అదానిపై అవినీతి కేసును అమెరికా ఎందుకు డిస్మిస్ చేసింది?

– తెలంగాణ రాష్ట్రం నుండి ప్రచురించబడుతున్న ప్రజాతంత్ర పత్రిక ఈ రోజు నా ఆర్టికల్ ను ప్రచురించింది. ఆర్టికల్ కాస్త పెద్దది అయినప్పటికీ పూర్తిగా ప్రచురించినందుకు పత్రికను అభినందించాలి. నా తరపున కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. గౌతమ్ అదాని ప్రధాన మంత్రిగా 12 సంవత్సరాల నుండి భారత దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మిత్రుడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. బిజెపి నాయకత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత గౌతమ్ అదాని…

మరోసారి ఇరాన్, అమెరికా పరస్పర దాడులు

– అమెరికా, ఇరాన్ లు మరోసారి ఒకరి పైన ఒకరు దాడులు చేసుకున్నాయి. ఆదివారం నాడు అమెరికా సైన్యం ఇరాన్ కు చెందిన లారక్ ద్వీపంలోని మిసైల్, రాకెట్ లాంచింగ్ పరికరాలపై దాడులు చేసింది. అమెరికా దాడికి బదులిస్తూ ఇరాన్ సైన్యం జోర్డాన్, యుఏఈ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లను తమ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు గాలిలోనే అడ్డుకున్నాయని జోర్డాన్, యుఏఈ లు ప్రకటించాయి. ఇరాన్ దక్షిణ తీరంలోనూ,…

ఐరోపా, రష్యాల మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం!

– జర్మనీ నాయకత్వం లోని ఐరోపా మరియు రష్యా దేశాల మధ్య శతృత్వం నానాటికీ తీవ్రం అవుతున్నది. ఇది కాస్తా యుద్ధానికి దారి తీసే అవకాశాలు ప్రస్ఫుటం అవుతున్నాయి. ఉక్రెయిన్ పైన రష్యా కొనసాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ తరపున ఐరోపా దేశాలు గరిష్ట స్థాయిలో ఆయుధాలను సరఫరా చేయటంతో పాటు, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు తమ స్పెషల్ మిలటరీ సిబ్బందిని ఉక్రెయిన్ లో ప్రవేశ పెట్టి శిక్షణ ఇస్తున్నాయి. ఈ ఘర్షణ లోకి అమెరికాను…

నేపాల్ మెరుపు వరదలకు కారణం ఏమిటి? -ఫోటోలు

– ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక పెద్ద మహా వరద బురద తమను ముంచెయ్య బోతోందని మాత్రమే. ఆ సంగతి వారి బుర్రకు తట్టిన మరుక్షణంలోనే హిమాలయాల పై నుండి మహా ప్రవాహంలా కొట్టుకు వచ్చిన బురద లాంటి వరదలో మునిగిపోయి కొట్టుకుపోయారు. నేపాల్, టిబెట్ లలో ఆగస్టు 26 తేదీన నేపాల్, టిబెట్ ప్రజలు, ముఖ్యంగా నేపాల్ ప్రజలు ఎదుర్కొన్న ఉపద్రవం ఇది. లిటరల్ గా కళ్లు మూసి…

సామూహిక నరమేధానికి ఎన్ని పేర్లో!

– యూదు ప్రజలపై సామూహిక నరమేధం (జీనోసైడ్) జరిగితే దానిని “హోలోకాస్ట్” అని పిలిచారు. ఐరిష్ ప్రజలపై సామూహిక నరమేధం జరిగితే దానిని “కరువు” అని పిలిచారు. నేటివ్ అమెరికన్ల పైన సామూహిక నరమేధం జరిగితే దానిని “డిస్కవరీ” అని పిలిచారు. (అమెరికాని కనిపెట్టింది కొలంబస్ కదా మరి!) ఆఫ్రికన్ల పైన సామూహిక నరమేధం జరిగితే దానిని “వలసవాదం” అని పిలిచారు. పాలస్తీనా ప్రజలపై యూదులు జరుపుతున్న నరమేధాన్ని “ఆత్మ-రక్షణ” అని పిలుస్తున్నారు. ముస్లిం ప్రజలపై సామూహిక…

