
–
యూదు ప్రజలపై సామూహిక నరమేధం (జీనోసైడ్) జరిగితే దానిని “హోలోకాస్ట్” అని పిలుస్తారు.
ఐరిష్ ప్రజలపై సామూహిక నరమేధం జరిగితే దానిని “కరువు” అని పిలుస్తారు.
నేటివ్ అమెరికన్ల పైన సామూహిక నరమేధం జరిగితే దానిని “డిస్కవరీ” అంటారు. (అమెరికాని కనిపెట్టింది కొలంబస్ కదా మరి!)
ఆఫ్రికన్ల పైన సామూహిక నరమేధం జరిగితే దానిని “వలసవాదం” అంటారు.
పాలస్తీనా ప్రజలపై యూదులు జరిపే నరమేధాన్ని “ఆత్మ-రక్షణ” అని పిలుస్తారు.
ముస్లిం ప్రజలపై సామూహిక హత్యాకాండ జరిపితే దానిని “టెర్రరిజం పైన యుద్ధం” అని పిలుస్తారు. అయితే అది ఏ దేశంలో జరిగిందన్న దానిని బట్టి ఒక్కో పేరుతో పిలవటం కూడా జరుగుతుంది.
సారాంశం: పెట్టుబడిదారీ సామ్రాజ్యాద ఆధిపత్య ప్రయోజనాల కోసం ఎక్కడ నరమేధం జరిగినా దానిని నరమేధం (జీనోసైడ్) అని పిలవకూడదు. తాము చేసిన సామూహిక హత్యాకాండకు, ఆ హత్యాకాండ జరిపిన వారే దానికి ఏ పేరు పెడితే ఆ పేరుతోనే ప్రపంచం పిలుస్తుంది. వాస్తవంలో ఒక దేశం మరో దేశం పైనా, ఒక జాతి మరో జాతి పైనా, ఒక తెగ మరొక తెగ పైనా సామూహిక హత్యాకాండకు పాల్పడినా సరే, దానిని అలాగే పిలవాలి.
–
