సిగ్గు పడాల్సిన పరిస్ధితి! -ఫోటోలు

నరేంద్ర మోడి ప్రభుత్వం జనరేషన్ Z యువకులపై సాగిస్తున్న దమన నీతిని చూసి యావత్ దేశం సిగ్గు పడుతోందని పార్లమెంటు ఎంపి శశి ధరూర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధింఛినన్ని నిర్భంధ చర్యలను గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదని వ్యాఖ్యానించాడు.

ఢిల్లీ కి వెళ్ళే రహదారులన్నింటా చెక్ పాయింట్ ల విధింపు, కాంక్రీట్ బ్యారియర్ల ఏర్పాటు, రోడ్లకు అడ్డంగా ఇనప ముళ్లతో కూడిన అడ్డంకులు… వీటన్నింటితో పాటు 22,000 మందికి పైగా పోలీసుల మోహరింపు ఢిల్లీ నగరం ఒక పెద్ద యుద్ధ క్షేత్రంగా కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది.

250 ట్రైన్ లను నిషేదించారు. 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. విద్యార్ధులు, యువకులను ఇళ్ల నుండి పట్టుకు వెళ్ళి అరెస్టు చేశారు. రోడ్ల పై నుండి లాక్కెళ్లి బస్సుల్లో కుదేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ ని బంద్ చేశారు. “ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళే స్వేచ్ఛను పూర్తిగా సంకేళ్లతో బంధించి వేశారు” అని ఎంపి శశి ధరూర్ వ్యాఖ్యానించాడు.

మన జనరేషన్ Z అప్రకటిత ఎమర్జెన్సీ కి మించిన జనరేషన్. అని శశిధరూర్ వ్యాఖ్యానించారు. “Our GenZ deserves better than an undeclared Emer-GenZ” అని ఆయన X లో పోస్ట్ చేశారు. ఢిల్లీ లో విధించిన తీవ్ర నిర్బంధ చర్యలను ఆయన విమర్శించాడు. “ఇది సిగ్గు పడాల్సిన విషయం. ఆత్మ సాక్షికి ఏ విధంగానూ సమాధానం చెప్పుకోలేని చర్యలివి” అని విమర్శించాడు.

కాగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకురాలు నేహా బోరా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ల నాయకత్వం లో విద్యార్ధులు, యువకులు జోర్ బాగ్ నుండి డిల్లీ హాత్ కు ప్రదర్శనగా బయలుదేరారు. “ఇప్పుడు డిల్లీ హాత్ సరికొత్త జంతర్ మంతర్ గా అవతరించింది” అని ఆమె ప్రకటించారు.

కాగా నేహా బోరా నాయకత్వంలోని ప్రదర్శనను త్వరలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరా, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపంకర్ భట్టాచార్య, లాయర్ ప్రశాంత్ భూషణ్, యాక్టివిస్టు యోగేంద్ర యాదవ్ లను ఢిల్లీ లోని ఐఎన్ఏ మార్కెట్ వద్ద పోలీసులు అరెస్టు చేసి పట్టుకెళ్లారు.

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ నాయకత్వం లోని బృందాన్ని ఆమె నివాసం నుండి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఖైదీల వ్యాన్ లో ఆమెను తెలియని చోటుకు తీసుకెళ్లారని పత్రికలు తెలిపాయి. ఈ మేరకు ఆమె పార్టీ నేతలు పత్రికలకు వర్తమానం ఇచ్చారు. మమతా బెనర్జీ నివాసం వద్ద సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు మోహరించాయి.

33 మిలియన్ల ఫాలోయర్లను కలిగి ఉన్న యూ ట్యూబర్ ధృవ్ రాఠీ ని గురుగ్రామ్, సెక్టార్ 56 లో ఉన్న ఆయన ఇంటి నుండి పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకెళ్లారు. రాఠీ గతంలో కూడా సిజెపి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. ఆయనను చూసి వేలాది మంది అనుసరిస్తారని పోలీసుల అంచనాగా తెలుస్తోంది. అందుకే ఆయన బయలుదేరక ముందే ఇంటి నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

సి.పి.ఎం పార్టీకి చెందిన కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులను ఢిల్లీలో ప్రదర్శన తీస్తుండగా అరెస్ట్ చేశారు.

పంజాబ్ లో ఏ‌ఏ‌పి నాయకులు మనీష్ సిసోడియా తదితర నాయకులు, కార్యకర్తలను చండీఘర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ లో ఏ‌ఏ‌పి ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతం కావటాన చండీఘర్ పోలీసులు కేంద్రం ఆదేశాలతో పని చేస్తారు.

స్పందించండి