ఇరాన్-అమెరికా ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల ఆందోళనలు!
– ఇన్నాళ్లూ అమెరికా, యూరోపియన్ యూనియన్ రాజ్యాలు గానీ ప్రపంచానికి ఏమి చెప్పాయి? ఇరాన్ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం అనీ, తన ప్రజలను తీవ్రంగా అణచివేస్తున్నదనీ, అమెరికా ప్రవచించే ప్రజాస్వామ్యం కోసం వారు అర్రులు చాస్తూ అందుకు ఆటంకంగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అందుకే యేటా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తూ ఖమెనీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పాయి. తాము ఇరాన్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మద్దతు ఇస్తున్నామని, వారి ఆకాంక్షలు…