పాకిస్తాన్ ని ఏలిన చివరి హిందూ రాజులు, హిందూ షాహీ

– ప్రస్తుతం పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతం హిందూయిజం పుట్టిన చోట్లలో ఒకటి అని తెలిస్తే ‘అవునా?!’ అని అనుకోకుండా ఉండలేము. ప్రసిద్ధ యువ బ్రిటిష్ చరిత్ర కారుడు, ఆర్ట్ హిస్టారియన్, పలు అవార్డులు గెలుచుకున్న “షాటర్డ్ ల్యాండ్స్” పుస్తక రచయిత అయిన శ్యామ్ డ్యాల్ రింపిల్ ఈ విషయాన్ని అదే పుస్తకంలో వెల్లడించాడు. అంతే కాదు, పురాతన భారతీయ జ్ఞాన సంపదగా చెప్పుకునే వేదాలలో మొట్ట మొదటిదయిన ఋగ్వేదం మొదటి సారి పురుడు పోసుకున్నది కూడా…

అమెరికా అబద్ధం చెబుతుంది, ప్రపంచం నమ్మేస్తుంది!

– అది 2003 వ సంవత్సరం. అసలు అక్కడ ఉనికిలో లేని “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” ఉన్నాయని చెబుతూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిత్ర రాజ్యాలను వెంట బెట్టుకుని ఇరాక్ పైన విధ్వంసక దాడి చేసింది. ఇది ఊహించి చెప్పింది కాదు; రికార్డులకు ఎక్కిన వాస్తవం. గూఢచార సమాచారాన్ని వక్రీకరించారు లేదా తారుమారు చేశారు. కృత్రిమ కేసు సృష్టించారు. కృత్రిమంగా కేసుని సృష్టించిన వారికి అది కృత్రిమ కేసు అని స్పష్టంగా తెలుసు. అది కృత్రిమ…

యుపి: మత మార్పిడి కుట్ర కేవలం ఊహాజనితం -హై కోర్టు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి కుట్ర జరిగింది అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అలహాబాద్ కోర్టు స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా హిందూ మతంను త్యజించి ముస్లిం మతం స్వీకరించిన ఇద్దరు అక్కా చెల్లెళ్ల ను పోలీసుల సాయంతో ఇంటిలో నిర్బంధించిన వారి తండ్రిని, పోలీసులను, చివరికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కూడా హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన అక్కా చెల్లెళ్ల వయసు 35 సం, 20 సం.లు. వారిని…

Gen Z విజయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ వలపోత!

– —–మనోజ్ఞ, 28-07-2026 జనరేషన్ Z (జెన్ జి) ఆందోళన విజయవంతం కావడం పట్ల ఆర్ఎస్ఎస్, బిజెపి, ఇతర హిందూత్వ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కడవల కొద్దీ కన్నీళ్లు కార్చుతున్నారు. వారి కన్నీటి ప్రవాహానికి “నేనూ సమిధ నొక్కటి ఆహొతిస్తాను” అంటూ ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ కూడా జత కలిశారు. విద్యార్ధులు, యువకులు నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావటానికి నిరసనగా, పనిలో పనిగా బిజెపి ప్రభుత్వం విద్యార్ధులు, యువకుల పట్ల అనుసరిస్తున్న…

యువత వేదనా భరిత నిట్టూర్పే బొద్దింకల ఆందోళన!

