యుద్ధం ఊబినుండి బైటపడాలంటే..! -ఇరాన్ 7 షరతులు

– అమెరికా తనకు తానే సృష్టించుకున్న యుద్ధం ఊబి నుండి బైటపడటానికి ఇరాన్ మరొక అవకాశం ఇచ్చింది. మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ద్వారా మొదటి అవకాశం ఇచ్చిన ఇరాన్ ఇప్పుడు ఏడు షరతులతో కూడిన మరొక అవకాశాన్ని అమెరికాకు కల్పించింది. అయితే మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ లోని అంశాలకు ఇప్పుడు ప్రతిపాదించిన ఏడు షరతులకు పెద్ద తేడా లేనట్టు కనిపిస్తున్నది. ఇరాన్ కు చెందిన సుప్రీం నేషనల్ కౌన్సిల్ అధిపతి మోహసేన్ రెజాయ్ శనివారం…

మరోసారి ఇరాన్, అమెరికా పరస్పర దాడులు

– అమెరికా, ఇరాన్ లు మరోసారి ఒకరి పైన ఒకరు దాడులు చేసుకున్నాయి. ఆదివారం నాడు అమెరికా సైన్యం ఇరాన్ కు చెందిన లారక్ ద్వీపంలోని మిసైల్, రాకెట్ లాంచింగ్ పరికరాలపై దాడులు చేసింది. అమెరికా దాడికి బదులిస్తూ ఇరాన్ సైన్యం జోర్డాన్, యుఏఈ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లను తమ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు గాలిలోనే అడ్డుకున్నాయని జోర్డాన్, యుఏఈ లు ప్రకటించాయి. ఇరాన్ దక్షిణ తీరంలోనూ,…