యుద్ధంలో ఇరాన్ చమురు ఆదాయం రెట్టింపు

ఇరాన్ అభివృద్ధిని అణగదొక్కి, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ను తిరుగులేని శక్తిగా అవతరింప జేయాలన్న కాంక్షతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఇరాన్ యుద్ధం సత్ఫలితాలను ఇవ్వటం లేదని పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు మొత్తుకుంటున్నాయి. ఇరాన్ అణు విధానంను సాకుగా చూపిస్తూ ఇరాన్ తన చమురు అమ్ముకోనివ్వకుండా అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు 45 యేళ్లుగా ఆంక్షలు విధించి అమలు చేస్తున్నాయి. ప్రపంచ అణు పెత్తనం కోసం అమెరికా, ఐరోపా లు ఏర్పాటు చేసిన అంతరాతీయ అణు ఇంధన…

ట్రంప్ మానసిక ఆరోగ్యం పైన అనుమానాలు!

– ఇరాన్ పైన సామ్రాజ్యవాద హంతక దాడుల నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన, చేస్తున్న ప్రకటనలు ఆయన మానసిక ఆరోగ్యం పైన అనుమానాలు కలిగిస్తున్నాయి. అనేక మంది మానసిక వైద్యులు, రాజకీయ-ఆర్ధిక విశ్లేషకులతో పాటు మెజారిటీ అమెరికా ప్రజలు కూడా ఈ అంశంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నట్లు అమెరికా పత్రికలు తెలియజేస్తున్నాయి. అమెరికాలో విశ్లేషకులు మరియు ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగల న్యూయార్క్స్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రముఖ పత్రికలు కూడా అధ్యక్షుడు ట్రంప్ మానసిక…

ఇరాన్ పై ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -3

హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపధ్యంలో G7 గ్రూపు దేశాలు చమురు ధరల్ని తగ్గించటానికి వివిధ దేశాలను తమ రిజర్వ్ నిల్వలను విడుదల చేయాలని కోరుతున్నాయి. ఇప్పటిదాకా జపాన్, అమెరికా ఈ అంశం లో ఆమోదం చెప్పాయి. ఇందులో కలిసేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. అంటే చమురు ధరలు తగ్గించేందుకు G7 కూటమి చేసే ప్రయత్నాలకు మద్దతుగా తమ (స్ట్రాటజిక్) నిల్వలను మార్కెట్ లో విడుదల చేసేందుకు ఇండియా నిరాకరించింది.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం -నోట్స్ & అప్-డేట్స్

– ఒక పక్క ఇరాన్ తో చర్చలు జరుపుతూనే అమెరికా, ఇజ్రాయెల్ లు హఠాత్తుగా ఫిబ్రవరి 28 తేదీన ఇరాన్ దేశం పైన నరహంతక దాడి ప్రారంభించాయి. దానితో అమెరికా, ఇజ్రాయెల్ లు నిజాయితీగా, ఘర్షణని నివారించే ఉద్దేశంతో చర్చలు జరపడం లేదని లోకానికి అర్ధం అయింది. చర్చల పేరుతో ఇరాన్ ను ఏమరుపాటు స్థితిలో ఉంచి మెరుపుదాడి చేయటమే అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యం అని స్పష్టం అయింది. ఇజ్రాయెల్, అమెరికా లు కుట్ర చేసినట్టే ఫిబ్రవరి 28…