– —-సుమన, 25-07-2026 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని నిరుద్యోగులు, విద్యార్ధులు, యువత పట్ల పరోక్షంగా మరోసారి ఏవగింపు ప్రకటించి తప్పుడు కారణాలతో వార్తలకెక్కారు. న్యాయం కోరుతూ రోడ్డెక్కిన విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీ చార్జ్ చేసిన వీడియోలు ఉన్నాయని చెప్పిన పిటిషనర్లతో “వీడియోలు చూసేందుకు మాకు సమయం లేదు” అంటూ తమ పిటిషన్ ను అర్జెంటుగా చేపట్టాలన్న విజ్ఞప్తిని మొరటుగా తిరస్కరించారు. బుధవారం నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్…

చర్చల నాటకంతో ఆందోళనను బలహీన పరిచేందుకు ప్రభుత్వం కుట్ర -అభిజిత్

– ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోటల్లా ఆ పార్టీల ఎం.ఎల్.ఏ లు, ఎం.పి లను బెదిరించి లేదా ప్రలోభ పెట్టి వారిలో చీలికలు తెచ్చి ప్రభుత్వాలను పడగొట్టి, వారి అవినీతిని వాషింగ్ మిషన్ లో వేసి కడిగి శుభ్రం చేసి సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం గత కొన్నేళ్లుగా బిజెపి పార్టీ చేస్తున్న ఘనకార్యం! ఇదే తరహా మోసపూరిత ఎత్తుగడలను తన పాలనలో ఉన్న విద్యార్ధులు, యువకుల పైన కూడా బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం…

మోడి ఇంటి ముందు ధర్నా, రాహుల్ అరెస్ట్! -ఫోటోలు

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహోల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు అనూహ్య రీతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇంటి ముందు రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా నిర్వహించబోతున్న సంగతిని కాంగ్రెస్ పార్టీ చివరి వరకు రహస్యంగా ఉంచింది. చివరికి పోలీసులు హుటా హుటిన వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర నాయకులను అరెస్ట్ చేయటంతో ధర్నా ముగిసినట్లు తెలుస్తున్నది. సోమవారం…

బొద్దింకలతో ప్రభుత్వం చర్చలు: నిరసనకు ప్రభుత్వం తల ఒగ్గనున్నదా?

– పార్లెమెంటు వద్దకు నిరసనకారులు, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో వేల సంఖ్యలో పార్లమెంటు వద్దకు తరలి వచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర మంత్రి జె పి నడ్డా, సిజెపి పార్టీ ప్రతినిధులైన సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లతో చర్చలు జరిపారు. చర్చలలో సిజెపి ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. కాగా సిజిపి డిమాండ్ల గురించి ప్రభుత్వంతో చర్చించేందుకు తమకు…

ఇరాన్ ముందు అమెరికా లొంగుబాటు ఎలా సాధ్యపడింది?

– – – – రచన: సుమన, 17/06/2026 – ఫిబ్రవరి 28 తేదీ నుండి అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వలన ప్రపంచానికి పట్టిన చమురు దరిద్రం తాత్కాలికంగా ఐనా సరే వదిలింది. వరుసగా ప్రపంచ మరియు, (పశ్చిమాసియా) ప్రాంతీయ పెత్తందారు, యూదు జాత్యహంకారి అయిన అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, కీలు బొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించి ఆ దేశ చమురు, గ్యాస్ వనరులను స్వాధీనం చేసుకునే ప్రకటిత లక్ష్యంతో ఇరాన్ పైన దురాక్రమణ…

ఇరాన్-అమెరికా ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల ఆందోళనలు!

– ఇన్నాళ్లూ అమెరికా, యూరోపియన్ యూనియన్ రాజ్యాలు గానీ ప్రపంచానికి ఏమి చెప్పాయి? ఇరాన్ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం అనీ, తన ప్రజలను తీవ్రంగా అణచివేస్తున్నదనీ, అమెరికా ప్రవచించే ప్రజాస్వామ్యం కోసం వారు అర్రులు చాస్తూ అందుకు ఆటంకంగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అందుకే యేటా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తూ ఖమెనీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పాయి. తాము ఇరాన్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మద్దతు ఇస్తున్నామని, వారి ఆకాంక్షలు…