ఫేక్ ఎస్ఐఆర్: రిగ్ అయిన ఎన్నికలని బహిష్కరించండి! -ప్రతిపక్షాలకు దిప్కే పిలుపు

– ఒక పక్క ఎన్నికల ఫలితాలను రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అవే ఎన్నికల్లో క్రమం తప్పకుండా పాల్గొనటం ఏమిటని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దిప్కే ప్రశ్నించాడు. నిజంగా ఎన్నికలను రిగ్గింగ్ చేయటం ద్వారా గెలుస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్లయితే అలాంటి ఎన్నికలలో పాల్గొనకుండా బహిష్కరించాలని సిజెపి పార్టీ నాయకుడు అభిజిత్ దిప్కే ప్రతిపక్ష పార్టీలకు వినూత్న పిలుపు ఇచ్చాడు. ఎన్నికల ఫలితాలను రిగ్గింగ్ చేస్తున్నారని అధికార పార్టీ అయిన బిజెపి పైన ఆరోపణలు చేస్తూ…

ఇండియాలో అత్యధిక ధనవంతుడు మళ్లీ అదాని!

భారత దేశ ప్రధాన మంత్రి మిత్రుడు గౌతమ్ అదాని మరొకసారి దేశంలో అత్యధిక సంపన్నుడుగా గౌతమ్ అదాని అవతరించాడు. గత సంవత్సరం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ స్థానంలో ఉండగా గౌతమ్ అదాని ఆయన్ని వెనక్కి నెట్టి అగ్ర స్థానం అధిస్టించాడు. గత సంవత్సరం కంటే 13 శాతం అధికంగా సంపదలు ఆర్జించిన గౌతమ్ అదాని 9.23 లక్షల కోట్ల రూపాయలతో ధనికులలో కెల్లా ధనికుడుగా స్థానం సంపాదించాడు. ఇది అమెరికన్ డాలర్లలో 96 బిలియన్…

ఇండియాలో డిజిటల్ హెల్త్: టెక్నాలజీ, వర్గం & అసమానతల నూతన నమూనా

– — డి.రాహుల్ [ఈ ఆర్టికల్ న్యూ డెమోక్రసీ అనే ఆంగ్ల మాస పత్రికలో ప్రచురించ బడింది. ఈ పత్రిక ఢిల్లీ నుండి వెలువడుతుంది. ఆర్టికల్ నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ పూర్తిగా చదవగలిగితే ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేసి అందిస్తున్నాను. -విశేఖర్] ఉపోద్ఘాతం ఆధునిక జీవనం లోని ప్రతి రంగం లోకి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం చొరబడింది. ఆరోగ్య సంరక్షణ కూడా అందుకు మినహాయింపు కాదు. టెలి మెడిసిన్ మరియు…

Podcast Episode: ఎన్నికలు, యుద్ధం, చమురు

Pip: ప్రజాస్వామ్యం, యుద్ధం, చమురు — ఈ మూడూ ఒకేసారి ఒత్తిడిలో ఉంటే ఏం జరుగుతుందో ఈవారం స్పష్టంగా కనిపిస్తోంది. Mara: విశేఖర్ రాసిన ఈ వారపు పోస్టులు బెంగాల్ ఓటు హక్కు సంక్షోభం నుండి ఇరాన్-అమెరికా యుద్ధ నష్టాల వరకు, సౌదీ చమురు మార్గాల మూసివేత వరకు పరస్పర సంబంధం ఉన్న సంక్షోభాలను విశ్లేషిస్తున్నాయి. Pip: బెంగాల్ ఎన్నికల ప్రభావం నుండి మొదలుపెడదాం. ఎన్నికలు, యుద్ధం, చమురు: ఒకే వ్యవస్థాగత సంక్షోభం Mara: బెంగాల్ లో…

ఎస్ఐఆర్ ఫలితం: 22 లక్షల బెంగాల్ వోటర్లు 12 యేళ్ళ దాకా ఓటు వేయలేరు!

