్పు కానే కాదు. ఏదో ఒక విధంగా మీరు స్పందిస్తున్నారు చూశారూ, అది మీలోని గొప్ప పాజిటివ్ గుణం. దాన్ని ఎన్నటికీ జారవిడవకండి.
ఆ తర్వాత పాజిటివ్ గుణం ఉండగానే సరిపోదు. దానిని సవ్యమైన దిశలో పెట్టడం చాలా అవసరమైన పని, కష్టమైన పని కూడా.
బి.జె.పి వ్యతిరేకత అన్నది అనేకానేక రాజకీయాభిప్రాయాల్లో ఒకటి మాత్రమే. బి.జె.పి వ్యతిరేకత కాంగ్రెస్ అనుకూలతగానో, కమ్యూనిస్టుల ఆరాధనగానో మారనవసరం లేదు. అసలు మీరు బి.జె.పి వ్యతిరేకతకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం మానేయాలని నా సలహా. దానికి బదులు ఏ రాజకీయ భావాలు గొప్పవో ఒక వెతుకులాటను ప్రారంభించండి. మీకున్న పాజిటివ్ దృక్పధంతో సరైన రాజకీయ భావాలవైపుకి మీరు తప్పని సరిగా వెళ్లగలుగుతారు.
నేను ప్రస్తావించిన ఈ అంశాలన్నింటి ముందు మీరు అడిగిన ‘అవును, కాదు’ ప్రశ్న పెద్దదిగా నాకు అనిపించడం లేదు. దానిని వదిలేద్దాం.
ప్రస్తుతానికి ఉంటాను.
-విశేఖర్
కానీ ఒకమాట మాత్రం నిజం.
ఈ నీహారికని అడ్డుపెట్టుకుని, ఆమెవెనకాల వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని అమాయకులైన బ్లాగర్లని వేధించిన మాట మాత్రం వాస్తవం. పైన నీహారిక ఉదహరించిన విషయాల్లో వేటిలోనూ ప్రమేయం లేని వాళ్ళని కూడా లాగారు, రకరకాలుగా అవాస్తవాలని ప్రచారం చేసి చివరికావ్యక్తులకి బ్లాగావరణంపై అసహ్యం ఏవగింపు కలిగేలా చేశారు. కేవలం బ్లాగుల్లోనే కాదు, గూగుల్ గుంపుల్లో, వారు అభిమానించే తెలుగు బ్లాగర్ల దగ్గర, వాళ్ళ పేరులున్నాయి ఐపీ అడ్రసులున్నాయని మైళ్ళు రాసి వేధించారు.
వీళ్ళందరూ అంతే శేఖర్ గారూ.
ఈ అమ్మాయిని కెలికక ముందు వరకూ బ్లాగుల్లో భరద్వాజ అంటే మోనార్కు, ఒంటేలు వాడు కుడిభుజం, బెమ్మీ గాడు వీడి ఎడమ భుజం, వీళ్ళతో తానా అంటే తందానా అంటూ తార ఉండెవాడు.
వీళ్ళ కెలుకుడుకి ముందు ఎదురు తిరిగింది ఈ అమ్మాయే, కానీ తర్వాత గ్రూపు రాజకీయాలని తెలీక ఒంటరిది అయిపోయింది.
కాని అప్పటికే ఆ పిల్ల ఇచ్చిన ఊపుతో, అప్పటికే చాలామంది బ్లాగర్లకి వీళ్ళమీద పీకల్దాకా ఉండడం మూలంగా బ్లాగువీక్షణం ద్వారా పాళి, బ్లాగుసోదరి ద్వారా సింగపూర్ లేడీ ఒంటేలు మొదలైన వారు అదే సమయంలో వీళ్ళమీద ఎదురుదాడి మొదలుపెట్టారు..
అప్పటిదాకా మోనార్కిజం వెలగబెడుతున్న వీళ్ళకి ఇది ఊహించలేని షాక్ ఇచ్చింది. దీనితో వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎవరెవరా అని తెలుస్కోవాలని వీళ్ళని వీళ్ళే తిట్టుకుంటూ ‘అప్పలరాజూ అన్న బ్లాగుని పెట్టుకున్నారు. అక్కడ వీళ్ళని వీళ్ళే తిట్టుతిట్టుకుంటునో వీళ్ళకి నచ్చనివాళ్ళని తిడ్తూనో ఎవడైనా వచ్చి సంఘీభావం ప్రకటిస్తే వాడి ఐపీ అడ్రస్సు నోట్ చేసుకునేవాళ్ళు, అగ్రిగేటర్ చేతిలో ఉంది, స్టాట్ కౌంటర్లు ఉన్నాయి, వాడెవడో సులభంగా కనిపెట్టేసి వాళ్ళని హింసించేవాళ్ళు. తాడేపల్లికీ బెమ్మీ కీ రక్తచరిత్ర బ్లాగులో మొదలైన గొడవ శరత్ బ్లాగులో పెద్దదైంది, ఆ తర్వాతిరోజే అప్పలరాజు బ్లాగులో తాడేపల్లిని తిడుతూ టపా పడింది. ఆ దాడి ఆ గాంగ్ నుంచే వచ్చింది అని చాలా మంది చెప్పారు తాడేపల్లికి, తాడేపల్లి దాని ఎక్కడా ఖండించలేదు, బలపరచనూలేదు. న్యూట్రల్ గా ఉన్నాడు.
వీళ్ళ గాంగ్ లో తార మరీ వీళ్ళంత నారో మైండెడ్ కాడు. ఎవరు తనబ్లాగుకి వచ్చినా వాళ్ళని మంచిగా పలకరిస్తాడు, ఆ క్రమంలో ఒకరోజు కొత్తపాళీ తార బ్లాగుకి రావడం, తార ఆయన్ని అభిమానంగా పలకరించి తన శైలి చూసి సలహాలివ్వమని అడగడం జరిగిపోయాయి. వాళ్ళ బద్ధశత్రువుతో జతకట్టడం వాళ్ళకి నచ్చలేదు. అప్పటినుండీ తారమీద ద్వేషం వెళ్ళగక్కారు, అంతే కాకుండా విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం– తార మాలిక క పోటీగా ఎదుగుతున్న హారం, సంకలిని సమూహము వంటీ మిగతా తెలుగు అగ్రిగేటర్లకి జావా కోడ్ రాసి ఇవ్వడం, ప్రారంభంలో సైట్ ఎనలిటిక్స్ మీద సలహాలివ్వడం అదీ చేసేవాడు.
ఇవ్వన్నీ రుచించక తారని ఇవ్వన్నీ రుచించక తారని కేబ్లాసలోంచి దూరంపెట్టారు. తనకి హార్ట్ అయి తనే బయటకి వచ్చేసి సొంతగా ఇంకో వనం మొదలుపెట్టాడు. వీళ్ళ వాలకం నచ్చని బ్లాగరులంతా ఆ వనం ద్వారా వీళ్ళని హింసించడం మొదలుపెట్టారు. కొన్ని నెలలపాటు భీకరంగా జరిగింది యుద్ధం. చివరికి వాళ్ళూ బాగే వీళ్ళూ బాగే మధ్యలో రాజేష్ జీ, భరారే, లాంటివాళ్ళు కొంతమంది తెలియక ఆ వనాల గొడవల్లో అనవసరంగా కెలుక్కుని బద్నాన్ ఆయ్యారు. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యారు.
విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రమోదవనం లో కులగజ్జి కామెంట్లు దుమారం లేపాయి. శివాజీ గాణ్ణి అందరూ కమ్మ కులగజ్జి అని ఏడిపిస్తుంటే వాడికి కాలి ఒక టపారాశాడు. దాని పట్టుకుని ఇన్నాళ్ళూ బ్రాహ్మడ్ని కెలికాం , ఇప్పుడు చౌదర్ని (ఒంటేలు) కెలుకుదాం అని వాడి మీద వత్తిడి తెచ్చారు. ఎంతయినా కమ్మా కమ్మా భాయ్ భాయ్ కదా వాడి కులం దగ్గరికొచ్చేసరికి శివాజీగాడు మొహం చాటేశాడు.
అలా సంవత్సరం ముందు మకుటం లేని మహారాజులా వెలిగే మలక్కు, ఈ పిల్ల కొట్టిన దెబ్బల పుణ్యమా అని ప్రవీణ్ గాడితో ‘గజ్జి కుక్కా” అని పబ్లిక్ గా తిట్టించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఇవాళ వాళ్ళ గాంగ్ ని తిట్టడానికి తెలుబ్లాగర్లలో ఎవ్వరూ సంకోచించరు. ఒంటికాలిమీద లేస్తారు. ఈ క్రెడిట్ అంతా ఆ పిల్లదే.
పాఠకుడుగారూ మీరు ఇచ్చిన పై పరిచయంతో కొన్ని విషయాలు తెలిసాయి. మరి కొన్ని అనుమానాలు తలెత్తాయి.
మలక్ అంటే మలక్ పేట రౌడి అనే కదా? మరి ఆ రౌడీగారి బ్లాగులోనే కదా నీహారికా గారు ప్రస్తుతం టపా రాసింది? ఈ పరిణామం ఎందుకు జరిగింది? అర్ధం కాకుండా ఉంది.
ఈ Snkr, KumarN పేర్లతో ఉన్నవాళ్లెవరు? వీళ్లపేర్లు మీ పరిచయంలో రాలేదేమి? ఇదొక ప్రత్యేకమైన గుంపా? వీళ్ళిద్దరే నా బ్లాగులోకి కెలుకుతున్నవారిలో ముఖ్యులుగా కనిపిస్తున్నారు. ఎస్.ఎన్.కె.ఆర్ మొదట్లో వచ్చాడు కాని ఆ తర్వాత కనపడలేదు. ఈ మధ్య ఏదో విషయంలో మీతో ఏకీభవిస్తున్నానంటూ వచ్చాడు కాని తీసేశాను. నా కామెంట్ పాలసీలో ఒకసారి అసభ్యంగా కామెంటు రాసినవారు తర్వాత సరిగ్గానే కామెంట్ రాసినా తీసేస్తానని రాసాను. దానిని అనుసరించి అతని కామెంట్ సరిగ్గానే ఉన్నప్పటికీ తొలగించాను.
ఈ కుమార్ అనేవాడు కేవలం నన్ను దూషించడానికే అబ్దుల్లా అనే పేరుతో ఓ బ్లాగు పెట్టి పాపం తన టైమంతా వృధా చేసుకుంటున్నాడు. ఇంకొకరు లండన్ నుండి వచ్చి ముందు కొంతకాలం పొగిడాడు. ఇప్పుడేమో బోడి నువ్వేంటి రాసేది? నీలాగా నీకంటా గొప్పగా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు.వాళ్ళతో పోలిస్తే నువ్వేంత అంటూ రాస్తున్నాడు. అసలు ఈయనగారిని నా బ్లాగ్ కి ఎవరు రమ్మాన్నారో తెలియదు. నేనే గొప్పగా రాస్తానని ఎవరు చెప్పారో తెలియదు.
ఇంత ఘోరంగా, లక్ష్యం అనేది లేకుండా, కేవలం కొన్ని భావాలపైన గుడ్డి వ్యతిరేకతతో వీళ్ళ విలువైన కాలం వృధా చేసుకుంటున్నారు. బహుశా వీరు చేసేది వీరికి అవసరంగా కనిపించి సంతృప్తినిస్తున్నదేమో తెలియదు. ఆ సంతృప్తి లేకపోతే రాయలేరేమో కదా?
అబ్దుల్లా పేరుతో రాస్తున్న కుమార్ మాత్రం ఒక లక్ష్య ప్రకటన చేసాడు. అమెరికాని తిట్టేవాళ్ళని తిట్టడమే ఆయన కర్తవ్యమట. అమెరికా ముస్లిం దేశాలపై దాడులు చేస్తున్నది కనుక ఆయనకు నచ్చిందట. చిత్రం ఏమిటంటే ఆ విధంగా ప్రవర్తిస్తున్నందుకు వారే మాత్రం సిగ్గుపడకపోవడం. హిందూ చాందసవాద భావాలు బాగానే ఉన్నట్లున్నాయి. ఏ భావాలైనా ఉంచుకోవచ్చు. అభ్యంతరం ఉండదు. కాని అందరూ అవే భావాలు ఉండాని డిమాండ్ చేస్తారు వీళ్ళు. పైగా అమెరికా గొప్ప ప్రజాస్వామ్య దేశం, ఫ్రీ కంట్రీ అని పొగుడుతారు. తమకు మాత్రం ప్రజాస్వామ్యం అవసరం లేదనుకుంటారు.
