అణు సాంకేతిక పరిజ్ఞానం కోసం పాక్ మిలట్రీ అధికారులకు లంచం చెల్లించిన ఉత్తర కొరియా
పాకిస్ధాన్‌కు అణుశాస్త్ర, అణ్వస్త్ర పితామహుడుగా పేరుపొందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాక్ మిలట్రీ పరువు తీస్తూ అణుబాంబు పేల్చినంత పని చేశాడు. పాకిస్ధాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉత్తర కొరియాకు అణు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉత్తర కొరియాకు బదలాయించాడని పాక్ ప్రభుత్వం ఖదీర్ ఖాన్‌పై ఇప్పటివరకూ ఆరోపిస్తూ వచ్చింది. ఆ అరోపణలకు భిన్నంగా అణు సాంకేతికత బదలాయింపులో పాక్ మిలట్రీకే నేరుగా సంబంధం ఉందనీ, అందుకు మిలట్రీ అధికారి ఒకరు 3 మిలియన్ డాలర్లు, మరొక అధికారి…