గల్ఫ్ (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 8

– 25/04/2026 ట్రంప్ ఎన్ని అబద్ధాలు చెప్పినా హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్ లో కొనసాగుతున్నది. ఇరాన్ అదుపులోనే హార్ముజ్ గుండా రవాణా జరుగుతున్నది. హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్ లో ఉన్నది అంటే దాని గుండా నౌకలను ఇరాన్ అనుమతించటం లేదు అని అర్థం కాదు. నిజానికి హార్ముజ్ గుండా సరుకు, చమురు రవాణా జరుగుతోంది. కాకుంటే అది ఇరాన్ అనుమతి తో మాత్రమే జరుగుతున్నది. ఇరాన్, ఏ షరతులతో ఐతే అమెరికాతో చర్చలకు అంగీకరించి…

డాలర్ కి వేగంగా తూట్లు పొడుస్తున్న చైనా!

మాయల మరాఠి ప్రాణం ఏడేడు సంద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో ఉన్నట్లుగా అమెరికా ప్రపంచాధిపత్యం, పెత్తనం అంతా ప్రపంచ మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యం లోనే నిక్షిప్తమై ఉన్నది. అమెరికా ఆధిపత్యాన్ని కూల్చాలంటే మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యాన్ని కూలగొడితే చాలు. అమెరికా దుర్గం పేక మేడ లాగా ఇట్టే కూలిపోతుంది. చైనా, రష్యా దేశాలు గత అయిదారేళ్లుగా డాలర్ పెత్తనాన్ని కూల్చేందుకు కృషి ప్రారంభించి మెల్లగానే అయినా స్ధిరంగా ఆ వైపు అడుగులు…