వీళ్ళు అప్పుడప్పుడూ మారు పేర్లతో వచ్చి నా మీద జాలి ప్రకటిస్తుంటారు. ఈ జాలి ప్రకటించే వాడే అదేదో పిట్ట పేరుతో బ్లాగు నిర్వహిస్తున్నాడనుకుంటా. ఎవరో చెప్పారు. ఆయన అప్పుడప్పుడూ అలా జాలి ప్రకటిస్తూ తనను తాను సింహాసనం పైన కూర్చుండబెట్టుకుని సంతృప్తి పడుతుంటారు కాబోలు.
విశేఖర్ గారు,
మిగతా విషయాలు వదిలేయండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రృవులు కానీ ఉండరు. అందరినీ కలుపుకు పోవాలన్నదే నా ఉద్దేశ్యం. మీరంతా రాజకీయాలకు వ్యక్తిగత ద్వేషాలకు మధ్య ఒక గీత గీయటం లేదు. మిమ్మలిని వారు విమర్శించటం జరిగింది కాబట్టి అక్కడ మీరు కమెంట్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. నన్ను వారు ఎన్ని అన్నా దానిని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. నేను వ్రాసిన విషయం పట్ల వారి వ్యతిరేకత తెలియపరిచారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది.
అందరూ మనల్ని పొగుడుతారు, మనల్ని విమర్శించారంటేనే వారికి మన మీద ఎంత శ్రద్ధ ఉందో అర్ధం చేసుకోవాలి. సద్విమర్శ అయితే స్వీకరించవలసిందే !! వారి వల్ల నా జీవితంలో ఏ పని అయినా ధైర్యం గా చేయగల సమర్ధత వచ్చింది. అందుకు నేను వారికి జీవితాంతం ౠణపడిఉంటాను.
తెలంగాణా గురించి నేను చెప్పిన పరిష్కారం సాధ్యమా లేదా అన్నది వదిలేయండి, అసలు ఆ పరిష్కారం పై మీ అభిప్రాయాన్ని అక్కడ తెలిపితే నేను సంతోషిస్తాను.
మీరు స్నేహ హస్తాన్ని చాపితే నే కదా వారు మీ చేయి అందుకునేది ??
మీలో ఏ ద్వేషభావమూ లేనపుడు, నిజంగా రాజకీయాభిలాష, దేశానికి సేవ చేయాలని ఉంటే అక్కడ కమెంటటానికి మీకభ్యంతరం ఏమిటి?
ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు కానీ రాష్ట్రం కానీ దేశం గురించి కానీ మాట్లాడవలసి వచ్చినపుడు అందరూ ఒకమాట మీద నిలబడవలసి ఉంది.
ఇక్కడ కె సి ఆర్ ఎవరినీ కలుపుకు పోడు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు, కానీ చేతలకొచ్చే సరికి వారు కలుపుకుపోతున్నారా అన్నదే నా సమస్య.
నాకు రాతల కన్నా దేశానికుపయోగపడే చేతల మీదే ధ్యాస ఎక్కువ !!
అమెరికా ని తిట్టేవాళ్ళని కెలకడం అంత సీన్ లేదు. వీళ్ళు మరీ అంత ప్రమాదకారులు కారు. ఎదో టైం పాస్ కి ఇలా వాళ్ళకి విధేయులుగా ఉందకపొతే కెలుకుతారు అంతె, అంత పెద్ద ఆలోచ్నలు ఉండవనే అనుకుంటున్నాం.
కాకపోతే మీరు చెప్పిన ఇద్దరి గురించి. కెలుకుడు బ్లాగర్లలో మూడు రకాలు ఉంటారు. మొదటిరకం బ్లాగర్లు బయటపడి కెలికుతారు, దాని కారణంగా వాళమీద పూలూ రాళ్ళూ రెండూ ఎక్కువగానే పడతాయి. అందుకే బ్లాగులో ఆ గాంగ్ లో ఎవడు తప్పు చేసినా మలక్ అకారణంగా టార్గెట్ చేయబడతాడు.
రెండోరకం బ్లాగర్లు పైన మీరు చెప్పిన వాళ్ళు, వీళ్ళు తెరవెనకాల ఉంటారు, వీళ్ళతో నిరంతరం మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళని తెరముందు యుద్ధాలకి ఎగసన దోస్తూ ఉంటారు, ప్రొఫైల్ లేని కామెంట్లతో వీళ్ళని ఎపటికప్పుడు కెలుకుడుకి ఉత్తేజితం చేస్తారు, బయటపడి కెలికే వీళ్ళకన్నా బయటపడకుండా కెలికే వీళ్ళు ఇంకా పెద్ద శత్రువులు.
మూడోరకం బ్లాగర్లు, వీళ్ళ కెలుకుడుకి కనిపించే బాహ్య ముఖాలు, వీళ్ళు వాళ్ళ పేరులతొనే కామెంటుతారు, విషయం ఏమిటంటే వీళ్ళ బ్లాగు పాపులర్ అయ్యేదీ లేనిదీ ఈ గాంగ్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. శరావ్య, వంశీమోహన్, రామరాజు, మొదలైఅనవారు. ఈ గాంగ్ పైచేయిగా ఉన్నంతకాలం వాళ్ళ బ్లాగులకి ధోకా ఉండదు, వీళ్ళు సెలెబ్రిటీలుగా చెలామణీ అవుతారు. అందుకని వీళ్ళ పాపులారితీ పడిపోకుండా ఎప్పటికప్పుడు సొంతబ్లాగుల్లో వీళ్ళని పొగుడుతూ, పాజిటివ్ కామెంట్లు రాస్తూ ఉంటారు.
ఇకపోతే నీహరిక అక్కడ పోస్ట్ రాయడం వెనకాల రహస్యం ఏమిటంటే, ఆ పిల్ల పాపం అలిసిపోయింది, ఎంతకాలం గున్న ఏనుగుల్లాంటి ఈ దుష్టులతో ఒంటరిపోరాటం చేస్తుంది, అసలే వ్యక్తిగత జీవితంలో ఎదురీదుతోంది, మళ్ళి ఈ గొడవలెందుకని వాళ్ళతో సంధి చేసుకుంటుంది.
మిమ్మల్ని లండన్ నుంచి వచ్చి తిట్టింది అబ్బాయికాదు, అమ్మాయి. బ్లాగుల్లో చాలా పాపులర్ పేరు ఆమెది.
>>>>>
ఈ పిల్ల కొట్టిన దెబ్బల పుణ్యమా అని ప్రవీణ్ గాడితో ‘గజ్జి కుక్కా” అని పబ్లిక్ గా తిట్టించుకునే స్థాయికి దిగజారిపోయాడు.
>>>>>
Yes, I was much inspired by Niharika. And also don’t fortget blogveekshanam who is also the preceptor of all the anti-kelukudu activists. Niharika is the preceptress and blogveekshanam is the preceptor.
–మిమ్మల్ని లండన్ నుంచి వచ్చి తిట్టింది అబ్బాయికాదు, అమ్మాయి. బ్లాగుల్లో చాలా పాపులర్ పేరు ఆమెది.”–
అవునా? మై గుడ్‌నెస్! మరో షాకిచ్చారు. ఎవరావిడ? పేరు, వివరాలు ఇవ్వలేదేం మీరు?
ఆమాట నూటికి నూరుపాళ్ళూ నిజం. నీహారిక గనక మొందుగా గొంతెత్తి ఉండకపోతే ఈ వెధవల దురాగతాలని ఇంకా అనుభవించాల్సి వచ్చేది. నీహారిక రాసిన టపాలమూలంగానే వీళ్ళమీద జనాలకి లోలోపల ఉన్న అసంతృప్తి బయటకివచ్చింది. శంకరాభరనం గారు కూడా మలక్ చుట్టూ మంచు,SNKR లాంటి దౌర్భాగ్యులు చేరినందుకు చాలా బాధపడ్డారు.
–మిమ్మల్ని లండన్ నుంచి వచ్చి తిట్టింది అబ్బాయికాదు, అమ్మాయి. బ్లాగుల్లో చాలా పాపులర్ పేరు ఆమెది.”–
అవునా? మై గుడ్‌నెస్! మరో షాకిచ్చారు. ఎవరావిడ? పేరు, వివరాలు ఇవ్వలేదేం మీరు?
————————————————
భరారేని అడగండి
ఆమె భరారే జీవితంలో ఒక పీడకల, ఓ వర్షం కురిసిన రాత్రి ,,
(పై కామెంటు కట్ అయ్యింది. మిగిలింది ఇక్కడ రాస్తున్నా)
అంత విలువ ఇవ్వడానికి ఇక్కడ ఏమీ లేదు. కానీ మన భావాలను ఒక పద్ధతిలో పెట్టడం ద్వారా మన బ్లాగింగ్ జీవితం బ్లాగింగ్ కి వన్నె తెచ్చేలా ఉండాలే కాని దానిని వ్యక్తిగత జీవితంలోకి చొరబడనీయకండి. అది మీకి చేటు తెస్తుంది.
తెలంగాణ గురించి మీరు సూచించిన పరిష్కారం అసలు పరిష్కారం కాదు. తెలంగాణ వాళ్ళు కోరుకుంటున్నది అది కాదు. మీకు వీలయితే నా బ్లాగ్ ట్యాగ్స్ లో ‘తెలంగాణ’ మీద క్లిక్ చేసి “తెలంగాణ డిమాండ్ పై జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రభావం ఎలా ఉంది?” అన్న టపా చదవండి. నా అభిప్రాయాలు వివరంగా అర్ధం అవుతాయి. తెలంగాణపై అభిప్రాయం ఒక్క ముక్కలో చెప్పేది కాదు. చెప్పినా అది ఎవర్నీ సంతృప్తి పరచదు. మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తుంది. తెలంగాణకి పరిష్కారం తెలంగాన జిల్లాలతొ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడమే. అక్కడి ప్రజలకు కావలసిందే అదే. సీమాంద్ర ధనికులు తమ ఆస్తులు పోతాయేమో అన్న భయంతో హైద్రాబాద్ పైన పేచి పెడుతున్నారు. కాని వారి ఆస్తులు ఎక్కడికీ పోవు. తెలంగాణ ఏర్పడినాక వారికి తెలంగాణ ధనికుల నుండి బడ్జెట్ కేటాయింపుల్లో వాటా తగ్గవచ్చు. అదే వారి భయం.
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం జరిగిన నేపధ్యంలో తెలంగాణ ధనికులకే బడ్జెట్ లో కేటాయింపులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. విడిపోతే సీమాంధ్ర బడ్జెట్ కంటె తెలంగాణ బడ్జెట్ రెట్టింపు ఉన్నా ఆశ్చర్యం లేదు. అటువంటి పెద్ద బడ్జెట్ నుండి తమకు వాటా దక్కదన్నదే లగడపాటి, కావూరిల ప్రధాన భయం. అందుకే తెలంగాణను అడ్దుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రకు నీళ్ళు అన్నీ తెలంగాణ మీదు గానే రావాలి. వాళ్ళిస్తారోలేదోనని కావూరి లాంటి భూస్వాములు భయపడుతున్నారు. ఇవ్వకపోవడం జరగదు. పాకిస్ధాన్, ఇండియా ల మధ్య కూడా జల ఒప్పందాలు కుదిరాయి. సీమాంధ్ర, తెలంగాణల మధ్య కుదరకపోవడం జరగదు. సీమాంద్ర ధనికుల ఉడుంపట్టునుండి విడివడితే అభివృద్ధి కావచ్చునని తెలంగాణ ధనికులు భావిస్తున్నారు. మళ్ళీ అదే సీమాంధ్రులను ఎ.పి బదులు తెలంగాణ అని పేరు మారిస్తే వచ్చే లాభం ఏముంటుంది?
