1970ల్లో బోర్డర్ దాటిన వాళ్లందర్ని బంగ్లాకి పంపగలరా? -కలకత్తా హై కోర్టు

– అక్రమ వలసదారుడు అన్న పేరుతో చట్ట బద్ధ ప్రక్రియ లేకుండా నెలల తరబడి పౌరులను నిర్బంధం లోకి ఎలా తీసుకుంటారని కలకత్తా హై కోర్టు ప్రశ్నించింది. చట్ట బద్ధ ప్రక్రియను అనుసరించకుండా ఒక వ్యక్తిని నిర్బంధించటం కుదరదని, చట్టంలో అందుకు అవకాశం లేదని కలకత్తా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌగత భట్టాచార్య గురువారం స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తరపున వాదిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాజ్ డీప్ మజుందార్ చేసిన వాదనలకు…