నేను రాసిన ఈ ఆర్టికల్ ఈ రోజు ప్రజాతంత్ర పత్రికలో ప్రచురించబడింది. ప్రజాతంత్ర పత్రిక ఈ-పేపర్ నుండి ఈ కింది ఫోటో సంగ్రహించబడింది. ప్రజాతంత్ర పత్రిక వెబ్ సైట్ లో ఆర్టికల్ స్పష్టంగా చూసేందుకు కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. -విశేఖర్

“ప్రభుత్వాలు చెబుతున్నట్టు ఎఫ్.డి.ఐ ల ద్వారా టెక్నాలజీ మనకు బదిలీ కాకపోగా మన డబ్బునే వేల కోట్లు పెట్టుబడి సబ్సిడీగా ఇవ్వటం వలన ప్రధానంగా విదేశీ కంపెనీలు లాభపడుతున్నాయి. Please subscribe our channel YouTube.com/@prajatantra-news కొంతమేర దేశీయ ప్రైవేటు పెట్టుబడిదారులు లబ్ది పొందుతున్నప్పటికీ దేశీయ ప్రైవేటు పెట్టుబడిలో తరచుగా రుణాల రూపంలో విదేశీ ఫైనాన్స్ కంపెనీల వాటా ఉంటోంది. ప్రధాన మంత్రి ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం ద్వారా దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. కానీ మన డబ్బుని సబ్సిడీగా ఇచ్చి విదేశీ కంపెనీల టెక్నాలజీని అరువు తెచ్చుకుని దేశంలో విదేశీ ఉత్పత్తుల తయారీకి అనుమతి ఇవ్వటం అంటే విదేశీ సరుకులకు దేశీయ రంగు కాగితాలు చుట్టి దేశీయ ముద్ర వేసుకోవటమే. దానికి బదులు అదే డబ్బు భారతీయ పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో పెట్టుబడిగా పెట్టి నిజమైన స్వావలంబన సాధించలేమా? “
-ఎన్వీఎస్
https://www.prajatantranews.com/are-indian-funds-being-funneled-to-foreign-semiconductor-companies/
Please follow our page Facebook.com/prajatantranewspaper
