ఇది ఎర్రర్ కాదు, నేరం! పదివేల వోట్ల తారుమారు పై యుపి ఎన్నికల అధికారి

– ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం ఫిలిబిత్ లో వోటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు కేవలం పొరపాటు గానీ నిర్లక్ష్యం గానీ కాదని, ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన నేరం అనీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ -సి‌ఈ‌ఓ) నవ డీప్ రిన్వా స్పష్టం చేశాడు. ఈ నేరంలో ఇద్దరు ఈ‌ఆర్‌ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) లు, ఒక కంప్యూటర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారని ఆయన చెప్పాడు. వారి ముగ్గురిపైన కొత్వాలి…