కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ల పుణ్యమా అని దేశ ప్రజలు ముఖ్యంగా 1980ల తర్వాత పుట్టిన వాళ్లు ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది.
250 కు పైగా రైళ్లను ఒకే రోజు రద్దు చేసిన ఘనత బహుశా నరేంద్ర మోడి / బిజెపి ప్రభుత్వానికి దక్కుతుంది. వివిధ రాష్ట్రాల నుండి దేశ రాజధానికి వస్తున్న లాంగ్ డిస్టెన్స్ రైళ్లు 75 కు పైగా రద్దు కాగా, ఢిల్లీ నగరంలో 180 కు పైగా లోకల్ మరియు మెట్రో రైళ్లను రద్దు చేసేశారు.
ఇదంతా కేవలం ఒకే ఒక వ్యక్తి పదవిని కాపాడటానికి మాత్రమే. ఇంకో రకంగా చూస్తే 13.3 కోట్ల ప్రజల వోటు హక్కును రద్దు చేసేసి, వారి భారత పౌరసత్వాన్ని ప్రశ్నార్ధకం చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ కు ఆ పనులు చేసేందుకు తగిన సమస్త హక్కులను ఆయనకు కట్టబెట్టిన నరేంద్ర మోడి ప్రభుత్వం తమను తాము కాపాడుకునేందుకు ఈ రద్దు కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందిరా గాంధీ ప్రభుత్వం రాజ్యాంగం లో కల్పించబడిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎమర్జెన్సీ పాలన అమలు చేయగా, నరేంద్ర మోడి ప్రభుత్వం ఏ కారణం లేకుండా, ఏ అవకాశం లేకుండానే ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ పాలనను అమలు చేస్తున్నది.
ఎమర్జెన్సీ పాలన ఇదిగో, ఇలా ఉందని కాక్రోచ్ జనతా పార్టీ చెబుతోంది.



