కేదార్ నాధ్ లో ఏం జరిగింది? -వీడియో

యాహూ వీడియో కేప్చర్

యాహూ వీడియో కేప్చర్

కేదార్ నాధ్ ను ముంచెత్తిన జల ప్రళయం ఎలా జరిగి ఉండవచ్చో ఊహిస్తూ నిపుణులు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియోను హెడ్ లైన్స్ టుడే పత్రిక తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేయగా యాహూ న్యూస్ షేర్ చేసింది. వీడియోను ఈ బ్లాగ్ లో పబ్లిష్ చేసే మార్గం దొరకలేదు. అందువలన లింక్ మాత్రమే ఇస్తున్నాను.  వీడియోను ‘ఎందుకో ఏమో?’ గారు కింద వ్యాఖ్య ద్వారా అందించారు. కాబట్టి లింక్ ను తొలగించి వీడియో ఇస్తున్నాను.

–

–

మేఘ ప్రళయం ద్వారా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని పొదువు కున్న మందాకిని ఎత్తైన శిఖరాల నుండి ప్రవహించడం వలన భారీ జల శక్తిని (hydro power) సంతరించుకుంది. ఆ శక్తి తనకు అడ్డు వచ్చిన గ్రామాలను తుడిచిపెడుతూ కేదార్ నాధ్ ను అన్నివైపుల నుండి చుట్టుముట్టి ముంచేసిందని ఈ వీడియో వివరిస్తోంది. అంతటి శక్తికి కూడా కేదార్ నాధ్ ఆలయం, దాని చుట్టుపక్కల నిర్మాణాలు  నిలిచి ఉండడం ఒక విశేషం.

హిమాలాయల సానువులు పర్యావరణ పరంగా ఎందుకు సున్నితమైనవో ఈ వీడియో వివరిస్తుంది. కేదార్ నాధ్ ఆలయం అత్యంత సున్నితమైన ప్రాంతంలో నిర్మించబడి ఉండడం వలన ప్రభుత్వాలు ఎల్లవేళలా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన ఆగత్యాన్ని ఈ వీడియో గుర్తుకు తెస్తుంది.

4 thoughts on “కేదార్ నాధ్ లో ఏం జరిగింది? -వీడియో”


  1. అంతటి శక్తికి కూడా కేదార్ నాధ్ ఆలయం, దాని చుట్టుపక్కల నిర్మాణాలు నిలిచి ఉండడం ఒక విశేషం. aalayam okkate migilindi chuttu pakkala emi migalaledu

Leave a Reply