బ్రిటన్ దేశ కవలలు వీళ్లు. ఈ ఏప్రిల్ కి వీరికి ఏడేళ్లు నిండాయి. తల్లి దండ్రులు ఇద్దరూ వైట్ మదర్ కీ, బ్లాక్ ఫాదర్ కీ పుట్టినవాళ్ళే కావడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైందని డాక్టర్లు చెప్పారు. ఇది అరుదే అయినప్పటికీ అసాధ్యమేమీ కాదట. ప్రతి మిలియన్ బ్లాక్ అండ్ వైట్ జంటల్లో ఒక జంటకు మాత్రమే ఈ విధంగా వేరు వేరు రంగుల్లో ఐడెంటికల్ ట్విన్స్ పుట్టే అవకాశం ఉంటుందట. పుట్టినపుడు ఇద్దరికీ నీలి రంగు కళ్ళే ఉన్నా పెరిగే క్రమంలో బ్లాక్ పాప కళ్లు గోధుమరంగులోకి మారాయనీ, వైట్ పాపకి నీలి రంగు మరింత చిక్కనైందనీ వారి తల్లిదండ్రులు కైలీ హాడ్గ్ సన్, రెమీ హోర్డర్ లు ‘డెయిలీ మెయిల్’ కి తెలిపారు. 2006 డెయిలీ మెయిల్ పత్రిక వీరి కధనాన్ని మొదట ప్రచురించింది. అప్పటి ఫొటో తో పాటు తాజా ఫొటోని కూడా డెయిలీ మెయిల్ ప్రచురించింది.
–
–