ప్రజల్లో అనేక ఆర్ధిక తరగతులవారున్నారు. తెలంగాణను ఏయే వర్గాలవారు ఏయే కారణాలతో డిమాండ్ చేస్తున్నదీ ముందు మనం అర్ధం చేసుకుంటే మనం సూచించే పరిష్కారం అర్ధవంతంగా ఉంటుంది. “వాళ్ళు పది జిల్లాలు అడిగారు, మనం ఇరవై మూడు ఇద్దాం” అన్నది అసలు పరిష్కారం కాదు. ఫన్నీగా ఉంది అంతే. ఇవ్వడానికి మనం ఎవరం? మనం ఇస్తే తీసుకోవడానికి వాళ్లెవరు? ప్రజలంతా మూకుమ్మడిగా తమ ప్రాంతాన్ని రాష్ట్రంగా కావాలని కోరుతున్నపుడు ప్రజాస్వామిక ప్రభుత్వాలు తప్పని సరిగా అంగీరించవలసిన బాధ్యత ఉంటుంది. కాకపోతే ఈ ప్రజాస్వామిక ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం లేనందున తెలంగాణ డిమాండ్ ఇన్నాళ్లు సాగతీసారు. ఎంతసేపటికీ ధనికుల ఆస్తులపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు కాని శ్రమచేసే జనం అంతా రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నపుదు తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. అలా చేస్తేనే ఇది ప్రజాస్వామ్యం అవుతుంది.
ఇస్తే వాళ్ళడుగుతారు, వీళ్లడుగుతారు అని చెప్పడం ఆటంకపరచడానికే. ఇతరులు కూడా రాష్ట్రాన్ని అడిగితే అక్కడ కూడా సాధ్యాసాధ్యాలను, డిమాండ్ వేలిడిటీని పరిశీలించి తగునిర్ణయం తీసుకోవాలే తప్ప వాటిని చూపి తెలంగాణను ఆటంకపరచడం సరికాదు. స్వార్ధ ప్రయోజనాల కోసమే అలా చేస్తున్నారు. బ్లాగింగ్ లో తెలంగాణ ఇవ్వడం పైన విధ్వేషపూరితంగా చర్చలు చేసుకుంటున్నారు. అంత అవసరం లేదు. వారిలో చాలామందికి తెలంగాణ డిమాండ్ ఎందుకు పుట్టిందీ తెలియదు. తెలంగాణను అనుకూలిస్తున్నవారికి ఎందుకు అనుకూలిస్తున్నదీ తెలియదు. వ్యతిరేకిస్తున్నవారికి ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ తెలియదు. కనుక వాళ్ల చర్చల్లో చాలా వరకు అర్ధం ఉండడం లేదు. తిట్టుకోవడం తప్ప.
ఎక్కువ రాశాను. నా సమాధానాలు అలాగే ఉంటాయి. నేను చెప్పింది సమగ్రంగా ఉండాలని చూస్తాను. అందువలన సైజు పెరిగిపోతుంది. మీ ఓపికకు పరీక్షే ఇది.
ఇందు మూలంగా బ్లాగ్మిత్రులకు తెలియచేయునది ఏమనగా అందరూ రాజకీయాలలో మార్పు కోరుకుంటారు కానీ ఎవరూ మార్చడానికి ముందుకు రారు. ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించకుండా అవహేళనలు ఆరోపణలు చేస్తుంటారు.
ఒక బాధ్యత కలిగిన పౌరులు గా ఓటు వేయడం మీ భాధ్యత. ఓటు వేయాల్సిన అవసరమే లేదు అనడం మీ భాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తుంది. ఓటు వేయని బ్లాగ్మిత్రులకి 1000 రూ జరిమానా విధిస్తాను.
ఆ సొమ్ము ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు.
ఓటు ఎవరు వేయలేదో నాకెలా తెలుస్తుంది అని అడుగుతారు, నాకు తెలియక పోవచ్చు కానీ మీ మనసుని మీరు మోసం చేసుకోలేరు.
@ భరద్వాజ్,
మీకు నావల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. విశేఖర్ గారికి నా వివరణ ఇస్తాను. ఇపుడు సమయం లేనందువల్ల చెప్పలేకపోతున్నాను.
ఈ పోస్టులో మొదటి పేరా, చివరి పేరా తప్ప నా గురించిన వివరములు మొత్తం డెలిట్ చేయండి. ఇపుడు బయటి వారు కూడా మీ బ్లాగు చూడవచ్చు.
రాజకీయాలలో నూతన ఒరవడి నేనే మొదలుపెడుతున్నాను. కమెంట్స్ కూడా డెలిట్ చేయండి.
ఇక నేను ఎవరు అన్న వివరాలు ఈ క్రింది పోస్టులో చూడగలరు. ఈ ఒక్క కమెంట్ మాత్రం ఉంచి అనవసర చెత్త కమెంట్స్ తీసివేయండి.
http://ramyamgakutirana.blogspot.com/2009/07/blog-post_15.html
విశేఖర్ గారు,
మీ సమయాన్ని వెచ్చించి ఇంత ఓపికగా వివరించిన బ్లాగర్లను నేనింతవరకూ చూడలేదు. మీ బ్లాగులో నేను కొన్ని మాత్రమే చదివాను కనుక వాటి గురించి గానీ.. మీ గురించి గానీ ఒక అభిప్రాయానికి రాలేదు. ప్రస్తుత విషయం గురించి మాత్రం చర్చిద్దాం.
రాజకీయాలలో క్రియాశీలకం గా లేకపోయినప్పటికీ, రాజకీయ నాయకురాలిగా కాక ఒక “లీడర్” గా ఎదగాలని నా ఆశ. అందుకే నేను ఈ దేశానికి సంభందించిన రెండు ముఖ్య విషయాలు పరిష్కరించాలని ఆశపడుతున్నాను
.
ఏ చాలెంజ్ లేకుండా జీవితం గడపడం అంటే నాకు చిరాకు. మీరు రాజకీయాలు రాస్తున్నారు కాబట్టి అందరితో పాటు మీకు కూడా ఆహ్వానం పంపడం జరిగింది.
అమెరికా విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను, నేను శ్రమని నమ్ముకున్నదాన్ని కాబట్టి నాకు కమ్యూనిష్టులపై వ్యతిరేకత లేకపోయినా పెట్టుబడి దారులని అనవసరంగా ద్వేషించటం నాకు నచ్చదు. ఈ విషయం లో నేను ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి గారి అభిప్రాయాలు గౌరవిస్తాను. అవకాశం వచ్చింది కాబట్టి చెపుతున్నాను, తెలంగాణా వారు ఏమనుకుంటారంటే ఆంధ్రా వాళ్ళు మా అవకాశాలు లాక్కుంటున్నారు, మా ఆస్తులు లాక్కుంటున్నారు, మా సొమ్ము , మా నీళ్ళు లాక్కుంటున్నారు అని ఆవేశపడిపోతుంటారు. అది నిజం కాదు. ఒకరిని ఒకరు అణగదొక్కటం జరుగదు. మనకై మనం లొంగిపోతే తప్ప మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మేము హైదరాబాద్ వచ్చేసరికి మా దగ్గర్ పైసా లేదు. ఇంట్లో నేను, బయట ఆయన చాలా కష్టపడ్డాం. మేమెవరి సొమ్మూ లాక్కో లేదు. పగలు ఆఫీసు సాయంత్రం బిజినెస్సు చూసేవారు. మా అందమైన సాయంత్రాలను కోల్పోయామే తప్ప ఎవరికీ ఏ అన్యాయమూ చేయకుండానే వృద్ధి లోకి రావడం జరిగింది. అంతా అయిపోయాక నువ్వేం చేసావు అనడం నాకు కోపం తెప్పించింది. ఆయన ఎలా ఎదిగారో నేను చూసాను…. అలాగే నేను మళ్ళీ ఎదగాలి అని పట్టుదలగా ఉన్నాను కానీ …. విడిపోతాను అని మొండి పట్టు పట్టలేదు.
ఎందుకు చెపుతున్నానంటే మీరు తెలంగాణా కి నా పరిష్కారం నచ్చలేదు అని అన్నారు కాబట్టి చెపుతున్నాను. తెలంగాణా వారు మునుపటిలా ఉండడం కూడా సాధ్యం కాదు, అలాగని విడిపోనవసరం లేదు. ఇక్కడ నాయకులు తమ స్వార్ధం కోసం ఉద్యమం మొదలుపెట్టారు.
మీరే చూడండి, ఇపుడు పోలింగ్ పెట్టాను కదా కేవలం 25 మంది (ఇది వ్రాసే సమయానికి) ఓట్ వేసారు 10 మంది అనుకూలంగా 10 మంది వ్యతిరేకించారు 5 గురు తటస్థంగా ఉన్నారు. ఓటు వేయని వారు 1000 మందికి పైగా ఉన్నారు. ఇదీ పరిస్థితి. ప్రక్కన ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరు, ఎవరిగోల వారిదే !! సంవత్సరం నుండి ఈ నాయకుల చుట్టూ తిరుగుతున్నాను, పేరు మార్చడానికే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు, వారు రాష్ట్రం ఇస్తారా ? మీరేదో నేనేదో పేరు మార్చేయమనగానే వారు ఒప్పేసుకున్నట్లు, తెలంగాణా వారికి అన్యాయం జరిగిపోయినట్లు ఊహించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అనే కంచుకోటలోకి ప్రవేశించాలంటే రెండు సింహద్వారాలు దాటాలి. ఒకటి కాంగ్రెస్.. మరోటి తెలుగుదేశం… మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి? ఇలా జనాలని ఇబ్బంది పెడుతూ ఎన్ని రోజులు చేస్తారు? గూర్ఖాలాండ్ లో కరెంట్, వాటర్ బంద్ చేసారు. అలా ఇక్కడ కూడా చేస్తామంటున్నారు. అలా చేసినా జనం వ్యతిరేకతే తప్ప ప్రయోజనం శూన్యం.
ఇప్పటి పరిస్థితిలో నేను సూచించిన పరిష్కారం ఒక్కటే మార్గం, అలాగయితే కంచుకోటలోకి దర్జాగా వెళ్ళవచ్చు. వారికి కావలిసిన పనులు వారు చేసుకోవచ్చు. తెలంగాణా వారు ఊరికే రాష్ట్రం వచ్చేయాలని కోరుకుంటున్నారు, ఊరికే మామ గారి దగ్గర నుండి చీల్చుకుని తెచ్చుకున్న తెలుగుదేశం పరిస్థితి ఏమయింది? ఆయన ఎంత కష్టపడ్డా మళ్ళీ అధికారం లోకి రాలేక పోయారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవచ్చు. ఊరికే రావాలని, ఎవరో తెలంగాణా తెచ్చి ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు ? తెలంగాణా వారే కష్టపడి తెచ్చుకోవాలి. ఊరికే ఏదీ రాదు , ఊరికే వచ్చింది మన దగ్గర ఉండదు.
నేనిద్దాం అనగానే ఆంధ్రా వాళ్ళు ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటారనుకుంటున్నారా ? మీకే కాక ఇక్కడ రాజకీయాలు వ్రాసే కొంత మంది పెద్దలకి కూడా ఎదైనా విషయం పట్ల బ్లాగర్లు ఎలా స్పందిస్తారో చూపించాలని ఆ పోల్ పెట్టాను.
<>
ప్రమదావనం, ప్రమోదవనం , ప్రమాదవనం & ఇతర బ్లాగర్లు అని నా ఉద్దేశ్యం.
<>>
రాష్ట్రానికి సంబందించిన విషయం మీకు అవసరం లేదా ? అయితే ఇంతమందిని అలరిస్తూ ఎందుకు రాస్తున్నారు? మీ వృత్తి ఏమిటి? ఇక్కడ ఎందుకు రాస్తున్నారు? మీ డైరీ లొ రాసుకోవచ్చుగా ? ఒక ఆత్మకధ రాసుకుని పుస్తకంగా ప్రచురించుకోవచ్చుగా ?
ఈ రాష్ట్రం నాది , నాకు సంబందించినంత వరకూ ఇల్లైనా, రాష్ట్రమైనా , దేశమైనా విడిపోడానికి నేను ఒప్పుకోను కాబట్టి నేను వ్రాస్తున్నాను, తిరుగుతున్నాను. అవసరం నాది కాబట్టి కె బ్లా స గడప తొక్కాను. మీకవసరం లేదు…. కానీ వ్రాస్తారు. ప్రజలకు ఏమీ చేయనవసరం లేదు. కనీసం బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా స్పందించకపోవడం ఆత్మహత్యాసదృశ్యం.
నేను సంధి కాదు చేసుకుంది, రాయబారం నడుపుతున్నాను. యుద్ధానికి ముందు చర్చలు, రాయబారం అవసరం.
తెలంగాణా వారు ఎలాగూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు , యుద్ధం చేయమంటున్నాను. బ్రతకలేక చావడం కాదు, చస్తే వీరులుగా చావాలి. ధర్మ యుద్ధాన్ని చేయమంటున్నాను.
<>
దీనిలో అంత పెద్దగా ఆలోచించవలసిన పనిలేదు, నేను ఒంటరిగా పోరాడుతున్నాను కాబట్టి అందరినీ కలుపుకు పోవాలని ప్రయత్నం చేసాను. ఇంతకు ముందు బ్లాగు సోదరి ఆ ప్రయత్నం చేసారు. నచ్చచెప్పలేక వదిలేసారు.
ముందుగా కత్తి మహేష్ గారిని అడిగాను, అపుడు ప్రవీణ్ కూడా ఉన్నాడు అపుడు ఏమీ మాట్లాడకుండా ఇపుడు మాట్లాడుతున్నాడు. మీరు ఒకరోజు కుమార్ తో మాట్లాడానన్నారు, నేను కూడా కె బ్లా స తో ఒకరోజు మాట్లాడి నా ఉద్దేశ్యాన్ని తెలిపాను. నా వెనుక ఎవరూ లేరని చెప్పాను.
నేను బి జె పి ని వ్యతిరేకించటం లేదు, వారి క్రమశిక్షణ నాకు చాలా నచ్చుతుంది, కానీ హిందూమతాన్ని అడ్డుపెట్టుకుని అధికారం లోకి రావాలనుకోవడం నాకు నచ్చదు. మతాన్ని ఎవరు అడ్డుపెట్టుకున్నా నేను వ్యతిరేకిస్తాను.
సి ఐ ఎ గురించి, గూగుల్ గురించి మీరు చెప్పినది నిజంగా జరిగి తెలుగు బ్లాగుల మీద అంతర్జాతీయ దృష్టి పడితే అంతకన్నా కావలిసినది ఏమీ ఉండదు. మీరు వారిని అనుమానించినంత “దృశ్యం” వారికి లేదు. అజ్జాతలు తప్ప వారిలో చాలా మంది వారి సొంత పేర్లతో వ్యవహరిస్తున్నారు, మీకు పరిచయం లేదు కానీ… వారంతా ఇక్కడి వారే, ముఖ్యంగా చెప్పాలంటే “దేశభక్తులే” వారిలో ఒక లక్ష్యం లేక అందరినీ వ్యతిరేకిస్తుంటారు. వీళ్ళనీ వాళ్ళనీ కాదు ఎవరినైనా వ్యతిరేకిస్తుంటారు.
నేను మొదట్లో అలా ఎందుకు చేస్తున్నారా అని ఆలోచించాను, వారంతా మాలిక నడుపుతున్నారు, వారి మాలిక కు హిట్స్ పెంచుకోడానికి వారలా చేస్తున్నారేమో అని అనుకున్నాను. వారిని నిలదీసాను కుడా … కానీ వారికి ” మాలిక ” మీద ఆదాయం రాదని అది ఒక వ్యాపకం మాత్రమే నని అన్నారు. నిన్ననే హారం వారు కూడా అది దృవీకరించారు, ఇన్ని కోట్ల హిట్స్ వస్తుంటే ఆదాయం ఎందుకు రావడం లేదో నాకు తెలియడం లేదు. నా బ్లాగుని మోనిటైజ్ చేయటం నాకు చేత చేతకాలేదు, చెప్పేవారు లేరు, అందుకే ధర్మచక్రాన్ని పెట్టాను. దాని వల్ల మనలోని చెడు పోయి మంచి మనలోకి వస్తుంది. దాని గురించి వివరాలు కావాలంటే om mani pad me hum ని గూగులికరించి చూడవచ్చు.ఆ చక్రం వల్లనో, నాకున్న నమ్మకం వల్లనో రోజూ ఒక కొత్త ఐడియా మాత్రం వస్తుంది. ఆ చక్రం తయారు చేసిన వారికి ఆదాయం వస్తే మంచిది కదా… దేవుడి హుండీ లోకి డైరెక్ట్ గా డబ్బు వేస్తున్నానని నాకు నేనే ఫీలవుతాను.
<>
ఒక చెంపకి రెండు చెంపలు ఏమిటి సర్ మొత్తంగా నా శరీరాన్ని ఇచ్చేస్తాను,(Don’t show gender difference) నాకంత ఆవేశం గా ఉంది. ప్రవీణ్ తో పాటు చాలా మంది నేను చేసేది కరెక్ట్ అనే అంటారు కానీ ఏదయినా చేద్దాం అంటే ఒక్కడు ముందుకు రారు. ఒక పోల్ పెట్టి ఓటు వెయ్యమంటే ఎందరు వేసారు? పొగడ్తలు నేనేం చేసుకోను సర్! నాకు పని అవ్వడం ముఖ్యం ఎలా చేసాను? ఏమి చేసాను? అన్నది నేను చూడను. సరిగ్గా సంవత్సరం క్రితం అక్టోబరు 3 న నన్ను ఈ బ్లాగర్లు వసంత కోకిలను చేసారు, మొమైత్ ఖాన్ ని చేసారు, అన్నింటినీ భరించాను భరిస్తూనే ఉంటాను. ఇంట్లోనూ అంతే బయటా అంతే!!
కుమార్ అన్న వ్యక్తి అంటే నాకు అసహ్యం. మీకు పరిచయం కాని కధానాయకుడు ఇంకొకరు ఉన్నారు, వారు శరత్ అనే బ్లాగర్, ఆయన మల్లన్న దేవుడు అనే పోస్టు వ్రాసారు, అందులో కుమార్ అనే వ్యక్తి ఒక అసభ్య కమెంట్ చేసాడు. నాలాగా నోరు ఎత్తే స్త్రీలందరినీ దారుణంగా చెరిచాడు. అదేమని ఒక్కడు అడగలేదు. అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కడు వ్యతిరేకించలేదు. దానిని నేను వ్యతిరేకిస్తూ సీతాదేవి మీద పోస్టు వ్రాయటం జరిగింది. ఇక్కడున్న స్త్రీలకు, ఇతర పెద్దలకు ఆ పోస్టు టైటిల్ నచ్చక ఆవేశం తో, పోస్టులు, కమెంట్స్ వ్రాసి నన్ను కూడలి నుండి, మాలిక నుండి తీసివేయడమే కాక మా ఇంటికి ఫోన్ చేసి నా నెట్ కనెక్షన్ తీయించడం జరిగాయి. ఇక్కడున్న వారికి ఎదుటి మనిషిలో దేవుడిని చూడడం తెలియదు కానీ ఎక్కడో ఉన్న దేవుడికి మొక్కుతారు. మీకు జరిగిన అవమానం కంటే రెట్టింపు అవమానం నాకు జరిగింది. పోరాటం అనేది నేను పుట్టినప్పటినుండీ చేస్తున్నాను కాబట్టి అది నాకు పెద్ద విషయం కాదు. నా కాన్సంట్రేషన్ మొత్తం “మిషన్ కాశ్మీర్” మీద ఉంది. ఎవరు ఏమన్నా 2014 వరకు పట్టించుకోను. అంతా అనుకూలంగా ఉంటే ఎవరయినా ఎదుగుతారు, ఏ రాజకీయ అండా లేకుండా నేను ఎదుగుతాను.
నాన్నని గెలిపించాలని, తమ్ముడిని గెలిపించాలి , భర్తని గెలిపించాలి, కొడుకుని గెలిపించాలి, ఇపుడు నా దేశాన్ని గెలిపించాలి అని నేను ఓడిపోతూనే ఉన్నాను. నా బ్రైన్ అలా తయారు చేసాడు దేవుడు మన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ సర్.
కువిమర్శ ని సద్వినియోగపరుచుకోవచ్చు సర్, కుమార్ విమర్శ అసహ్యకరమైనది. దానిని నేను అసలు సహించను, ఆ విషయం లో దేవుడిని కూడా ఎదిరించాను. ఈ అజ్జాతల కమెంట్స్ ఉన్నాయి చూసారా నేను చాలా ఎంజాయ్ చేస్తాను, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఒక సందేశాన్ని ఇస్తారు, అలా చేస్తే ఎలా ఉంటుంది అని…. అలానే నేను చేసేస్తాను. నాకు అవి చాలా ఉపయోగపడుతున్నాయి, ఇంత మంచి ఐడియాలిస్తున్నారు శిఖండులలాగా ఉంటారేమిటిరా అని డైరెక్ట్ గా తిట్టినా ఏమనుకోరు, పాపం వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే…. కానీ తమ పేరు చెప్పుకునే ధైర్యం లేదు. వాళ్ళల్లో చాలా క్రియేటివిటీ ఉంది, బర్మా సుయ్ సుయ్ ……కుట్టుమిషన్ కాశ్మీర్ ….ఎంతగా పడీ పడీ నవ్వుకున్నానో …. మడిసన్నాక కాస్త కళాపోసన ఉండాలి సర్ ! మిమ్మల్ని చూస్తే మా ఆయన బ్లాగు రాస్తే ఎలా ఉంటుందో అలా వ్రాస్తున్నారు. ఆయన చెప్పేవి అన్నీ నాకు నచ్చవు…. మరి భార్యా భర్తలం కదా ఆ మాత్రం డిఫరెన్స్ సహజం.
నేను మా ఆయన తిట్టేస్తారేమో అని వాళ్ళని టపాలు తీసేయమనడం జరిగింది. కానీ మీరు మెత్తగా తిట్టేసారు. మా ఆయన అయితే కొంచెం రఫ్ గా తిట్టేవాళ్ళు. నేనే వాళ్ళవైపు ఉన్నాననుకోండి ఇక తిట్టరు కదా… అందుకని అక్కడ ఉన్నాను. మా ఇల్లొక కంటోన్మెంట్ ఏరియా… ఈగ కూడా వాలడానికి వీల్లేదు. ప్రమోదవనం బేచ్ తో పనిచేసాననుకోండి… మా ఇంటికి బ్లాగుకి తేడా ఉండదు, సీరియస్ గా ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నామనుకుంటారు,(ముఖ్యంగా మహేష్) సరదాగా లేకపోతే నేను ఉండలేను. అందరూ నాకేం తక్కువ అని అంటారు, మనిషికి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోతుందా? అన్నీ పద్దతిగా మిలటరీ రూల్స్ ( మా ఆయన డిఫెన్స్ లో సైంటిష్ట్), ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు అంతా డ్యూటీ ప్రకారం జరిగిపోవాలి. ఆఫీస్ లో డ్యూటీ చేయవచ్చు ఇంట్లో కూడా ఆఫీసర్ లాగా ఉంటే ఎలా ?
<>
నేను కొన్ని టపాలు వ్రాస్తున్నపుడు నేను ఎలా ఉంటానో చూడాలని చాలామంది అడిగేవారు. రచయత/రచయిత్రి ఎలా ఉంటారో చూడాలని పాఠకులకు కలగడం సహజం.
