సామూహిక నరమేధానికి ఎన్ని పేర్లో!

– యూదు ప్రజలపై సామూహిక నరమేధం (జీనోసైడ్) జరిగితే దానిని “హోలోకాస్ట్” అని పిలుస్తారు. ఐరిష్ ప్రజలపై సామూహిక నరమేధం జరిగితే దానిని “కరువు” అని పిలుస్తారు. నేటివ్ అమెరికన్ల పైన సామూహిక నరమేధం జరిగితే దానిని “డిస్కవరీ” అంటారు. (అమెరికాని కనిపెట్టింది కొలంబస్ కదా మరి!) ఆఫ్రికన్ల పైన సామూహిక నరమేధం జరిగితే దానిని “వలసవాదం” అంటారు. పాలస్తీనా ప్రజలపై యూదులు జరిపే నరమేధాన్ని “ఆత్మ-రక్షణ” అని పిలుస్తారు. ముస్లిం ప్రజలపై సామూహిక హత్యాకాండ జరిపితే…

ఇళ్ళల్లో జొరబడి 16 మంది ఆఫ్ఘన్ పౌరులను చంపిన అమెరికా సైనికులు

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల దుర్మార్గాలు మానవ మాత్రులు ఊహించని స్ధాయికి చేరుకుంటున్నాయి. అమెరికా సైనికుల బృందం ఒకటి కాందహార్ లో ఉన్న తమ స్ధావరానికి సమీపంలో ఉన్న ఆఫ్ఘన్ పౌరుల ఇళ్ళలో చొరబడి నిద్రిస్తున్న పౌరులను అమానుషంగా కాల్చి చంపారు. కేవలం ఒక సైనికులు మాత్రమే, అదీ నేర్వస్ బ్రేక్ డౌన్ కి గురయిన సైనికుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అమెరికా కమేండర్లూ, నాటో అధిపతులూ చెపుతున్నప్పటికీ, అది నిజం కాదనీ అమెరికా ప్రత్యేక బలగాలకు…