– బెంగాల్ లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అప్పటిదాకా బెంగాల్ లో ముక్కుతూ మూలుగుతున్న బిజెపి ఒక్క సారిగా బంపర్ మెజారిటీ తో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది కానీ ఈ ఎన్నికల్లో 38 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. కారణం వాళ్ల ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ పేరుతొ తొలగించటమే. ఎస్ఐఆర్ వలన ఓట్లు కోల్పోయిన వాళ్లు అప్పీలు…

యుద్ధం ఊబినుండి బైటపడాలంటే..! -ఇరాన్ 7 షరతులు

– అమెరికా తనకు తానే సృష్టించుకున్న యుద్ధం ఊబి నుండి బైటపడటానికి ఇరాన్ మరొక అవకాశం ఇచ్చింది. మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ద్వారా మొదటి అవకాశం ఇచ్చిన ఇరాన్ ఇప్పుడు ఏడు షరతులతో కూడిన మరొక అవకాశాన్ని అమెరికాకు కల్పించింది. అయితే మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ లోని అంశాలకు ఇప్పుడు ప్రతిపాదించిన ఏడు షరతులకు పెద్ద తేడా లేనట్టు కనిపిస్తున్నది. ఇరాన్ కు చెందిన సుప్రీం నేషనల్ కౌన్సిల్ అధిపతి మోహసేన్ రెజాయ్ శనివారం…

ఇండియాకు చమురు సప్లై చేయలేం -సౌదీ అరేబియా

– ఇండియా రిఫైనరీలకు ఇక క్రూడ్ ఆయిల్ సరఫరా చేయలేమని సౌదీ అరేబియా చెప్పేసింది. యెమెన్ లోని ఇరాన్ మద్దతు కలిగిన హుతీ గ్రూప్ సైన్యం ఎర్ర సముద్రం ముఖ ద్వారంలో నెలకొన్న రెండు కీలక ద్వీపాలను రెండు రోజుల క్రితం జరిపిన మెరుపు దాడిలో స్వాధీనం చేసుకోవటంతో సౌదీ అరేబియా చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచి పోయాయి. దానితో ఇండియాకు ఇతర దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేయటం సౌదీ అరేబియా కు సాధ్యం కావటం…

ఇరాన్ దాడుల్లో అమెరికా గల్ఫ్ స్థావరాలకు తీవ్ర నష్టం -ఫోటోలు

అమెరికా మిలటరీ (పెంటగాన్) అధికారులు యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టం వివరాలను ఎట్టకేలకు కాస్తయినా వెల్లడి చేసేందుకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక, నౌకా, మరియు వాయు దళాల స్థావరాల పైన ఇరాన్ మిలటరీ చేసిన దాడుల్లో తాము తీవ్రంగా నష్టపోయామని పెంటగాన్ అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన పలు యుద్ధ పరికరాలు (ఫైటర్ జెట్ విమానాలు, ఎం.క్యూ9 రీపర్ డ్రోన్ లు, మిసైల్ లాంచర్లు, రాడార్లు, మొదలైన పరికరాలను అమెరికా నష్టపోయింది. కాగా…

గుజరాత్ జల్ జీవన్ మిషన్ లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు -కాగ్

– “గత ఇన్నేళ్లలో ఇన్ని సాధించాం, అన్ని సాధించాం, 60 యేళ్ళ కాంగ్రెస్ పాలన కంటే ఎక్కువ సాధించాం, దరిద్రాన్ని పారద్రోలాం, పేదరికాన్ని రూపు మాపాం” అంటూ బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే డప్పు కుట్టుకోవటం చాలాసార్లు విన్నాం. కానీ బిజెపి చెప్పే మాటలకు దేశంలో ఉన్న దరిద్రం, పేదరికం లకు పొంతన ఎప్పుడూ కనపడదు. ఈ తరహాలోనే గుజరాత్ లో జల్ జీవన్ మిషన్ కు సంబంధించిన లెక్కలు…

190 అణ్వాయుధాలతో పాక్ ని దాటిన ఇండియా!

ప్రస్తుతం ఇండియా వద్ద 190 అణ్వాయుధాలు (న్యూక్లియర్ వార్ హెడ్స్) ఉన్నాయని అమెరికా కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) సంస్థ అంచనా వేసింది. పాకిస్తాన్ కంటే 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఇండియా వద్ద ఉన్నట్టు దీని అర్ధం. త్వరలో ఇండియా వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య యునైటెడ్ కింగ్డం ని మించిపోతాయని ఎఫ్ఏఎస్ అంచనా వేసింది. ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ సిస్టం – 2026 నివేదికను ఎఫ్ఏఎస్ డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సన్ రచించినట్లు…

