దేశీయ టెక్ రీసర్చ్ కంపెనీలకు నిధులు బంద్! ఏడాదిలోనే పధకాన్ని మడతేసిన కేంద్రం!

– నరేంద్ర మోడి ప్రభుత్వం దేశీయ ప్రైవేటు పరిశోధనా సంస్థల అభివృద్ధి కోసం అని చెబుతూ నవంబర్ 2025 లో ఆర్భాటంగా ప్రారంభించిన పధకం పది నెలలు గడవకుండానే మూలన పడే పరిస్ధితికి చేరినట్టు కనిపిస్తోంది. ఆరేళ్లలో లక్ష కోట్ల నిధులు సమకూర్చుతామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నాలజీ డవలప్^మెంట్ బోర్డు (టిడిబి) తమకు ప్రభుత్వం నుండి నిధులు అందటం లేదు కనుక ఇక కొత్త ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించలేమని చేతులెత్తేస్తూ తన ఆఫీసు…