పశ్చిమాసియా (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 12

– 02-05-2026 ఇరాన్, చైనా దేశాల మధ్య పెరుగుతున్న మైత్రి ప్రపంచ రంగంలో ఇరాన్ స్టాండింగ్ మెరుగు పడేందుకు దోహదం అవుతున్నది. చైనా ట్యాంకర్ల పై ట్రంప్ యుద్ధం ప్రకటించటం ప్రమాదకర పరిణామం కానుంది. చైనా నుండి అమెరికాకు ఎగుమతులు తగ్గించుకునేందుకు, చైనాలో అంతర్గత వినియోగం పెంచుకునేందుకు తద్వారా అమెరికా – చైనా ల మధ్య వాణిజ్య సమతూకం (అమెరికా ఎగుమతుల కంటే చైనా ఎగుమతులు చాలా ఎక్కువ) తెచ్చేందుకు ట్రంప్ బల ప్రయోగంతో ప్రయత్నాలు చేయటంగా…

ఇరాన్ యుద్ధ తంత్రానికి ప్రశంసలు -నోట్స్ & అప్ డేట్స్ 10

– 29/04/2026 జర్మనీ ఛాన్సలర్ (ఆ దేశ అధ్యక్షుడితో సమానం) ఫ్రెడరిక్ మెర్జ్ ఇరాన్ – అమెరికా యుద్ధం గురించి వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఆయన నిజానికి అమెరికాకి పక్కా అనుకూలుడు. కానీ పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ అనుసరించిన ఎత్తుగడలను పొగడకుండా ఉండలేకపోయాడు. యుద్ధం అనంతర చర్చల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులకు గర్వభంగం కావించిందని మొహమాటం లేకుండా చెప్పాడు. జర్మనీ లో ఒక కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతూ యుద్ధం ఎలా ముగించాలో అమెరికాకి తెలియటం లేదని…

ఇరాన్ సీజ్ ఫైర్ చర్చలు -నోట్స్ & అప్ డేట్స్ 9

– 27/04/2026 ప్రపంచానికి కనిపించటం లేదు గానీ, ఈ యుద్ధం, చర్చలు, అన్నింటి వెనక చైనా తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నది. చైనా ఉంది గనకనే జెనీవా బదులు ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతున్నాయి. బహుశా ఇస్లామాబాద్ చర్చలు నూతన ప్రపంచ వ్యవస్థ (New World Order) ఏర్పడి పాతుకుపోతున్న క్రమంలో వైరి పక్షాల మధ్య జరుగుతున్న ప్రథమ చర్చలు కావచ్చు. మౌలిక మార్పులు జరుగుతున్నపుడు, అవి గుణాత్మక మార్పుకు గురైనట్లు స్పష్టంగా మనకు కనిపించటానికి…

గల్ఫ్ (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 8

– 25/04/2026 ట్రంప్ ఎన్ని అబద్ధాలు చెప్పినా హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్ లో కొనసాగుతున్నది. ఇరాన్ అదుపులోనే హార్ముజ్ గుండా రవాణా జరుగుతున్నది. హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్ లో ఉన్నది అంటే దాని గుండా నౌకలను ఇరాన్ అనుమతించటం లేదు అని అర్థం కాదు. నిజానికి హార్ముజ్ గుండా సరుకు, చమురు రవాణా జరుగుతోంది. కాకుంటే అది ఇరాన్ అనుమతి తో మాత్రమే జరుగుతున్నది. ఇరాన్, ఏ షరతులతో ఐతే అమెరికాతో చర్చలకు అంగీకరించి…

ఇరాన్ పై ఆధిపత్య యుద్ధం -నోట్స్ & అప్ డేట్స్ 7

అమెరికా పసిఫిక్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ పపారో, అమెరికా నేవీ వద్ద సరిపోయినన్ని ఆయుధాలు లేవని వాపోయాడు. ఇరాన్ పైన దాడి కోసం ఆయుధాలు ఖర్చై పోయాయని ఆయన చెప్పాడు. “నా వద్ద తగినంత సంఖ్యలో యాంఫీబియస్ షిప్ (నీరు, నేల రెండింటి పై వెళ్ళగల షిప్ లు) లేవు. తగినన్ని సర్ఫేస్ డిస్ట్రాయర్ లు లేవు. తగినన్ని ఎటాక్ సబ్-మెరైన్లు అయితే ఖచ్చితంగా లేవు. మన ప్రయాణ మార్గం తప్పుడు దిశలో నడుస్తోంది” అని వాపోయినట్లు వాషింగ్టన్ టైమ్స్ పత్రిక తెలిపింది.

ఇరాన్ యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ -6

– 22/04/2026 రెండు వారాల సీజ్ ఫైర్ గడువు ఏప్రిల్ 22 తేదీతో ముగిసింది. గడువు ముగియటానికి సరిగ్గా రెండు గంటల ముందు సీజ్ ఫైర్ గడువు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. యుద్ధ విరమణ చర్చలు సజావుగా కొనసాగటానికి వీలుగా తాత్కాలిక సీజ్ ఫైర్ కాలాన్ని పొడిగించాలన్న పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు గడువును “నిరంతరాయంగా” (indefinite period) పెంచుతున్నానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మెసేజ్ లో బొంకాడు. నిజానికి గడువు ముగిసినా, ఒప్పందం కుదరక పోయినా…