నా వ్యక్తిగత జీవితం గురించి నా వెనుక చెడుగా చెప్పుకోకూడదు అని నేనే అన్నీ చెప్పేస్తాను. అత్తింటి కష్టాలు పుట్టింట్లో చెప్పకూడదు, పుట్టింటి కష్టాలు అత్తింట్లో చెప్పుకోకూడదు, మరి దాచుకుని చచ్చిపోవాలా? నా గురించి మొత్తాన్ని చెప్పేస్తాను , నేను ఏ తప్పూ చేయనపుడు ఎవరికి భయపడాలి ? ఒకవేళ తప్పుచేసినా, చేయాల్సివచ్చినా అంగీకరిస్తాను. ఈ తప్పు నేను చేసానని ధైర్యంగా అంగీకరిస్తాను. ఏ తప్పూ చేయకుండా ఎవరైనా ఉంటారా ? సమాజం ఏమనుకుంటుంది అని చూడను సర్… ఆ రోజుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. రేపొద్దున్న నేను చేసింది కరెక్ట్ కాదనుకున్నానుకోండి మారిపోతాను. నేను ఎవరినీ మార్చాలనుకోను మారతాను. మారటం నా చేతిలో పని, మార్చటం కష్టం.
ఎదుటి మనిషి ఇలా చేస్తున్నాడు అని తెలియగానే వారికి ఎదురు పని చేయటం మొదలుపెడతాను, అపుడు చచ్చినట్లు వారు కూడా నాకు ఎదురు పని మొదలు పెడతారు. అపుడు నా పని అయిపోతుంది, వారిని గెలిపించినట్లు ఉంటుంది నా పని జరిగిపోతుంది. దీనినే Win/Win సిట్యుఏషన్ అంటారు గెలువు…. గెలిపించు.
తెలంగాణా కావాలి అంటే చచ్చినట్లు 23 జిల్లాలు తీసుకోవలిసిందే….. కలిసి ఉండాలంటే చచ్చినట్లు పేరు మార్చుకోవలిసిందే !!
ఇంతా చేసి నేను ఊరికే పేరు మార్చేస్తారని అనడం లేదు. దానిని తెలంగాణా వారు గెలిచి సాధించుకోవాలి. ఊరికే ఇచ్చేసామని ఈ ఆంధ్రా వాళ్ళు ఫోజులు కొడతారు.
పల్నాటి యుద్ధం అయినా మహాభరత యుద్ధం అయినా ఒక పందెం తో పోరాటం మొదలుపెట్టారు. ఒకరు కోడి పందెం వేస్తే, ఒకరు జూదం ఆడారు.
ఇపుడు నేను “కారు” పందెం పెడతాను. తెలంగాణా వారు “కారు” గెలుచుకోవాలి . కారు ఎవరికి వస్తే వారిదే ఈ రాష్ట్రం. మన కంటే ముందు పుట్టిన వాళ్ళకు ఇటువంటి ధర్మ సందేహం కలిగినపుడు పందెం వేసి దేవుడిపై భారం వేసారు. మనమేమన్నా అంతకు భిన్నంగా వ్యవహరిస్తున్నామా ? ఎటూ తేల్చలేకపోతున్నాం కదా ?? ఎటూ తేలనపుడు ఏం చేస్తాం ?
ప్రభుత్వం ఈ పని చేయదు కాబట్టి మనమే చేద్దాం అంటున్నాను. గాంధీ స్వతంత్ర్య పోరాటం చేసి అలసిపోయారు, అపుడు విధిలేక దేశాన్ని విడగొట్టారు, ఇప్పటికీ ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. పాకిస్థాన్ బాగుపడిపోయిందా? ఇండియా ఎదిగిపోయిందా? చైనా కన్నా తీసిపారేసే దేశమా మనది? ఎన్నో తెలివితేటలు ఉండి ఎదుగూ బొదుగూ లేకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు పడిఉన్నాము. ఒక శుభ్రం లేదు, శుచిలేదు, రోడ్లు బాగుండవు, అంతా అపరిశుభ్రత, పని చేయకుండా అలా తిరిగితే తెలంగాణా స్త్రీలు ఊరుకుంటారేమో గానీ మేమయితే వాళ్ళపనీ, మాపనీ మేమే చేసేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసేవాళ్ళం. ఉద్యమం చేయడం రాదు పాడు రాదు. ఉద్యమం చేస్తే ప్రభుత్వం గడ గడ లాడాలి. వాళ్ళే తిరిగి తిరిగి ఊరుకుంటారులే అన్నట్లు ఉంటే ఎలా ?
రూపాయికి చాక్లెట్ రావడం లేదు రూపాయికి కిలో బియ్యం ఇస్తామంటున్నారు. ఎవడిసొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు?
తెలంగాణా వాళ్ళు కూటికి దిక్కులేక ఉద్యమం చేస్తున్నారా ? అలా అంటుంటే ఎలా ఊరుకుంటున్నారు? పౌరుషం ఉంటే అలా అవమానిస్తుంటే ఊరుకోరు.
తాగిన వాళ్ళని తన్నండి అని పిలుపునిచ్చారు, అంటే తెలంగాణా వాళ్ళు తాగుబోతులు తాగడం కోసం ఉద్యమం చేస్తున్నారనేగా ఉద్దేశ్యం, వారి భర్తలు తాగడం భార్యలకిష్టమైనప్పుడు, వాళ్ళని తన్నమని దెబ్బకి 1000 రూ ఇస్తామని ప్రకటిస్తే… నాకయితే టి జి వెంకటేష్ కనిపిస్తే చెప్పు చూపించాలని ఉంది, భార్యని తన్నమని వీళ్ళు రెచ్చగొడితే ఎవరైనా డబ్బుకి ఆశపడి కొడితే ఎంత అవమానం? రేపటి స్త్రీలకి భర్తని కొట్టమని సందేశం ఇచ్చినట్లు అవదా?
<>
చాలా అలసిపోయాను సర్ … I am tired of run in… కానీ తెలంగాణా వాళ్ళు కూడా అలసిపోయారు, వారి గురించి పట్టించుకునేవారు ఏరీ??
ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడుగారి ఇంటికి వెళ్ళి వచ్చాను. ఆయన కి నా పరిష్కారాన్ని రాసి ఇచ్చి వచ్చాను. అందరినీ కలవడం అయిపోయింది. ఇక నాకు ఓపిక లేదు. నేనే ఒక క్రికెట్ మేచ్ పెట్టి …..మేచ్ ఫిక్సింగ్ చేసేసి ….. నేనే తెలంగాణా వారిని గెలిపించేస్తాను. ఎవడు ఏం పీక్కుంటారో పీక్కోమంటాను, అన్నీ చూసి రివ్యూలు వ్రాయడం మాత్రం మర్చిపోకండి !! రాయడం లోనూ, చూడడం లోనూ మన తెలుగు బ్లాగర్లకు మించిన వారు లేరని ఈ ప్రపంచానికి చూపిద్దాం !!
అక్టోబరు ఐదు తో నేను విడుదల అయ్యాను , ఈ సంవత్సర కాలంలో అన్నీ నిజాలే దిగ్విజయంగా చెప్పాను. నిజాలు మాట్లాడడానికి ధైర్యం కావాలి, ఇకముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి తలలూ తినేసాను కదా ఇక హాయిగా రాసుకోండి !!
అందరికీ విజయదశమి శుభాకంక్షలు !!!
బ్రాకెట్స్ లోనివి పొస్టులో రాలేదు
మొదటి బ్రాకెట్
మీరంతా అంటే ఎవరు అని మీ ఉద్దేశ్యం ?
రెండవ బ్రాకెట్
ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కలుపుకుపోవడం అన్న సమస్య వారిద్దరి లక్ష్యం ఒకటే అయినపుడు వస్తుంది.
మూడవ బ్రాకెట్
మలక్ అంటే మలక్ పేట్ రౌడీ అనే కదా ………?
నాలుగు
<<మిమ్మల్ని ఎన్ని అన్నా, వ్యక్తిగతంగా అన్నా, ప్రవీణ్ అన్నట్లు చేసినా, వ్యక్తిగతంగా ఎందుకు తిసుకోలేకపోయారు? అది కూడా సరైంది కాదని నా అభిప్రాయం. ‘ఒక చెంప, రెండు చెంపలు’ సిద్ధాంతం పాటిస్తున్నారా?
మిమ్మల్ని ఎన్ని అన్నా వ్యక్తిగతంగా అన్నా ఒక చెంపకి రెండు చెంపలు అన్న సిద్ధాంతం పాటిస్తున్నారా?
నీహారిక గారు,
తెలంగాణాకు సంబంధించిన మీ అభిప్రాయాలకు నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.
మీరు చెప్పినట్టుగా రాష్ట్రం పేరు మారిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. గత యాభై సంవత్సరాలుగా తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు. దానికి రాష్ట్ర విభజన మాత్రమే పరిష్కారమని కూడా నమ్ముతున్నారు.
ఈమాటలు చెప్పేటప్పుడు ఆంధ్రా ప్రాంతం వారు అన్యాయాలు చేసేవారనో, లేక తెలంగాణా ప్రాంతం వారు అమాయకులనో నేను చెప్పడం లేదు. అమాయకులు, అన్యాయాలు చేసేవారు రెండు వైపులా వుంటారు. మనం స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై మహత్తరమైన పోరాటం చేశాం. అంత మాత్రాన సగటు బ్రిటీష్ పౌరుడు దుర్మార్గుడని కాదు.
అలాగే సగటు ఆంధ్రుడు మంచివాడు, స్నేహశీలి అయినప్పటికీ తెలంగాణా వారికి అన్యాయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకున్న వ్యవస్థ వంద శాతం ప్రజల అభీష్టాల మేరకు పనిచేసే వ్యవస్థ కాదు. మన వ్యవస్థకు అంతటి పరిణతి లేదు, ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు.
రాష్ట్ర విభజనకు దారితీసిన విషయాల్లో మూల కారణం ఆంధ్రా తెలంగాణా ప్రజల శాతంలో గల తేడా. నలభై రెండు శాతం తెలంగాణా వారుంటే యాభై ఎనిమిది శాతం మంది ప్రజా ప్రతినిధులు ఆంధ్రా ప్రాంతం నించి వుంటారు. కాబట్టి ఒక ప్రాంతంగా తెలంగాణా ఈ వ్యవస్థలో ఎప్పటికీ పైచేయి సాధించ లేదు. నిర్ణయాత్మకంగా శక్తిగా ఎదగలేదు.
అలాగని తెలంగాణా ఒక చిన్న ప్రాంతం కూడా కాదు. అలా ఐతే ఆంధ్రా ఆధిక్యాన్ని అంగీకరించి అనుసరించేవారు.
కాని తెలంగాణా నాలుగు కోట్ల జనాభా కలిగిన ఒక పెద్ద ప్రాంతం. రాష్త్రంగా ఏర్పడ్డా, ఇప్పుడు దేశంలో వున్న పద్ధెనిమిది రాష్ట్రాల కన్నా పెద్దదే అవుతుంది. ఇది జీవనదులు పారుతున్న, గనులు నిక్షిప్తమై వున్న ప్రాంతం. కాని వనరులు వున్నా అవకాశాలు కొల్లగొట్ట బడ్దాయి. దానికి మరలా సగటు ఆంధ్రా పౌరుడు కారణం అని అనడం లేదని గ్రహించాలి. అది వ్యవస్థలోనే వున్న లోపం.
ఈ లోపాన్ని సవరించడానికి వున్న తక్షణ మార్గం రాష్ట్ర విభజన. రాష్ట్రం విభజింప బడితే రాష్త్రాలు స్వపరిపాలన చేసుకుంటాయి కాబట్టి ఏ ప్రాంతం వనరులపై ఆ ప్రాంతానికే ఆధిపత్యం వుంటుంది. కాబట్టి రెండు ప్రాంతాలకు సహజ సిద్ధమైన న్యాయం లభిస్తుంది.
మీరు చెప్పిన పేరు మార్పిడి వలన ప్రాంతాల జనాభా దామాషాలో ఎలాంటి మార్పు వుండదు. కాబట్టి పేరు ఏదైనా పరిపాలించే వర్గం ఆంధ్రాప్రాంతం నించే ఐ వుంటుంది. కాబట్టి తెలంగాణా ప్రజలకు న్యాయం జరగదు.
