యుపి ప్రభుత్వం అతి చర్యలు: నిరంకుశ వ్యవస్థగా మారే ప్రమాదం -అలహాబాద్ హైకోర్టు అద్భుత తీర్పు

– ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులను, బ్యూరోక్రట్ అధికారులను అలహాబాద్ హై కోర్టు మంగళ వారం తీవ్రంగా తప్పు పట్టింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధిని ఆకృతి చౌదరి, తనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక నిరసన హక్కును ఉపయోగించుకున్నప్పటికీ ఆమె పైన జాతీయ భద్రతా చట్టం కింద అక్రమ కేసు నమోదు చేసి జైలులో పెట్టటం విపరీత చర్యగా అభివర్ణించింది. తప్పుడు పనులు చేసే బ్యూరోక్రట్ అధికారుల వల్ల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని “ఆర్వేలియన్ డిస్టోపియా” రాజ్యంగా దిగజార్చే…

మీ దాష్టీకం యూ‌పిలో చెల్లవచ్చేమో, ఇక్కడ కాదు -యూ‌పి పోలీసుల్తో ఢిల్లీ హై కోర్టు

ఉత్తర ప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ హై కోర్టు గడ్డి పెట్టింది. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అత్యంత అప్రజాస్వామిక చట్టం చేయడమే కాకుండా సదరు చట్టం పేరుతో విచక్షణారహితంగా వివాహితులను వారి కుటుంబ సభ్యులను అరెస్టులు చేసి జైళ్ళలో తోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న యూ‌పి ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హై కోర్టు పరోక్షంగా జ్ఞాన బోధ చేసింది. “ఇక్కడ ఢిల్లీలో మీ చర్యలు చెల్లబోవు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలైనా సరే చెల్లవు. ఢిల్లీ నుండి జనాన్ని…