అమెరికా స్థావరాన్ని ఇరాన్ చావుదెబ్బ కొట్టింది -అమెరికా ఒప్పుకోలు

అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పైన ఆధిపత్య దురాక్రణ యుద్ధాన్ని ప్రారంభించి 6 నెలలు పైనే గడించాయి. ఈ కాలంలో అమెరికా బాంబు దాడుల్లో ఇరాన్ లో పలు రోడ్లు, బ్రిడ్జ్ లు, భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇరాన్ సైనికులు పలువురు చనిపోయారు. ఈ సంగతి ఇరాన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నది. అదే సమయంలో పశ్చిమాసియా అరబ్ దేశాలలో ఉన్న అమెరికా మిలటరీ, నావిక, వైమానిక స్థావరాల పైన కూడా ఇరాన్ పలుమార్లు ఎదురు దాడులు…