అమెరికా స్థావరాన్ని ఇరాన్ చావుదెబ్బ కొట్టింది -అమెరికా ఒప్పుకోలు

అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పైన ఆధిపత్య దురాక్రణ యుద్ధాన్ని ప్రారంభించి 6 నెలలు పైనే గడించాయి. ఈ కాలంలో అమెరికా బాంబు దాడుల్లో ఇరాన్ లో పలు రోడ్లు, బ్రిడ్జ్ లు, భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇరాన్ సైనికులు పలువురు చనిపోయారు. ఈ సంగతి ఇరాన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నది. అదే సమయంలో పశ్చిమాసియా అరబ్ దేశాలలో ఉన్న అమెరికా మిలటరీ, నావిక, వైమానిక స్థావరాల పైన కూడా ఇరాన్ పలుమార్లు ఎదురు దాడులు…

పుస్తకాలతో టెర్రరిజం సాధ్యం కాదు -జెకెఎల్ హైకోర్టు

పుస్తకాలు టెర్రరిస్టు నేరస్థులను తయారు చేయవని జమ్మూ, కాశ్మీర్ & లడఖ్ హై కోర్టు ఒక నిందితునికి బెయిల్ మంజూరు చేస్తూ స్పష్టం చేసింది. కాశ్మీర్ కు చెందిన స్మాలర్ షాఫత్ మక్బూల్ వాని వద్ద అభ్యంతరకర పుస్తకాలు ఉన్నాయని, సదరు పుస్తకాలు టెర్రరిజాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రజా భద్రతా చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ -పిఎస్ఏ) కింద గత సంవత్సరం నిర్బంధం లోకి తీసుకుంది. ఆయన అరెస్ట్ చట్ట విరుద్ధం…

Podcast Episode: న్యాయం రాజకీయం భద్రత

– ఈ టపా ఈ బ్లాగ్ లో మొదటి పోడ్ కాస్ట్. దీనిని వర్డ్ ప్రెస్ ప్లాట్ ఫారం వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తనకు తానే తయారు చేసి అందించింది. గత వారం రోజుల్లో బ్లాగ్ లో పోస్ట్ అయిన తపాలను పోడ్ కాస్ట్ గా మార్చి ఇస్తామని ఆఫర్ వర్డ్ ప్రెస్ వాళ్లు ఇవ్వగా దానికి ఓ.కె చెప్పాను. ఒక అరగంట టైమ్ తీసుకుని మూడు టపాల లోని ముఖ్యమైన అంశాలను తానే గుర్తించి ఆడియో…

యుపి ప్రభుత్వం అతి చర్యలు: నిరంకుశ వ్యవస్థగా మారే ప్రమాదం -అలహాబాద్ హైకోర్టు అద్భుత తీర్పు

– ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులను, బ్యూరోక్రట్ అధికారులను అలహాబాద్ హై కోర్టు మంగళ వారం తీవ్రంగా తప్పు పట్టింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధిని ఆకృతి చౌదరి, తనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక నిరసన హక్కును ఉపయోగించుకున్నప్పటికీ ఆమె పైన జాతీయ భద్రతా చట్టం కింద అక్రమ కేసు నమోదు చేసి జైలులో పెట్టటం విపరీత చర్యగా అభివర్ణించింది. తప్పుడు పనులు చేసే బ్యూరోక్రట్ అధికారుల వల్ల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని “ఆర్వేలియన్ డిస్టోపియా” రాజ్యంగా దిగజార్చే…

నార్వేలో అమెరికా మిసైళ్లు, రష్యా వార్నింగ్!

– ఓ పక్క ఇరాన్, ఇతర ఇరాన్ మిత్ర పక్ష గ్రూపుల పైన అమెరికా తీవ్ర స్థాయిలో మిసైల్ మరియు డ్రోన్ ఆయుధాలతో యుద్ధం చేస్తూనే మరో పక్క రష్యాను భవిష్యత్తులో ఎదుర్కొనే లక్ష్యంతో రష్యా పక్కనే ఉన్న నార్వే దేశంలో సరికొత్త మిసైళ్ల వ్యవస్థను నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని రష్యా, అమెరికాను గట్టిగా హెచ్చరించింది. రష్యా, అమెరికా దేశాల మధ్య అణ్వస్త్ర వ్యూహాత్మక స్థిరత్వం నెలకొల్పేందుకు చర్చలు…