మీరు నిజం గా తెలంగాణా ప్రజలకు రాజకీయంగా న్యాయం చేయాలనుకుంటే మనకున్న 42 పార్లమెంటు స్థానాలు, 294 అసెంబ్లీ స్థానాలు తెలంగాణాకు, ఆంధ్రాకు సమానంగా పంచమని చెప్పొచ్చు. అప్పుడు కనీసం రాజకీయంగా నైనా తెలంగాణా, ఆంధ్రాకి సమవుజ్జీగా మారుతుంది. పోటీ పడగలుగుతుంది. కానీ ప్రతిపాదన చేసినప్పుడే ఇది సాధ్యమయ్యే విషయం కాదని మీరే అంటారు.
ఇక మిగిలింది రాష్ట్ర విభజన మాత్రమే.
భా రా రే నాకు మ౦చి మిత్రులనే అనుకు౦టున్నాను ! నా వల్ల వారికి సమస్య ఎప్పుడు రాలేదు, రాదు.
ఇక్కడ ల౦డన్ ని నాకు రాసిచ్చిన వారికి ధన్యవాదాలు, శేఖర్ గారు మీ బ్లాగులో ఇదేనా నా మొదటివ్యాఖ్య? మీ రాజకీయాలు నాకు అర్ధం కావు, కాని ఈ టపా లో చాలా చర్చే జరిగి౦ది. మ౦చి ప్రయత్నం . అభిన౦దనలు
మౌళి గారూ, నిజానికి నేను ప్రస్తావించిన లండన్ వ్యాఖ్యాత నేను ఎరిగిన వ్యక్తి (నా బ్లాగ్ లో వ్యాఖ్యల ద్వారానే) అనే అనుకున్నాను. కాని ఒకే ఐడెంటిటీ కొనసాగించకుండా వివిధ పేర్లతో బ్లాగర్లు సంచరిస్తున్నందున మిత్రుడు పాఠకుడు చెప్పినది నిజం కావచ్చు అనుకున్నాను. కాని ఒక మూల అనుమానం లేకపోలెదు. మీ వ్యాఖ్యతో అనుమానం నివృత్తి అయిందని భావిస్తున్నాను.
భరారే గురించి నాకేమి తెలియదు. మీరు, వారి గురించీ నాకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు.
ఏ సందర్భంలో మీకు నా రాజకీయాలు అర్ధం కాలేదు?
నేను చెబుతున్న రాజకీయాలు అర్ధం కాకపోవడం అన్నది మీకు సమస్యో కాదో నాకు తెలియదు కాని నాకు మాత్రం ఖచ్చితంగా సమస్యే. మరింత అర్ధం అయ్యే విధంగా చెప్పవలసిన బాధ్యత నాపైన ఉంటుంది. కనుక మీరు చర్చ జరపడానికి సిద్ధపడితే నేను సిద్ధంగానే ఉంటాను. ఏ అంశాలలో అర్ధం కాలేదో చెబితే చర్చించడానికి ప్రయత్నిస్తాను. మీకు ఇష్టం ఉంటెనే సుమా.
-విశేఖర్
నీహారిక గారూ, మీరు అన్ని విషయాలను ఒకే చోటికి తెస్తున్నట్లు కనిపిస్తోంది. మళ్లీ వివరంగా సమాధానం ఇస్తాను. ఈసారి క్లుప్తంగా రాయడానికి ప్రయత్నిస్తాన్లెండి. కాని మీరు తడిమిన అంశాల విస్తృతి దృష్ట్యా మళ్ళీ మీ ఓపికకు పరీక్ష పెడతానేమో చెప్పలేను.
సమానంగా పంచి ఇవ్వవచ్చు కదా??
sodi
అడిగారూ, మీరు వ్రాసే వార్తలు/వివరణలు మొదట్లో ఆసక్తి గా ఉ౦డేవి 🙂 ఇప్పుడు చూడడం లేదు . ట్రై చేస్తాను, ఇక అభిప్రాయాలు చెప్పే౦త జ్ఞానమూ లేదు.
ఖమ్మం జిల్లాలో CPI(ML)న్యూ డెమోక్రసీ నిర్వహించిన పోరు గర్జన సభకి హిందూత్వ పార్టీ అయిన BJP నాయకులని తీసుకొచ్చారు. కమ్యూనిస్టులు హిందూ మతం మీద పడి ఏడుస్తున్నారని విమర్శించేవాళ్ళు దీనికి ఏ సమాధానం చెపుతారు? సమాజం గురించి ఆలోచించేటప్పుడు మతం లాంటి ఊహాజనిత నమ్మకాలకి దూరంగా ఉండాలి కనుక మార్క్సిస్టులు రాజకీయాలలో మతతత్వాన్ని వ్యతిరేకిస్తారు. తెలంగాణా రాష్ట్ర సాధన అనే ప్రధాన లక్ష్యం ఒకటి ఉన్నప్పుడు మతం లాంటి వాటితో సంబంధం లేకుండా సంయుక్తంగా ముందుకి పోవాలి కనుక BJP నాయకులని తమ సభకి తీసుకొచ్చారు. కేవలం మతాన్ని విమర్శించాల్సిన అవసరం మార్క్సిస్టులకి లేదు కానీ మతం పేరు చెప్పి మార్క్సిజాన్ని విమర్శించాల్సిన అవసరం పెట్టుబడిదారీ వర్గంవాళ్ళకే ఉంటుంది.
Good observation Praveen. సి.పి.ఐ(ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ) పార్టీవాళ్ళు నిజానికి కాంగ్రెస్, టిడిపి, బి.జె.పిలతో పాటు ఉభయ కమ్యూనిస్టులతో కూడా వేదికలను పంచుకోవడానికి వారి అవగాహన రీత్యా వ్యతిరేకం. అవన్నీ పాలకవర్గ పార్టీలుగానే వారు పరిగణిస్తారు. కాని తెలంగాణ రాష్ట్రం లాంటి విస్తృతమైన విశాల ప్రాతిపదిక గల డిమాండ్ విషయంలో వారిని తమ వేదికపైకి ఆహ్వానించడానికి సైతం వెనుకాడలేదు. తెలంగాణ డిమాండ్ పట్ల విశాలమైన రాజకీయ పోరాటాన్ని నిర్మించవలసిన ఆవశ్యకతే వారినా నిర్ణయం తీసుకోవడానికి పురిగొల్పి ఉండవచ్చు.
బిజెపిని వారు మతతత్వ పార్టీగా పరిగణిస్తున్నప్పటికీ వారిని వేదికపై కూర్చుండబెట్టారు. రాష్ట్రంలో టిడిపి కూడా ధనికుల పార్టీయే అయినా వారిని కూడా వేదికపైకి పిలిచింది. ప్రజల డిమాండ్ నెరవేరడానికి అవసరమైనప్పుడు, పరిస్ధితులు డిమాండ్ చేస్తున్నపుడు అటువంటి వారితో కూడా ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా మత తత్వ బిజెపి, దోపిడీ వర్గ టిడిపిలను కూడా న్యూమొక్రసీ వాళ్ళు ఉద్యమంలో కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చు.
మరో విషయం ఏమిటంటే వారి వెబ్ సైట్ ప్రకారం వారు బి.జె.పి తో పాటు కాంగ్రెస్ కూడా భారత దేశంలో మత సామరస్యత చెడిపోవడానికీ, మత ఘర్షణలు చెలరేగడానికి బాధ్యురాలిగా గుర్తిస్తుంది. కాగ్రెస్ ను మత తత్వ పార్టీగా చెప్పకపోయినా, అది మత విద్వేషాలనూ, అంతరాలనూ స్వార్ధప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి ఎన్నడూ వెనకాడలెదని ఆ పార్టీ గుర్తిస్తుంది. దానికి విరుద్ధంగా సి.పి.ఐ, సి.పి.ఎం లు కాంగ్రెస్ ను సెక్యులరిస్టు పార్టీగా గుర్తిస్తారు.
ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు సిక్కు వ్యతిరేక హింస చేసి హిందువుల చేత వోట్లు వెయ్యించుకున్నది కాంగ్రెస్ పార్టీయే కానీ బిజెపి కాదు. బాబ్రీ మస్జీద్ ద్వంసం కూడా కాంగ్రెస్ నాయకుడు పివి నరసింహారావుకి తెలిసే జరిగింది. గోధ్రా మారణకాండ తరువాత గుజరాత్‌లో హింస చేసినది బిజెపియే, గుజరాత్‌లోని డాంగ్స్ జిల్లాలో క్రైస్తవులపై దాడులు చెయ్యించినది బిజెపియే, బిజెపి ఇంకా చాలా హింసాకాండలు చెయ్యించింది. 1980కి ముందు జనసంఘ్ అనే మతతత్వ పార్టీ ఉండేది. జన సంఘ్ రోజుల్లో ఇంత మతతత్వం లేదు కానీ ముస్లిం స్త్రీలకి భరణం, బాబ్రీ మస్జీద్ కూల్చివేత లాంటి అంశాలు వచ్చిన తరువాత మతం రాజకీయాలలో ప్రధాన భూమిక అయ్యింది. అయినా ఊహాజనితమైన మతాన్ని చూపించి మనల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు విజ్ఞానంలో ఏ నాలుగైదు వందల సంవత్సరాల వెనుకో ఉన్నారనిపిస్తోంది.
తెలంగాణా గురించి బ్లాగుల్లో జరిగిన చర్చల్లో బెస్ట్ అనుకున్నవి నా బ్లాగులో కమెంట్స్ రూపంలో ప్రచురించాను. మీరు వ్రాసినవి నాకు లింక్ ఇస్తారా? నాకు కనపడలేదు.
శ్రీ కృష్ణ చింతలపాటి గారు సమగ్రం గా చర్చించారు. బయట రాజకీయ నాయకులు కూడా అలా చర్చించలేరు. నేను మళ్ళీ చర్చ పెట్టనవసరం లేదు. ఈ ప్రపంచానికి వాటిని చూపించవలసిన సమయమే రావడం లేదు. మీరు చూసి సమగ్రంగా తెలిపితే సంతోషిస్తాను.
అక్కడ కొందరు తెలంగాణా వాదులు బ్రహ్మాండం గా వాదించారు. కానీ తమ పేరు తెలుపలేదు. మీరు, నేను ఏం చేస్తే అటువంటి ధైర్యం లేని తెలంగాణా వాదుల్ని మార్చగలుగుతాము? రాష్ట్రం కావాలి, కానీ ఆంధ్రా వారితో ధైర్యం గా పోరాడలేరు. కనీసం వారి ఐడెంటిటీ చెప్పుకోలేరు, ఎంత బాగా రాసారో ఆ బ్లాగ్ చూడండి.
http://unitedstatesofindiaonly.blogspot.com
శ్రీ కృష్ణ చింతలపాటి గారి బ్లాగ్ :http://www.srikchin.in
Hai Sir… Ur giving good knowledge for Telugu blog viewers.
Thanks for sharing international news…. Ramarao, Khammam.
Hai Sir… Ur giving good knowledge for Telugu blog viewers.
Thanks for sharing international news…. kishore
hai,brother i am preparing for civil services exam and i am little bit poor in english..so i was unable to follow internatinal updates..i had read about ur blog in a telugu news paper and it was very useful for me…keep going…very good job…
Hi Kishore, thanks. Keep visiting.
ప్రవీణ్ గారూ. అవునాండి. పరీక్షలకి ఉపయోగపడితే అంతకన్నా కావలసిందేముంది. పరీక్షలవరకే పరిమితం చేయకుండా, జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై మీరు స్వంతగా ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే అది ఆటోమేటిక్ గా సివిల్స్ కి కూడా ఉపయోగపడుతుంది.
బ్లాగ్ గురించి మీ మిత్రులకి కూడా తెలియజేస్తే వారికీ ఉపయోగపడవచ్చు.
hello sekhar garu. ivala eenadul o mee blog gurinchi rasaru. adhi chadhivina ventane mee blog chadhivanu. nijamga mee prayathnam goppadhi. mukhyamga ma lanti telugu medium back ground students ki chala help avuthundhi. oka manchi prayathnam thappakunda phalisthundhi. dhanyavadhalu.
by chandra sekhar, suryapet, nalgonda.
శేఖర్ గారూ, ధన్యవాదాలు. ఈనాడు నేనూ చూశాను. ఆ విషయం పై గూడా ఒక ఆర్టికల్ రాసాను. అదేమన్నా మీకూ ఉపయోగపడుతుందేమో చూడండి.
