పోటీ నుండి బైడెన్ ఉపసంహరణ, ట్రంప్ కు తలనొప్పి!

అమెరికా అద్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నట్లు జోసెఫ్ బైడెన్ ప్రకటించాడు. ఎక్స్ (ట్విట్టర్) ఈ మేరకు బైడేన్ ఒక లేఖను పోస్ట్ చేశాడు. అదే లేఖలో ఆయన తన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి మద్దతు (ఎండార్స్ మెంట్) ప్రకటించాడు. అధ్యక్షుడుగా ఉండగా బైడెన్ డిమెన్షియాతో బాధపడుతున్నట్లు ఆయన బహిరంగ ప్రవర్తన ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. అనేకసార్లు తన సొంత సిబ్బంది పేర్లు మర్చిపోవటం, విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా…

గవర్నర్ అత్యాచారం: పోలీసు విచారణ నుండి ఎస్కేప్!

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పైన ఆయన సిబ్బంది లోని మహిళ ఒకరు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసుల విచారణ నుండి తప్పించుకునేందుకు ఘనత వహించిన ఆ గవర్నర్ సిగ్గు లేకుండా తన గవర్నర్ గిరీని అడ్డం తెచ్చుకుంటున్నాడు. గవర్నర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందిలోని మహిళ తనపై లైంగిక అత్యాచార ఆరోపణ చేసిన తర్వాత, ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా, తాను నిర్వహిస్తున్న పదవి పట్ల ఇసుమంతైనా బాధ్యత ఉన్నా వెంటనే…

హేమంత్ సొరేన్ నేరంపై సాక్షాలు లేవు -హై కోర్టు

నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడి లను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను ఒక్కొక్కరినీ జైలు పాలు చేస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వానికి జార్ఖండ్ హై కోర్టు నుండి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ భూ కుంభ కోణానికి పాల్పడినట్లు ఎలాంటి సాక్షాలు లేవు అని చెబుతూ హై కోర్టు ఆయనకు జూన్ 28 తేదీన సాధారణ బెయిలు మంజూరు చేసింది. 50 వేల రూపాయల…

అమెరికా తీరంలో రష్యా యుద్ధ నౌకలు, అమెరికా ప్రతి చర్య!

Russian Navvy Admiral Gorshkov at Havana Port ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో అమెరికా, ఐరోపాలు ఒక పక్క, రష్యా, చైనాలు మరో పక్క ఉన్న శిబిరాల మధ్య ఉద్రిక్తత నానాటికి శృతి మించుతోంది. ఉక్రెయిన్ కు అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను రష్యా భూభాగం లోపల ఉన్న మిలటరీ టార్గెట్ల పైకి ప్రయోగించేందుకు ఇటీవల అమెరికా అనుమతి ఇవ్వడంతో రెండు శిబిరాల మధ్య ఉద్రిక్తత ఒక్క సారిగా వేడెక్కినట్లయింది. ఈ పరిస్ధితుల్లో రష్యాకు చెందిన పలు…

నేను ముస్లింని!

ఈ ఫోటోకి ప్రత్యేకంగా వ్యాఖ్యానం అవసరం లేదేమో! నిజమే. ముస్లింలలో కొందరిని, వారి హింసాయుత చర్యల కారణంగా, అది కూడా వారి హింసకు వారి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్న కారణంగా… తప్పు పట్టకుండా ఉండలేం. కానీ ఆ బాపతు జనాలు అన్ని మతాల్లోనూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఒక్క ముస్లిం హింసావాదులనే ఎంచి చూపడం, ప్రత్యేకంగా ఆ మతం పైనే దాడి చెయ్యడం… అన్నది ఓ కుట్రలో భాగంగా జరుగుతోంది. 2001 సెప్టెంబర్ 11 తేదీన…

డీ-నాజీఫికేషన్, డీ-మిలటరైజేషన్ మా లక్ష్యం -రష్యా

ఉక్రెయిన్ పై దాడికి కారణాలను చెబుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ను ‘డీ-నాజీఫై, డీ-మిలిటరైజ్’ చెయ్యడం మా లక్ష్యం’ అని ప్రకటించాడు. “మా నాటో మిత్రులు, ఉక్రెయిన్ పాలకులు మాకు ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’ చేపట్టటం మినహా మరో దారి వదల లేదు” అని కూడా పుతిన్ ఫిబ్రవరి 21 తేదీ ప్రసంగంలో చెప్పాడు. పుతిన్ మాటలకు అర్ధం ఏమిటి అన్న ప్రశ్నకు తలొక సమాధానం ఇస్తున్నారు. ముఖ్యంగా డీ-నాజీఫై చెయ్యడం అంటే ఏమిటి?…

అమ్మాయి 18, అబ్బాయి 21 బుల్లి బాయ్ ఆప్ ముద్దాయిలు!

