దయానిధి మారన్ హీరోగా మరో కొత్త టెలికమ్ కుంభకోణం

కరుణానిధి బంధువు, కేంద్ర మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ ప్రధాన పాత్రధారుడుగా మరో సరికొత్త టెలికం కుంభకోణం వెల్లడయ్యింది. తెహెల్కా పత్రిక ద్వారా వెల్లడయిన ఈ కుంభకోణం విలువ 700 కోట్ల రూపాయలు. తాను కేంద్రంలో టెలికం శాఖ మంత్రిగా ఉండగా తమిళనాడులోని ఎయిర్ సెల్ అనే కంపెనీకి టెలికం లైసెన్సులు రాకుండా సంవత్సరాల తరబడి దయానిధి మారన్ అడ్డుకున్నాడని తెహెల్కా పత్రిక బైట పెట్టింది. తన మిత్రుడికి చెందిన మలేషియా కంపెనీ మాక్సిస్‌కి ఎయిర్…