
పోరాట మార్గాన్ని వీడేదే లేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టంగా ప్రకటించింది. ప్రధాన నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లను పోలీసులు అరెస్టు చేసి ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో దాచినప్పటికీ తాము మాత్రం పోరాట పంధాన్ని విడిచేది లేదని ప్రకటించారు.
అభిజిత్ దిప్కే స్థానంలో పార్టీ నాయకత్వ స్థానాన్ని చేపట్టిన అజింక్య షిండే ఈ మేరకు పత్రికా ముఖంగా ప్రకటన చేశాడు. బిజేపి పార్టీని గెలిపించటం కోసం ఎన్నికల వ్యవస్థను గోల్ మాల్ చేసినందుకు ప్రయత్నించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ రోజు జరగవలసిన నిరసన ప్రదర్శనను విఫలం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ తాము వెనక్కి తగ్గటం లేదని అజింక్య షిండే స్పష్టంగా ప్రకటించాడు.
గ్యానేష్ కుమార్ రాజీనామా చేయకుండా కాపాడుకోవటం మోడి ప్రభుత్వానికి అత్యవసరం అనీ, గ్యానేష్ కుమార్ పదవిలో లేనట్లయితే తమ ఎన్నికల అక్రమాలు కొనసాబోవనీ అందుకే గ్యానేష్ ను కాపాడుకోవటం కోసం బిజెపి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ రోడ్లను పోలీసుల తో నింపి నిరసన ప్రదర్శన జరగకుండా చేసేందుకు ప్రయత్నించిందని అజింక్య షిండే ఆరోపించాడు.
ఈ రోజు తమ ప్రదర్శన పూర్తిగా జరగకుండా అడ్డుకున్నప్పటికీ జంతర్ మంతర్ కు వెళ్లకుండా అనేక చోట్ల తమను అరెస్ట్ చేసినప్పటికీ రేపు మళ్ళీ తిరిగి వస్తామని అజింక్య ప్రకటించాడు. మరో ఇద్దరు సిజెపి నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆగస్టు 12 తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు తాము మళ్ళీ వస్తామని చెప్పాడు.
ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరా కూడా ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ రోజు ఆటంకాలు కలిగిస్తే అక్టోబర్ 11 తేదీన మళ్ళీ వస్తామని, రేపు కూడా అడ్డుకుంటే అక్టోబర్ 12 తేదీన వస్తామని, ఆ రోజు కూడా అడ్డుకుంటే అక్టోబర్ 13 తేదీన… ఇలా తమ ప్రదర్శన కొనసాగే వరకూ వస్తూనే ఉంటామని స్పష్టం చేశారామె!
కాగా అక్టోబర్ 10 తేదీ ప్రదర్శన కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్ధులు, యువకులు దాదాపు 7,000 మందికి పైగా పోలీసులు అరెస్టు చేశారని ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ పత్రికలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో కూడా అనేక మందిని అరెస్టు చేశారని టి.వి చానెళ్లు, స్వతంత్ర యూ ట్యూబ్ చానెళ్లు తెలిపాయి. ప్రదర్శనను, ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకోవటం తోనే ఎవరికి వారు మొబైల్ ఫోన్లు ఆన్ చేసి వీడియోలు రికార్డ్ చేసి ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్^స్టా గ్రామ్ లకు అప్ లోడ్ చేయటంతో దేశ వ్యాపితంగా విద్యార్ధులు, యువకులు పోలీసుల నుండి ఎదుర్కొంటున్న నిర్బంధాల వార్తలు ప్రజలకు తెలుస్తున్నాయి.
కాగా పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పోలీసు బస్సుల్లోకి ఎక్కిస్తుండటంతో వారు సరికొత్త నిరసన రూపాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ సారి ఎక్కడ వీలయితే అక్కడ ఫ్లాష్ మెరిసినట్టుగా అకస్మాత్తుగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పోలీసులు దగ్గరకు రావడంతోనే అక్కడి నుండి పరుగెట్టుకెళ్లి మరో చోట ఫ్లాష్ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
ఐరాస మానవ హక్కుల సంఘం పిలుపు
మరో పక్క ఐరాస మానవ హక్కుల సంస్థ నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఎలాంటి కారణం లేకుండా శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్న యువకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఒక బ్యానర్ ను UNHR సామాజిక వెబ్ సైట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

ప్రదర్శనకారులను మూకుమ్మడిగా అరెస్ట్ చేసిన వార్తలు వస్తున్నాయని, ప్రదర్శన నాయకులు, సివిల్ సొసైటీ సభ్యులు, సంస్థలు, లాయర్లు, జర్నలిస్టులు ఇత్యాది పౌరులను ఢిల్లీలో ప్రదర్శనకు ముందు మరియు ప్రదర్శన జరగాల్సిన రోజుల అరెస్టు చేసినట్టు తమకు వర్తమానం అందిందని, నాగరిక ప్రజాస్వామ్య ప్రభుత్వం నీడలో ఇవి జరగటానికి వీలు లేదని ఐరాస మానవ హక్కుల సంస్థ పేర్కొంది. శాంతియుత నిరసన కోసం గుమి కూడే హక్కును గౌరవించి, రక్షణ కల్పించ వలసిందిగా అధికారులను కోరుతున్నాము అని యు.ఎన్.హెచ్.ఆర్ ప్రకటించింది.
ఫ్లాష్ అప్ డేట్!!!
అక్టోబర్ 11 తేదీన కూడా జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ప్రదర్శన కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ ఇన్-చార్జ్ నాయకుడు అజింక్య షిండే ప్రకటించిన నేపధ్యంలో అక్టోబర్ 11 తేదీన ఢిల్లీకి చేరే రైళ్లు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సిజెపి నిరసన అనగానే మోడి ప్రభుత్వం గుండెల్లో వణుకు పుడుతోందని సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించాడు.


