
–
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రచురించబడుతున్న ప్రజాతంత్ర పత్రిక ఈ రోజు నా ఆర్టికల్ ను ప్రచురించింది. ఆర్టికల్ కాస్త పెద్దది అయినప్పటికీ పూర్తిగా ప్రచురించినందుకు పత్రికను అభినందించాలి. నా తరపున కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి.
గౌతమ్ అదాని ప్రధాన మంత్రిగా 12 సంవత్సరాల నుండి భారత దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మిత్రుడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. బిజెపి నాయకత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత గౌతమ్ అదాని వ్యాపార సామ్రాజ్యం వేగంగా అభివృద్ధి చెందింది. హారిజాంటల్ గా, వర్తికల్ గా కూడా ఆయన వ్యాపారాలు విస్తరించాయి.
అలాంటి గౌతమ్ అదాని, తన వ్యాపార ప్రయోజనాల రీత్యా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లోని ఉన్నత అధికారులకు లంచాలు ముట్ట జెప్పాడని అమెరికా ఆరోపించి కేసు నమోదు చేసింది. లంచాలు చెల్లించి సంపాదించిన కాంట్రాక్టులను నెరవేర్చటం కోసం అమెరికా ద్రవ్య సంస్థల నుండి రుణం తీసుకోవటమే కాకుండా బాండ్ల ద్వారా కూడా ఫైనాన్స్ సేకరించినందున ఆయన అవినీతి, అమెరికా కోర్టుల పరిధిలోకి వస్తుందని చెబుతూ కేసులు రిజిస్టర్ చేశారు.
కానీ గత నెలలో ఆ కేసులను అమెరికాలోని జిల్లా కోర్టు జడ్జి కొట్టివేశాడు. కేసు కొట్టి వేస్తూ “ఈ నిర్ణయం నాది కాదు” అని ప్రకటించాడు. తద్వారా తన పైన అమెరికా ప్రభుత్వం నుండి కానీ, ద్రవ్య కంపెనీల నుండి కానీ ఒత్తిడి వచ్చిందన్న అనుమానాలను ఆయన రేకెత్తించాడు. ఆ వివరాలతో ఈ ఆర్టికల్ రాశాను. -విశేఖర్

–

–
పై ఇమేజ్ ల పైన రైట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత “Open image in a new tab” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పెద్ద సైజులో చూడవచ్చు.