ముస్లింల వోట్ల తొలగింపుకు ఫారం 7 తో బిజెపి కుట్ర, విచారణకు కమిషన్ ఆదేశం

– ఎస్ఐఆర్ జరిగిన ఇతర రాష్ట్రాల్లో చేసినట్టే బిజెపి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. ఫారం 7 ఫారంలను పెద్ద మొత్తంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించటం ద్వారా ముస్లిం వోటర్ల వోట్లు తొలగించటానికి బిజెపి పధక రచన చేసి అమలు చేస్తున్నట్లు బూత్ లెవల్ అధికారుల ద్వారానే వెల్లడి అయింది. దానితో ముస్లిం ప్రజల వోట్లను వోటర్ల జాబితా నుండి తొలగించటానికి బిజెపి దేశవ్యాపితంగా కృషి చేస్తున్నట్టు మరోసారి వెల్లడి అయింది. వోటర్ల జాబితాలో…

ఎస్ఐఆర్ అవతవకలపై కోర్టు: మీరు కొత్త రూల్స్ ఎలా విధిస్తారు?

– వోటర్ల జాబితా తయారు కోసం ఇప్పటికే చట్ట బద్ధ నిబంధనలు ఉండగా ఎస్.ఐ.ఆర్ కోసం అసలు నిబంధనలకు భిన్నంగా సరికొత్త నిబంధనలు ఎలా విధిస్తారని బొంబే హై కోర్టు ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించింది. ఆరుగురు సభ్యులు గల కుటుంబం పాత నివాసం నుండి కొత్త చోటికి మారిన నేపధ్యంలో ఎస్.ఐ.ఆర్ ఎన్యూమరేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఫారం నెంబర్ 8 ని సమర్పించి నప్పటికీ ఆ కుటుంబాన్ని ఎన్నికల జాబితా లో చేర్చటానికి…

Podcast Episode: ఎన్నికలు, యుద్ధం, చమురు

Pip: ప్రజాస్వామ్యం, యుద్ధం, చమురు — ఈ మూడూ ఒకేసారి ఒత్తిడిలో ఉంటే ఏం జరుగుతుందో ఈవారం స్పష్టంగా కనిపిస్తోంది. Mara: విశేఖర్ రాసిన ఈ వారపు పోస్టులు బెంగాల్ ఓటు హక్కు సంక్షోభం నుండి ఇరాన్-అమెరికా యుద్ధ నష్టాల వరకు, సౌదీ చమురు మార్గాల మూసివేత వరకు పరస్పర సంబంధం ఉన్న సంక్షోభాలను విశ్లేషిస్తున్నాయి. Pip: బెంగాల్ ఎన్నికల ప్రభావం నుండి మొదలుపెడదాం. ఎన్నికలు, యుద్ధం, చమురు: ఒకే వ్యవస్థాగత సంక్షోభం Mara: బెంగాల్ లో…

ఎస్ఐఆర్ ఫలితం: 22 లక్షల బెంగాల్ వోటర్లు 12 యేళ్ళ దాకా ఓటు వేయలేరు!

– బెంగాల్ లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అప్పటిదాకా బెంగాల్ లో ముక్కుతూ మూలుగుతున్న బిజెపి ఒక్క సారిగా బంపర్ మెజారిటీ తో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది కానీ ఈ ఎన్నికల్లో 38 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. కారణం వాళ్ల ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ పేరుతొ తొలగించటమే. ఎస్ఐఆర్ వలన ఓట్లు కోల్పోయిన వాళ్లు అప్పీలు…

బీహార్ ఎస్.ఐ.ఆర్: అసలేం జరుగుతోంది?

బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గురించి పూర్వ రంగం గురించి కాస్త తెలుసుకుంటే ఉపయోగం. మూలం ఏమిటో తెలియకుండా బీహార్ ఎస్.ఐ.ఆర్ అంటూ ఎన్ని పోస్టులు రాసినా వృధాయే కదా! బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జనవరి 2025 లో బీహార్ వోటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో సవరించింది. సవరించి వోటర్ల జాబితా తుది నిర్ధారిత జాబితాను…

తొలగించిన ఓటర్ల జాబితా ఇచ్చే బాధ్యత మాది కాదు -ఇసిఐ

Special Intensive Revision in Bihar బీహార్ లో భారత ఎన్నికల కమిషన్ (లేదా భారత ప్రభుత్వం) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దరిమిలా, కమిషన్, ఆగస్టు 1వ తేదీన వోటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించింది. ఈ జాబితాలో గతంలో చోటు చేసుకున్న వోటర్లలో మొత్తం సుమారు 65 లక్షల మంది వోటర్లను తొలగించి మిగిలిన వారితో ముసాయిదాను కమిషన్ ప్రచురించింది. తొలగించిన 65 లక్షల మంది జాబితాను బూత్ ల వారీగా తమకు కూడా…

బీహార్ ఎస్ఐఆర్ చట్ట వ్యతిరేకం అని రుజువు చేస్తే, రద్దు చేసేస్తాం! -సుప్రీం కోర్టు

“స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (ఎస్ఐఆర్) పేరుతో బీహార్ వోటర్ల జాబితా మొత్తాన్ని తిరగ రాసేందుకు తెగబడ్డ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ), సుప్రీం కోర్టులో అగ్ని పరీక్ష ఎదుర్కుంటున్నది. బీహార్ ఎస్ఐఆర్ చట్ట విరుద్ధం అంటూ యోగేంద్ర యాదవ్ లాంటి స్వతంత్ర పరిశీలకులు, ఏడిఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్) లాంటి ఎన్.జి.ఓ లు, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా లాంటి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా…