హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు అమెరికాయే ఆటంకం!

– హోర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అమెరికా సైంధవుడిలా అడ్డు పడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు హోర్ముజ్ జలసంధి తెరవాలని ఇరాన్ కు పదే పదే ఫర్మానాలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు జలసంధిని ఇరాన్ తెరిచినప్పటికీ హోర్ముజ్ జలసంధికి ఆవల అమెరికా విధించిన బ్లాకేడ్ ని ఎత్తివేసేందుకు ససేమిరా అంటున్నాడు. విచిత్రం ఏమిటంటే అమెరికా నావల్ బ్లాకేడ్ తొలగించేందుకు మొండిగా నిరాకరిస్తున్న అమెరికా అధ్యక్షుడు అదే నోటితో…

అద్భుత విజయం సాధించిన ఇరాన్ ప్రతిఘటన!

– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలలో ఉన్నది మెదడా లేక ఇంకేమన్నా పదార్ధం పెట్టుకున్నాడా అన్నది తెలియక ప్రపంచం సతమతం అవాల్సిన పరిస్ధితి దాపురించింది. ట్రంప్ లాంటి మనిషి ఇంకోసారి ఏ దేశానికైనా అధ్యక్షుడుగా ఎన్నిక కాకుండా అన్ని దేశాల ప్రజలు శపధం చేయాల్సిన అత్యవసర పరిస్ధితి వచ్చి పడింది. హోర్ముజ్ జలసంధి ని తెరిచే విషయంలో నిన్నటి వరకు ఇరాన్ ని బెదిరిస్తూ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్! “ఓపెన్ ద ఫ_ _ హోర్ముజ్…

సీజ్ ఫైర్ చర్చలు ఇక అర్ధ రహితం -ఇరాన్

– చర్చలు మొదలు కాకముందే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ లు రెండూ అడ్డంగా ఉల్లంఘించిన నేపధ్యంలో ఇక “సీజ్ ఫైర్ చర్చలకు అర్ధం లేదు” అని ఇరాన్ ప్రకటించింది. ఏ అంశాల పునాదిగా అయితే చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు అన్నాడో ఆ పునాది అంశాలనే అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఉల్లంఘించాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్-బఘర్ ఘాలీబాఫ్ ట్విట్టర్ లో చేసిన ప్రకటనలో ఆరోపించాడు. “ఇరాన్ అందజేసిన…

ఇండియాను మళ్లీ బెదిరిస్తున్న అమెరికా

ఎడమ నుండి వరుసగా: విదేశీ మంత్రి మార్కో రుబియో, ట్రంప్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్, రక్షణ మంత్రి పీట్ హెగ్ సెత్ అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాన మంత్రి పరస్పరం ఒకరి పట్ల మరొకరు గౌరవం, స్నేహ భావన వ్యక్తం చేసుకుని కొద్ది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అమెరికా, ఇండియాను బెదిరించటం మొదలు పెట్టింది. అమెరికా వస్తు సేవల పైన ఇండియా విధిస్తున్న టారిఫ్ లను మళ్లీ ప్రస్తావిస్తూ, అమెరికా నుండి మొక్క జొన్న…

అమెరికాకు పోస్టల్ సేవలు రద్దు చేసిన 25 దేశాలు -యుఎన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గ్లోబల్ స్థాయిలో తలపెట్టిన Trade Disruption తాలూకు మంటలు కొనసాగుతూ పోతున్నాయి. ఇండియాతో పాటు 25 దేశాలు అమెరికాకు తమ దేశాల నుండి జరిగే పోస్టల్ సేవలను సస్పెండ్ చేసుకున్నాయని తాజాగా ఐక్యరాజ్య సమితి లోని పోస్టల్ సేవల సంస్థ తెలియజేసింది. రెండో విడత అధ్యక్ష పదవి చేపట్టడం తోనే, ప్రపంచ దేశాలపై టారిఫ్ యుద్ధం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా కస్టమ్స్ నియమాల లో ఒకటైన గ్లోబల్ డి మినిమిస్…

మర్రి చెట్టు నీడ నుండి రావి చెట్టు నీడ లోకి ఇండియా!

India NSA Ajit Doval with Russian President Vladimir Putin ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్! అన్న సామెత అందరికీ తెలిసిందే. 1947 నుండి భారత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఆయుధ సరఫరా, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన మరియు అభివృద్ధి, మిసైళ్ల సరఫరా మరియు అభివృద్ధి, ఆధునిక నౌకల సరఫరా మరియు అభివృద్ధి మొదలైన రంగాలలో మునుపటి సోవియట్ రష్యా, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ భారత దేశానికి…

ట్రంప్ దెబ్బకు అనిశ్చితిలో ఆర్ధిక వ్యవస్థలు!

Deportees entering the U.S. military plane అధ్యక్ష పగ్గాలు చేపట్టక ముందే గాజా యుద్ధాన్ని చిటికెలో ముగిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాలు శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అన్ని దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడిని పొగిడాడో, తిట్టాడో తెలియని వ్యాఖ్యలతో అయోమయం సృష్టించి ఇండియాను మాత్రం “అతి భారీ వాణిజ్య సుంకాలు మోపే దేశం” అని ప్రతికూల వ్యాఖ్యలతో భారత…

అమెరికాలో వామపక్షం అంటే అర్ధమే వేరు!

