ఇరాన్ యుద్ధం మళ్ళీ మొదలైందా? -నోట్స్ & అప్డేట్స్ 13

– 08/06/2026 యుద్ధం సరికొత్త దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. లెబనాన్, ఇజ్రాయిల్ ల మధ్య ఏప్రిల్ 8 తేదీన కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మరుసటి రోజు నుండి ఉల్లంఘిస్తూనే ఉంది. ఉల్లంఘన కొనసాగిస్తే తాము ఇజ్రాయెల్ పైన దాడి చేయక తప్పదని ఇరాన్ కూడా హెచ్చరిస్తూనే ఉంది. కానీ అప్పటి నుండి ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. లెబనాన్ రాజధాని బీరూట్ లో హిజ్బోల్లా కి పట్టు ఉన్న దక్షిణ ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ పౌర…

ఇరాన్ పై మరో తీవ్ర దాడికి అమెరికా ఆయుధాల మోహరింపు!

– ఇరాన్ దేశంతో చర్చలు జరుపుతున్నట్లు, చర్చలు విజయవంతం అయ్యే దిశలో పరిణామాలు జరుగుతున్నాయని అమెరికా ఒక వైపు చెబుతుండగానే, మరో వైపు ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పూటకో మాట రోజుకో పాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దిక్కు దరీ లేని ప్రకటనలతో స్టాక్ మార్కెట్ ను కుదిపేయటం ద్వారా అక్రమంగా మార్కెట్ లాభాలు ఆర్జించే కుట్రలను అమలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యుద్ధం ముగించేందుకు అమెరికా – ఇరాన్ దేశాల…

పశ్చిమాసియా (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 12

– 02-05-2026 ఇరాన్, చైనా దేశాల మధ్య పెరుగుతున్న మైత్రి ప్రపంచ రంగంలో ఇరాన్ స్టాండింగ్ మెరుగు పడేందుకు దోహదం అవుతున్నది. చైనా ట్యాంకర్ల పై ట్రంప్ యుద్ధం ప్రకటించటం ప్రమాదకర పరిణామం కానుంది. చైనా నుండి అమెరికాకు ఎగుమతులు తగ్గించుకునేందుకు, చైనాలో అంతర్గత వినియోగం పెంచుకునేందుకు తద్వారా అమెరికా – చైనా ల మధ్య వాణిజ్య సమతూకం (అమెరికా ఎగుమతుల కంటే చైనా ఎగుమతులు చాలా ఎక్కువ) తెచ్చేందుకు ట్రంప్ బల ప్రయోగంతో ప్రయత్నాలు చేయటంగా…

ఇరాన్ యుద్ధ తంత్రానికి ప్రశంసలు -నోట్స్ & అప్ డేట్స్ 10

– 29/04/2026 జర్మనీ ఛాన్సలర్ (ఆ దేశ అధ్యక్షుడితో సమానం) ఫ్రెడరిక్ మెర్జ్ ఇరాన్ – అమెరికా యుద్ధం గురించి వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఆయన నిజానికి అమెరికాకి పక్కా అనుకూలుడు. కానీ పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ అనుసరించిన ఎత్తుగడలను పొగడకుండా ఉండలేకపోయాడు. యుద్ధం అనంతర చర్చల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులకు గర్వభంగం కావించిందని మొహమాటం లేకుండా చెప్పాడు. జర్మనీ లో ఒక కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతూ యుద్ధం ఎలా ముగించాలో అమెరికాకి తెలియటం లేదని…

“నీచ అమెరికా…” చర్చలపై ఇరాన్ ప్రకటన!

“అత్యంత నీచ, దుర్మార్గ మరియు కపట బుద్ధితో కూడిన శత్రు అమెరికా – తాను యుద్ధం ద్వారా సాధించ లేని దానిని చర్చల బల్ల వద్ద సాధించాలని ప్రయత్నించింది.

“అమెరికా చేసిన డిమాండ్లలో, ఇరాన్ ఇప్పటి వరకు శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించటం, హోర్ముజ్ జలసంధి పైన ఇరాన్ సార్వభౌమాధికారం గురించి ఏమీ తేలకుండానే బేషరతుగా తెరవటం లాంటివి ఉన్నాయి.