I had already intimated to my friends about your blog who are very curios about national and iternational news, and they too liked the blog very much.we appreciate your work.i will definetly follow your suggestion.thank u for giving me reply sir.good luck.
sekhar garu cheguvera gurinchi oka article rayandi plz…naku ayana gurinchi and ayana siddanthala gurinchi telusukovalani undhi.
.
ప్రవీణ్ గారు, మీరు కోరినట్లు చేగువేరా గురించి వ్యాసం తప్పకుండా రాస్తాను. అయితే ఆయన గురించి వివరంగా కావాలంటె పుస్తకాలు చదవడమే మంచిది. తెలుగులో కొన్ని పుస్తకాలు వచ్చాయి. విశాలాంధ్రతో పాటు చాలా షాపుల్లో దొరుకుతున్నాయి. అయినప్పటికీ సాధ్యమయినన్ని వివరాలతో వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.
Aa books nenu chadivanu sekhar garu.naku me nunchi tana views and siddanthala gurinchi telusukovalani undandi…i am eagerly waiting for ur post
ప్రవీణ్ గారూ, త్వరలోనే రాయడానికి ప్రయత్నిస్తాను.
hello sir . mee vishleshanalu chala bagunnai. mee opika nijamga abhinadhaneeyam. chivaraga.. thadhupari mukhya maina thedhi… marchara… may day aipoindhi kadha…?
చందు గారూ, మరిచాను. మారుస్తాను.
శేఖర్ గారు, బుద్ధుడు, గాంధీ లాంటి గొప్ప వ్యక్తి ఐన మార్క్స్ గురించి మన దగ్గర అంతగా పట్టించుకోకపోవడం బాధాకరం కదా సార్. పేదవాడి గురించి సమాజ మార్పు గురించి, గొప్పగా ఆలోచించిన మహా నేత మార్క్స్. మిగతా వాళ్ళలా కారణాల అన్వేషణ మాత్రమే కాదు.. సొల్యూషన్ కూడా చూపాడు. గొప్ప మేధావి. Great red salute to him. మార్క్స్ గురించి ఇవాళ్టి తరం కి తెలియాల్సింది ఎంతో వుంది. అవునూ, మార్క్స్ గురించి మీదయిన స్టైల్ లో మంచి వ్యాసం రాయకూడదూ…
sekhar garu. buddhudu, gandhi lanti goppa vyakthi aina marx gurinchi mana dhaggara anthaga pattinchukoka povadam bhadhakaram kadha sir. pedhavadi gurinchi, samaja marpu gurinchi, goppaga alochinchina maha netha marx. migatha vallala karanala anveshana mathrame kadhu..sollution kuda chupadu. goppa medhavi. great red salute to him. marx gurinchi ivalti tharam ki theliyalsindhi entho vundhi. avunu marx gurinchi meedhaina style lo manchi vyasam rayakudadhu…
please.
చందు గారూ, మార్క్స్ గురించి పట్టించుకోకేం? జాతీయోద్యమం నుండీ మార్క్సిస్టు సిద్ధాంతాలు నచ్చి అనుసరించడానికి అనేకమంది ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే భారత దేశ పరిస్ధితులకు అనుగుణంగా ఆచరణాత్మక పోరాట మార్గాన్ని రూపొందించడంలో భారతీయ కమ్యూనిస్టులు అనేక యేళ్లుగా విఫలం అవుతున్నారు. ఆ వైఫల్యం ఇంకా కొనసాగుతోంది.
మార్క్సిజం – లెనినిజం కేటగిరీ పైన క్లిక్ చేసి చూడండి. కొన్ని ఆర్టికల్స్ రాసాను. అవేమన్నా మీకు ఉపయోగపడతాయేమో. అయినా మీ సూచనని దృష్టిలో పెట్టుకుంటాను.
Good Analysis
…….Murthy
మీ బ్లాగు చాలా బాగుంది. కృతజ్ణతలు. చాలా పరిణితితో కూడిన దృక్పథంతో వ్యాఖ్యానిస్తున్నారు. గత కొన్ని నెలలుగా మీ బ్లాగును చూస్తున్నాను….ఇంక ఇప్పుడు సంకోచం లేకుండా మీ ఆర్టికల్స్ చదవచ్చు అనే నిశ్చయానికి వచ్చాను. మీ విశ్లేషణలు ఉపయోగకరంగా ఉన్నాయి……రెండవ ప్రపంచ యుద్దం, ఆనాటి పరిస్థితులు, జర్మన్ల సాంకేతిక ప్రగతి, మానవ నాగరికతలు వికృత పైశాచికత్వం పెరిగిపోయిన సందర్భంలో సోవియట్ వంట్ ఒక విద్వంసక శక్తి (!!???:)) ఆవిర్భావానికి అవసరమైన నేపథ్యం, దాని పరిణామ క్రమం, దాని పతనానికి ప్రేరేపించిన సందర్భాలని (మూసధోరణిలో కాకుండా) వివరిస్తూ ఒక వ్యాసం ప్రచురించగలరా ?
శరత్ గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు.
మీరు ప్రస్తావించిన అంశాలను ఒక వ్యాసంలో చెప్పగలగడం కొంత కష్టమే అనుకుంటా. ఈ అంశాలు విస్తృత సందర్భానికి సంబంధించినవి కనుక అలా అంటున్నాను.
సోవియట్ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్ధితుల గురించి ఇంతవరకూ ఈ బ్లాగ్ లో వివరించని మాట నిజమే. సమకాలీన పరిణామాలను ప్రాతిపదికగా చేసుకుని ఆర్టికల్స్ రాస్తున్నందున మీరు కోరినట్లు ‘సోవియట్ రష్యా’ పరిస్ధితులను ఈ బ్లాగ్ లో ఇంకా రాయలేదు. మీ సూచనను దృష్టిలో ఉంచుకుని సందర్భం వచ్చినపుడు రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.
This might interest you. A great editorial which sadly is true about the future of India.
http://www.thehindu.com/opinion/lead/reading-the-future-in-mexicos-malls/article4175223.ece?homepage=true
manchi prayathnam….
మీరు రైలు చార్జిల పెంపు గురించి ఒక వ్యాసం వ్రాయండి. గత పదేళ్ళుగా రైలు చార్జిలు పెంచకుండా వెయిట్ లిస్టెడ్ టికెట్‌లు అమ్మి బాగా ఆదాయం సంపాదించారు రైల్వేవాళ్ళు. వెయిట్ లిస్టెడ్ ప్రయాణికులకి రిజర్వేషన్ పెట్టెలలోకి ఎక్కే అనుమతి లేదని చాలా మంది ప్రయాణికులకి తెలియదు. టిటిఇతో గొడవ జరిగిన తరువాతే ప్రయాణికులకి అసలు విషయం తెలుస్తుంది. ఆదాయం కోసం వెయిట్ లిస్టెడ్ టికెట్‌లు అమ్మడం లాంటి మోసపూరితమైన పనులు చెయ్యకుండా ట్రైన్ చార్జిలు అప్పట్లోనే పెంచి ఉండాల్సింది కదా. పదేళ్ళ పాటు వెయిట్ లిస్టెడ్ టికెట్ల అమ్మకాల ద్వారా బాగా డబ్బులు సంపాదించి, ఇప్పుడు ట్రైన్ చార్జిలు పెంచారు. ఆదాయం సరిపోదనుకుంటే డైరెక్ట్‌గానే చార్జిలు పెంచాలి కానీ వెయిటింగ్ లిస్ట్ లాంటి మోసపూరితమైన విధానాలు పెట్టి డబ్బులు సంపాదించడం మాత్రం సరైనది కాదు.
sir,keep it up!……………………………………
this blog is very use ful to the students attempting for group one mains
chalachala bagundi especially for telugu groups or civils aspirents
international news inka konni upload cheyandi.hindu paperlo vache international and national news update cheyyandi please
sir,cheguvera gurinchi oka tapa rayindi plz…nenu intakumundu kuda adiga mimalni…plz consider this.
nenu motorcycle diaries,castro about che chadivanu sir..meru ayana siddantalaa gurinchi raste andariki telusthundi sir
can you please suggest me good books for understanding international aswellas bilateral issues in telugu?
కుమార్ గారు మీరు పోటీ పరీక్షల కోసం “మంచి పుస్తకాలు” అడుగుతున్నట్లయితే అలాంటివి ఉండకపోవచ్చు. అందునా తెలుగులో కష్టమే. అలా కాకుండా తెలుసుకోవడం కోసం అయితే మీరు కోరిన సమాచారం ఒకటి రెండు పుస్తకాల్లో లభించదు. జాతీయ, అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన పెంచుకోవడం కొంత కాలం పాటు విస్తరించి ఉండే ప్రక్రియ. అది రెడీమేడ్ గా పుస్తకాల రూపంలో, నాకు తెలిసినంతవరకు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పుస్తకాలు సాధారణంగా ఒక అంశం పైన కేంద్రీకరించి ఉంటాయి. అలాంటి ప్రక్రియ పట్ల అవగాహన లేదా డైరెక్షన్ ఇవ్వడానికే ఈనాడు చదువు పేజిలో వ్యాసాలు.
good to read this blog
విశేఖర్‌గారు,
ఎప్పుడో మీ బ్లాగులో నా గురించి చదివాను, కాని కామెంట్ వ్రాసే సమయం లేకపోవడం వలన ఇప్పుడు జవాబు ఇస్తున్నాను.
________
అంతే కాకుండా విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం– తార మాలిక క పోటీగా ఎదుగుతున్న హారం, సంకలిని సమూహము వంటీ మిగతా తెలుగు అగ్రిగేటర్లకి జావా కోడ్ రాసి ఇవ్వడం, ప్రారంభంలో సైట్ ఎనలిటిక్స్ మీద సలహాలివ్వడం అదీ చేసేవాడు.
——-
ఇది పచ్చి తప్పు, నాకు భ.రా.రె., అప్పారావుగారితో కేవలం ఈ-మెయిల్ పరిచయం మాత్రమే ఉన్నది, అప్పారావు గారు సంకలిని పెట్టిన కొత్తలో సలహాలు అడిగితే, ఫాంట్ సైజ్ తగ్గించమని, ఒకటో రెండో సలహాలు ఇచ్చాను, ఇక హారం సంగతికి వస్తే ఆ మాత్రం కూడా చెయ్యలేదు.
___
తనకి హార్ట్ అయి తనే బయటకి వచ్చేసి సొంతగా ఇంకో వనం మొదలుపెట్టాడు.
___
అబ్బాయి, నాకు పనీ పాటా లేదా? ఏదోక వనం పెట్టి ఏదోకటి చెయ్యడానికి. ప్రవీన్ని ఎవడు తిట్టినా కొన్నాళ్ళు తార అన్నాడు, ఆ గొడవంతా నా బ్లాగులో జరిగినా తిట్టింది ఎవరో నాకు తెలిసినా నేను పట్టించుకోలేదు, కొన్నాళ్ళు అయ్యాక, ఆ తిట్టిన వాళ్ళని ఎవరో అజ్ఞాత తిడితే నేనే అన్నారు, ఎవరి మెయిలో ఎవడో లీక్ చేస్తే అది నేనే అన్నారు (కనీసం ఆ మెయిల్ నాకు పంపలేదు, ఎవడికో పంపారు, ఐనా నేను ఎలా లీక్ చేస్తాను అన్న కనీస ఇంగితం కుడా లేదు), ఇలా బోలేడుమంది నా పేరు వాడుకున్నారు. ఈ పనులన్నీ నేను చేస్తా కుర్చుంటే నేను కుడా ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకోవాలి నా పనులన్నీ మానేసి.
ఎవడు ఏమనుకున్నా పట్టించుకునే తీరిక నాకు లేదు, నాకున్న సమస్యలు చాలా పెద్దవి 🙂
meeku modataga Dhanyavadaalu.. chala manchi vishayala gurinchi raasthunnaru..
alage meeru .. aa articles main link (for English) kuda post chesthe .. maalanti competetive exams attend ayyevaallaku upayogakaramu…
maro sari Dhanyavaadalatho..
