అదానిపై అవినీతి కేసును అమెరికా ఎందుకు డిస్మిస్ చేసింది?
– తెలంగాణ రాష్ట్రం నుండి ప్రచురించబడుతున్న ప్రజాతంత్ర పత్రిక ఈ రోజు నా ఆర్టికల్ ను ప్రచురించింది. ఆర్టికల్ కాస్త పెద్దది అయినప్పటికీ పూర్తిగా ప్రచురించినందుకు పత్రికను అభినందించాలి. నా తరపున కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. గౌతమ్ అదాని ప్రధాన మంత్రిగా 12 సంవత్సరాల నుండి భారత దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మిత్రుడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. బిజెపి నాయకత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత గౌతమ్ అదాని…