అమెరికాలో నవంబరు 5 తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారీస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తానే రెండోసారి కూడా అధ్యక్ష పదవి రేసులో నిలబడాలని కోరుకున్నాడు. కానీ బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పబ్లిక్ కార్యకలాపాల్లో ఆయన క్రమంగా డిమెన్షియా జబ్బుకు గురవుతున్న పరిస్ధితి స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఏదో విధంగా జో బైడెన్…

అమెరికా కాంగ్రెస్ లో నెతన్యాహు చెప్పిన కొన్ని అబద్ధాలు!

Netanyahu addressing U.S. Congress on July 24, 2024 అమెరికా తోక ఇజ్రాయెల్ అన్న సంగతి ఈ బ్లాగ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. అమెరికా తోకకి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాకి ఎంతయితే దుష్టబుద్ధితో కూడిన మెదడు ఉన్నదో దాని తోక ఇజ్రాయెల్ కి కూడా అంతే స్థాయి దుష్ట బుద్ధితో కూడిన మెదడు ఉండడం ఆ ప్రత్యేకత. ఒక్కోసారి అమెరికా తలలో ఉన్న మెదడు కంటే దాని తోకలో ఉన్న మెదడుకే ఎక్కువ…

పోటీ నుండి బైడెన్ ఉపసంహరణ, ట్రంప్ కు తలనొప్పి!

అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు. అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా…

కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్ కి ఫోన్ చేసిన మోడి

ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రుల (కేబినెట్) విధాన నిర్ణయాలు ఎవరి ప్రయోజనం కోసం ఉద్దేశించబడి ఉండాలి? ఈ ప్రశ్నకు జవాబు చాలా సులభం. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు విధానాలు రూపొందించి అమలు చేయాలి. విదేశాలు, విదేశీ కంపెనీల మరియు విదేశీయుల పెట్టుబడుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం పని చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే దేశద్రోహం అవుతుంది. భారత దేశ రక్షణ కోసం పని చేసే ఆర్మీ-నేవీ-ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ రహస్యాలను విదేశాలకు అందజేస్తే…

అమెరికా ఆర్ధిక పరిస్ధితులే బ్లడ్ బాత్ కి కారణం -2

“రష్యాలో వర్షం కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పట్టుకుంటారు” అని గతంలో పరిహాసం ఆడేవాళ్లు. బి‌జే‌పి పార్టీ, దాని అనుబంధ సంఘాల వాళ్ళకు ఈ పరిహాసం అంటే తగని ఇష్టంగా ఉండేది. “భారత స్టాక్ మార్కెట్ల పతనానికి మేము తెచ్చిన ఎల్‌టి‌సి‌జి పన్ను కారణం కాదు, బలహీన గ్లోబల్ (అమెరికా అని చదువుకోవాలి) ఆర్ధిక పరిస్ధితులే అందుకు కారణం” అని ఇప్పుడు బి‌జే‌పి మంత్రి జైట్లీ నిజాలను విడమరిచి చెబుతున్నాడు. అప్పుడు కమ్యూనిస్టులపై చేసిన పరిహాసం…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -1

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఆల్పైన్ పర్వతాల లోని విడిది నగరం దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాలు జరుగుతున్నాయి. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రారంభ ప్రసంగం చేసి వచ్చాడు. మోడీతో పాటు పలు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు కూడా వేదికపై ప్రసంగాలు చేస్తున్నారు. 2000 సం. తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశాలకు హాజరవుతున్నాడు. అందుకు అమెరికాకు కారణాలు ఉన్నాయి. అధ్యక్షుడు…

ఉత్తర కొరియా: ఆసియా-పివోట్ వ్యూహాన్ని పై మెట్టు చేర్చిన ట్రంప్ -2

చారిత్రక కోణం ఒక భూతంగా, ప్రపంచ సమస్యగా అమెరికా ముందుకు తెచ్చిన ఉత్తర కొరియా విషయంలో చారిత్రక కోణం తరచుగా విస్మరణకు గురవుతోంది. సమకాలీన రాజకీయార్ధిక విశ్లేషణా నిపుణులు సైతం ఉత్తర కొరియాపై ఆరంభం నుండి అమెరికా అనుసరిస్తూ వచ్చిన దాష్టీకం గురించి వివరించి చెప్పడంలో విఫలం అవుతున్నారు. ఉత్తర కొరియా – అమెరికా, ఉత్తర కొరియా – జపాన్, ఉత్తర కొరియా – చైనాల మధ్య చోటు చేసుకున్న చారిత్రక పరిణామాలను చెప్పుకోకపోతే సమస్యను పాక్షికంగా…

ఉత్తర కొరియాపై సామ్రాజ్యవాద యుద్ధ మేఘాలు?!

గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వార్తల్లో ఉత్తర కొరియా ఒక ప్రధాన అంశంగా వార్తల్లో నానుతోంది. ఈ వార్తలను ప్రధానంగా సృష్టిస్తున్నది అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు. కాగా ఇండియాతో సహా ఇతర మూడో ప్రపంచ దేశాలలోని చిన్నా, పెద్దా వార్తా సంస్థలన్నీ ఈ వార్తా కధనాలను క్రమం తప్పకుండా మోసి పెడుతున్నాయి. వాస్తవాల జోలికి పోకుండా అవాస్తవాలనే వాస్తవాలుగా నెత్తి మీద వేసుకుని ప్రచారం చేస్తున్నాయి. భారత దేశంలో అయితే ప్రాంతీయ…