ఆంజనేయులు గారు, మీ సూచన గుర్తు పెట్టుకుంటాను. కాని అన్ని సమయాల్లో పాటించడం కుదరకపోవచ్చు. ఎందుకంటే వార్తల పఠనం నాకు నిరంతర కార్యక్రమం. వివిధ చోట్ల చదివిన వార్తలను క్రోడీకరించి రాస్తుంటాను. రెండు, మూడు రోజుల వ్యవధిలో చదివి గుర్తుపెట్టుకున్న అంశాలను కూడా వివిధ వార్తా, విశ్లేషణలకు వినియోగిస్తాను. అలాంటప్పుడు లింక్స్ వెతికి ఇవ్వడం వెంటనే సాధ్యం కాకపోవచ్చు. ఐనా ప్రయత్నిస్తుంటాను.
విశేఖర్ గారు ,నేను కుడా ఒక బ్లాగ్ తెలుగులో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను… అనుకోసం కొన్ని సలహాలు మిమ్మల్ని అదుగుదాం అనుకుంతున్నాను.
తెలుగులో రాయడానికి మీరు ఉపయోగించే సాఫ్ట్ వేర్ ఎంటి… లెఖిని ద్వారా రాసుకుని బ్లాగ్ లొ ప్రచురించుకావచ్చ . దానికి ఎమిన డబ్బులు కట్టాలా.
దయచెసి మీ ఖళీ సమయంలొ సమాధానం చెప్పగలిగితే
i will be very thankfull to you…
నాగశ్రీనివాస గారు ముందుగా అభినందనలు.
లేఖిని పూర్తిగా ఉచితం. ఆ సంగతి లేఖిని పేజిలో ఉంది కదా.
మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ని ఉపయోగిస్తే కనుక తెలుగులో టైపింగ్ ఇంకా తేలిక. మీరు చేయివలసిందల్లా indic input అనే పేరుగల extension లేదా add on ని బ్రౌజర్ లో ఇన్‌స్టాల్ చేసుకోవడమే. ఇండిక్ ఇన్‌పుట్ ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక కింద యాడ్ ఆన్ బార్ పైన Default input అని కనిపిస్తుంది. అక్కడ రైట్ క్లిక్ చేస్తే తెలుగు లో టైప్ చేయడానికి మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ‘తెలుగు – RTS’ ని సెలెక్ట్ చేసుకుంటే బ్రౌజర్ లో ఎక్కడైనా తెలుగులో టైప్ చేయవచ్చు. లేఖినిలో ఎలా టైప్ చేస్తారో అదే విధంగా టైప్ చేస్తే సరిపోతుంది.
మళ్లా ఇంగ్లీషులో టైప్ చేయాలనుకుంటే యాడ్ ఆన్ ఐకాన్ పైన మళ్లీ రైట్ క్లిక్ చేసి Default Input ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
త్వరలోనే మీ బ్లాగ్ చూడాలని ఆశిస్తున్నాను. ఇంకా అనుమానం ఉంటే అడగండి.
విశేఖర్ గారు , Thanks a lot ,”లేఖిని పూర్తిగా ఉచితం. ఆ సంగతి లేఖిని పేజిలో ఉంది ..” కానీ నాకు ఎవరొ చెప్పారు.ఇటువంటి సైట్లు వ్యక్తి గతంగ వాడుకొవడానికి ఉచితం గానీ, ఇలా బ్లాగ్ లలొ గాని , వెబ్ సైట్ గాని వాడుకొవడానికి కాదు అని.. అందుకె తెలుసుకుందాం అని అడిగాను.
మరొక్క సందెహం ” indic input ” అంటే ఏంటి… ఎక్కడ నుంచి దానిని డౌన్ లోడ్ చెసుకొవాలి..
నాగ శ్రీనివాస గారూ….విజయోస్తు. మీ బ్లాగుకోసం ఎదురుచూస్తూ ఉంటాను.
nagasrinivasa
పైన చెప్పాను. ఇండిక్ ఇన్ పుట్ అనేది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో అంతర్గతంగా ఇన్ స్టాల్ చేసుకోవలసిన యాడ్ ఆన్. బ్రౌజర్ మెను లో టూల్స్ కింద ‘యాడ్ ఆన్’ ఆప్షన్ ఎంచుకుంటే కొత్త విండో/ట్యాబ్ లో యాడ్ ఆన్ పేజి ఓపెన్ అవుతుంది. ఆ పేజిలో పైన సెర్చ్ బాక్స్ లో ఇండిక్ ఇన్ పుట్ అని టైప్ చేసి వెతికితే లిస్ట్ వస్తుంది. లిస్ట్ లో ‘ఇండిక్ ఇన్ పుట్ ఎక్స్ టెన్షన్’ ను ఎంచుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.
చందుతులసి గారు , బ్లాగ్ తయారు చేసుకొవడం అనుకున్నంత సులువుగ అనిపించడం లెదు… నేను అనుకున్నంత బాగరావడం లేదు.. ప్రయత్నిస్తున్నాను.. any have thanks for your blessings
బాగుంది మీ బ్లాగు విశేఖర్ గారు. చాలా సమాచారం ఉంది కనుక బ్లాగు అనడం కన్నా వెబ్ సైట్ అంటే బాగుంటుంది అనుకుంటా.
శివ ప్రసాద్ గారూ, మీ బ్లాగ్ ని నిన్ననే చూశాను. చందుతులసి గారు మీ బ్లాగ్ లోని ఒక ఆర్టికల్ కి లింక్ పంపారు, నాకు ఉపయోగపడుతుందేమో చూడమని. అంతర్జాలం, కంప్యూటర్ టెక్నాలజీలకు సంబంధించి తెలుగులో సమాచారం ఇస్తున్న మీ కృషి చాలా బాగుందని అనుకున్నాను కూడా. కాని చందుతులసి గారు ఇచ్చిన ఆర్టికల్ వర్డ్ ప్రెస్ సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్ లకే ఉపయోగపడుతుంది. నా బ్లాగ్ కి ఉపయోగపడదు.
మీకు వెబ్ సైట్ డిజైన్ లో కూడా నైపుణ్యం ఉంటేగనక ఈ బ్లాగ్ కి (మీ ప్రకారం వెబ్ సైటే అనుకోండి!) మీ సహకారం అవసరం రావచ్చు. ఏమన్నా ఉంటే మిమ్మల్నే అడుగుతాను.
మీ ప్రయత్నం అపూర్వం
ఈ కొత్త టెంప్లేట్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అక్షరాల పరిమాణం కూడా పెద్దగా, బాగుంది.
మళ్ళీ టెంప్లేట్ గురించే … ఇప్పుడు కనిపిస్తున్న టెంప్లేట్ బ్లాగు స్వభావాన్ని సూచిస్తూ ఘనంగా ఉంది. బ్లాగు పేరున్న అక్షరాల పరిమాణం మాత్రం కొంచెం తగ్గించవచ్చు.
ఐతే మీకూ ఓ.కె అన్నమాట! ధన్యోస్మి.
కానీ బ్లాగ్ టైటిల్ అక్షరాల పరిమాణం తగ్గించే అవకాశం ఇవ్వలేదు. వర్డ్ ప్రెస్ వాళ్ళతో ఛాట్ చేసి అడుగుదాం అనుకుంటున్నాను.
తెలుగు బ్లాగ్ పాఠకుడు గారు ఎవరోకానీ సీనియర్ బ్లాగరులాగానే ఉన్నారు. వారు చెప్పింది అక్షరాలా నిజం. వారుదహరించిన ఆడ బ్లాగరు “శ్రా…” అని నా అనుమానం. ప్రస్తుతం బ్లాగుల్లో ఫక్తు అనవసరమైన రాతలు రాస్ద్తున్నారు. sex, gossips కి బ్లాగులోకం దాసోహం. వీళ్ళ బ్లాగుల మధ్య తమ బ్లాగును చూసుకోవడానికి సిగ్గేసి మంచి బ్లాగర్లు సాంతం రాయడం మానేసినా ఆశ్చర్య పోనఖ్ఖర్లేదేమో! ఇదికాక ఇంకొకఋఇకి కామెంట్లొచ్చాయని కుళ్ళుకుచచ్చే childish మెంటాలిటీ ఉన్నవాళ్ళు, తమనెవరూ పొగడకుంటే తమనుతామే పొగుడుకొనే న్యూనతా స్వభావం ఉన్నవాళ్ళు, స్త్రీద్వేషమూ, లౌకికవాద ద్వేషమే ప్రధాన అజెండాగా కలిగిన హ్యూమనిష్టులు (అనగా మారు పేర్లతో రెండేసి బ్లాగులు రాసే తా.ల.బా.(న్)) లు, కొంపలంటుకుంటున్నాయి అని కాళ్ళు వణికించేసుకొనే chicken hearted people మన బ్లాగర్లు. వీళ్ళకు ఒక పధ్ధతీ పాడూ ఉండదు. వీళ్ల భావాలతో ఎవరు విబేధించినా వాళ్లని అమ్మనాబూతులుతిట్టమే వీళ్లకు తెలిసిన సహన శీలత. అదే వీళ్లకు తెలిసిన భావ స్వాతంత్ర్యం.
వీళ్ళ దృష్టిలో దేశభక్తి అంటే దేశంలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నా దాన్ని బయటకు పొక్కకుండా చూసుకోవడం (నాత్జీ, కమ్మూనిస్ట్ ప్రాపగాండా గుర్తున్నది కదా?). వీళ్ల భావాలు, ఆలోచనలు Hitler, Himmel, Goebels వంటి “పుణ్యాత్ముల”తో సరిపోలుతాయని నాకు ఎప్పుడో అర్ధమయ్యింది. వీళ్ళు హిట్లర్ మానస పుత్రులు! As the above commentator had rightly judged, these guys are a bunch of time passers and no-oners without any clear sight. All they know is hatred and licking the boots of any guy who claims to ameloirate their religion.
నీహారిక, ప్రవీణ్ suffer from an incorrigible trait. వాళ్లతో సమస్యల్లా వాళ్ళు ఒక విషయంపై కేంద్రీకృతం కాలేరు. Like the patients of A.D.D. they go off tangentially from any given topic. Coming to Niharika, her opinions are quite immature and lack in depth understanding of any given topic. Her ways have more are more of madness than method and that is why she did attack Malak and hence were they taken by surprise – for the good. Apart from this… she has a lot to learn -including taming her emotions down- and better work on that.
Coming to you sir… why in the world are you so obsessed with how your blog looks? haven’t u heard that the beauty lies eyes of the beholder? To me… beauty is efficiency, information -which your blog happen to represent- and I don’t care how it looks. All that I care about if ur perspective. Please don’t give in to your egotistical urges.
Hi Viseshagna sir,
Long time, no see.
Your opinion matters!
But, I reckon that readers and their passions also matter for a blog to flourish. Sometimes we may have to adjust to the standards of a common reader so as to make ourselves accessible. I think look of the blog is a part of it.
When we two only talk, debate, discuss and come to know about things, we may maintain our mutually agreed standards on a higher plane. But when we are in the midst of so many planes of understandings, I think, we should be mindful of whether our discussion is easily accessible or not.
Any way, I’ll keep your words in my mind. Thank you.
మీకో స్టాండర్డ్ ఉంది. దాన్ని పట్టించుకోండి. మీకో శైలి ఉంది దాన్ని మీరు మీ blog-theme కన్నా (presentation అన్న పదం కావాలనే వాడడం లేదు. ఎందుకంటే మీ presentation బాగుంటుంది కనుక) ఎక్కువ విలువివ్వడం మొదలుపెట్టండి.
Sure. Thanks!
*తెలుగు వార్తలు* అనేది అతి పెద్ద చక్కని వార్తా భాండాగారం !!
– radhakrishna sriramoju
రాధాకృష్ణ గారు, ధన్యవాదాలు.
Munduga meeku Namaskaram,
Naa peru ravishankar., prasthutham nenu civil service exams ki prepare avthunnanu andulo telugu medium lo.. mee blog chusaka civil exams prepare avvadaniki chala help avthundani naku purthi viswasam undi.. meeru future lo kuda ee blog lo ilage standard and genuine, valuble information ni andubatulo unchi mantain cheyalani manaspurthiga korukuntunnanu.
thankyou,
Dr. Ravishankar