యువత ఎటు ప్రయాణిస్తోంది? ఇప్పుడే ఇంటర్ దాటిన ఓ టీనేజి అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్న ఓ నూనూగు యువకుడు ఇంతటి ద్వేషాన్ని తమ మెదళ్లలోకి ఎలా ఎక్కించుకున్నారు? ఎలాంటి వ్యక్తిగత కారణం లేకుండా, ఎలాంటి సంఘటన జరగకుండా, ఏ విధంగానూ సంబంధం లేకుండా అంత చిన్న వయసులో ముస్లిం స్త్రీలను ఆన్ లైన్ లో వేలానికి పెట్టే టంతటి విద్వేషం వారికి ఎందుకు పుట్టింది? ఇది ఆట అనుకున్నారా? ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల నుండి ఆయా…

క్లైమెట్ ఛేంజ్: పశ్చిమ దేశాల హిపోక్రసీ (గొప్ప వీడియో)

వాతావరణ మార్పులపై పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మూడో ప్రపంచ దేశాలకు తెగ బోధనలు చేస్తుంటాయి. ముఖ్యంగా ఇండియా, చైనాలు బొగ్గు వినియోగంతో అత్యంత అధికంగా భూమండలాన్ని కాలుష్యం లో ముంచుతున్నాయని అవి తరచుగా లెక్కలు చెబుతాయి. ఈ లెక్కలు ఎంత వాస్తవమో ఈ వీడియో చక్కగా వివరిస్తుంది. తప్పకుండా చూడండి. (ఫేస్ బుక్ నుండి) https://www.facebook.com/1439656221/videos/224755656490178/

ఫ్రాన్స్ లో మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ‘IHU’

ఇండియాలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ విజృంభణ ఇంకా అందుకోనే లేదు, మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ని ఫ్రాన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఇండెక్స్ కేసు (మొదటి కేసు) కనుగొన్నట్లు ‘ఐ‌హెచ్‌యూ మేడిటెరనీ’ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది. దక్షిణ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో కనుగొన్న కొత్త రకం కోవిడ్ వైరస్ ను ఇప్పటికే 12 మందిలో కనుగొన్నారు. మ్యుటేషన్ పరిభాషలో ఈ రకాన్ని B.1.640.2 వేరియంట్ గా…

హెలికాప్టర్ క్రాష్: సి‌డి‌ఎస్ బిపిన్ రావత్ దుర్మరణం

భారత సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి‌డి‌ఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఆయన ప్రయాణిస్తున్న ఎం-17 హెలికాప్టర్ కూలి దుర్మరణ చెందారు. జనరల్ బిపిన్ రావత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఛైర్మన్ కూడా. ఈ పదవిలో నియమితులైన మొట్ట మొదటి ఆర్మీ అధికారి ఆయన. జనరల్ బిపిన్ రావత్ డిపార్ట్^మెంట్ ఆఫ్ మిలట్రీ అఫైర్స్ కి కూడా అధిపతిగా వ్యవహరించారు. 1 జనవరి 2020…

ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే WION వెబ్ సైట్ అందజేసిన…

స్టేటస్!

గత పది రోజుల నుండి టపాలు లేకపోవడంతో మిత్రులు ఆందోళన తెలియజేస్తున్నారు. రాయడం లేదేమని అడుగుతున్నారు. నేను మళ్ళీ అనారోగ్యం పాలయ్యానేమోనని ఎంక్వైరీ చేస్తున్నారు. చొరవ చేసి అడుగుతున్న వారి వెనుక మరింత మంది పాఠకుల ఆందోళన ఉంటుందని నేను ఊహించగలను. మొదటి విషయం: నేను ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. రోజూ ఆఫీస్ కి వెళ్ళి వస్తున్నాను. రెండవది: బ్లాగ్ అప్ డేట్ కాకపోవడానికి కారణం నేను మరొక రాత పనిలో ఉండటమే. ఈ అక్టోబరుతో…

బ్రెక్సిట్ ప్రభావం అంతేమీ లేదు!

బ్రెక్సిట్ కి ఓటు వేస్తె ప్రపంచం తల కిందులు అయిపోతుంది అన్నంతగా పశ్చిమ ప్రభుత్వాలు, కార్పొరేట్ మీడియా ప్రచారం చేసింది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తల కిందులు కావటం అటుంచి ఉన్న వంకర సరి అవుతున్నట్లుగా కనిపిస్తున్నది. పడిపోతుంది అనుకున్న పారిశ్రామిక ఉత్పత్తి ఊహించని విధంగా పెరుగుదల నమోదు చేయగా మొత్తంగా బ్రిటన్ జీడీపీ కూడా కాస్త దారిలో పడినట్లు కనిపిస్తున్నది. జూన్ 23 తేదీన జరిగిన బ్రెక్సిట్ ఓటు వలన…

క్రికెట్ దసరా, ముసలోళ్ళకి లేదిక! -కార్టూన్ 

ఎట్టకేలకు క్రికెట్-రాజకీయ మరియు రాజకీయ-క్రికెట్ పెద్దల నిరసనల మధ్య సుప్రీం కోర్టు, జస్టిస్ లోధా కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీ ప్రతిపాదించిన, తాము ఆమోదించిన సిఫారసులను ఆరు నెలల లోపు బిసిసిఐ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీ సిఫసిఫారసుల మేరకు రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు క్రికెట్ పాలనా పదవులలో ఉండటానికి వీలు లేదు. ఆ లెక్కన ఢిల్లీ క్రికెట్ సంఘం నేతగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి.…