గల్ఫ్ (ఇరాన్) యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ 11

– 30-04-2026 చమురు అంతర్జాతీయ ధర అధికారికంగా బ్యారెల్ 115 డాలర్లు గా కనిపిస్తున్నప్పటికీ వాస్తవ ధర బ్యారెల్ 200 డాలర్లు పలుకుతున్నట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. శ్రీలంక ఐతే బ్యారెల్ 248 డాలర్లు ధరకు కొనుగోలు చేసిందని ఆ దేశ అధికారులు ప్రైవేటుగా చెబుతున్నారు. షేర్ మార్కెట్లు పతనం కాకుండా ఉండేందుకు చమురు ధరలు తక్కువ కనబడేట్లు మ్యానిపులేట్ చేస్తున్నారు. తద్వారా ఇరాన్ యుద్ధ ప్రభావం ఏమీ లేదని అమెరికా ప్రజలకు సూచించే ప్రయత్నం జరుగుతోంది.…

ఇరాన్ సీజ్ ఫైర్ చర్చలు -నోట్స్ & అప్ డేట్స్ 9

– 27/04/2026 ప్రపంచానికి కనిపించటం లేదు గానీ, ఈ యుద్ధం, చర్చలు, అన్నింటి వెనక చైనా తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నది. చైనా ఉంది గనకనే జెనీవా బదులు ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతున్నాయి. బహుశా ఇస్లామాబాద్ చర్చలు నూతన ప్రపంచ వ్యవస్థ (New World Order) ఏర్పడి పాతుకుపోతున్న క్రమంలో వైరి పక్షాల మధ్య జరుగుతున్న ప్రథమ చర్చలు కావచ్చు. మౌలిక మార్పులు జరుగుతున్నపుడు, అవి గుణాత్మక మార్పుకు గురైనట్లు స్పష్టంగా మనకు కనిపించటానికి…

ఇరాన్ కి యుద్ధం కావాలి, అందుకే…

ఇరాన్ కి యుద్ధం కావాలి. ఇరాన్ కి యుద్ధమే ఆహారం. కానీ అమెరికాకి శాంతి కావాలి. శాంతి లేనిదే అమెరికా బ్రతకలేదు. ప్రపంచ శాంతి అమెరికాకి చాలా చాలా ముఖ్యం. కానీ ఇరాన్ తన యుద్ధ కాంక్షతో అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కావాలంటే కింద సాక్ష్యం చూడండి! అమెరికా ప్రపంచ శాంతి కోసం తపన పడుతూ, ప్రపంచం నిండా సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఇరాన్ దేశం ప్రపంచ శాంతి కోసం అమెరికాతో సహకరించకుండా…

బద్ధ శత్రు దేశాలకు ఇరాన్ స్నేహ హస్తం

ఇరాన్ తన బద్ధ శత్రు దేశాలకు కూడా స్నేహ హస్తం చాస్తోంది. P5+1 దేశాలతో తాత్కాలిక ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ విదేశీ మంత్రి మహమ్మద్ జవద్ జరీఫ్ మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రత్యర్ధి దేశాలతో సంబంధాలను బాగు చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా సున్నీ ముస్లిం మత దేశాలలో ఆయన పర్యటిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో మతపరంగానూ, చమురు వాణిజ్య ప్రయోజనాలపరంగానూ తమకు ప్రధాన ప్రత్యర్ధి సౌదీ అరేబియా కు సైతం జారీఫ్ ప్రయాణం చేయడం…

P5+1 – ఇరాన్ ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం

ఇరాన్, P5+1 దేశాల మధ్య ఇరాన్ లో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఒప్పందానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర స్ధాయిలో సాగించిన లాబీయింగు విఫలం అయింది. ఒప్పందం ఫలితంగా ఇరాన్, 20 శాతం మేర యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని 6 నెలల పాటు నిలిపేస్తుంది. దానికి ప్రతిఫలంగా ఇరాన్ పై విధించిన వాణిజ్య ఆంక్షలను 6 నెలల పాటు పాక్షికంగా ఎత్తేస్తారు. ఇది తాత్కాలిక ఒప్పందమే అయినప్పటికీ భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరగడానికి తగిన భూమిక ఏర్పడడానికి…

పీస్ పైప్ లైన్ పై వేలాడుతున్న అమెరికా ఆంక్షల కత్తి

అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతుండడంతో పాకిస్ధాన్-ఇరాన్ పీస్ పైప్ లైన్, నిధుల లేమితో సతమతమవుతోంది. ఇరాన్ సహజ వాయు నిక్షేపాలతో పాక్ ప్రజల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ పైప్ లైన్ తలపెట్టి దశాబ్దం దాటిపోయింది. పాకిస్ధాన్ మీదుగా ఇండియాకి కూడా గ్యాస్ సరఫరా చేయడానికి పీస్ పైప్ లైన్ ను మొదట ఉద్దేశించారు. కానీ అమెరికా బెదిరింపులతో ఇండియా ఈ ప్రాజెక్టును వదులుకుంది. పాకిస్ధాన్ మాత్రం అమెరికా హెచ్చరికలను త్రోసిరాజని ముందుకు వెళుతోంది. గత మార్చి…