అమెరికా అబద్ధం చెబుతుంది, ప్రపంచం నమ్మేస్తుంది!

– అది 2003 వ సంవత్సరం. అసలు అక్కడ ఉనికిలో లేని “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” ఉన్నాయని చెబుతూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిత్ర రాజ్యాలను వెంట బెట్టుకుని ఇరాక్ పైన విధ్వంసక దాడి చేసింది. ఇది ఊహించి చెప్పింది కాదు; రికార్డులకు ఎక్కిన వాస్తవం. గూఢచార సమాచారాన్ని వక్రీకరించారు లేదా తారుమారు చేశారు. కృత్రిమ కేసు సృష్టించారు. కృత్రిమంగా కేసుని సృష్టించిన వారికి అది కృత్రిమ కేసు అని స్పష్టంగా తెలుసు. అది కృత్రిమ…

ఇరాక్ యుద్ధం చట్ట విరుద్ధం -యూ‌కే మాజీ ఉప ప్రధాని

ఇరాక్ యుద్ధానికి దారి తీసిన పరిస్ధితులను విచారించటానికి గత బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్, తన నివేదికను వెలువరించిన దరిమిలా బ్రిటన్ మాజీ నేతల ఒప్పుకోళ్ళు వరదలా ప్రవహిస్తున్నాయి. 2009లో అప్పటి ప్రధాని గార్డన్ బ్రౌన్, లార్డ్ జాన్ చిల్కాట్ నేతృత్వంలో నియమించిన విచారణ కమిషన్ కొద్ది రోజుల క్రితం విచారణ నివేదికను విడుదల చేసింది. ఆనాటి ప్రధాని టోని బ్లెయిర్ సరైన కారణాలు లేకుండా బ్రిటిష్ యువ సైనికుల ప్రాణాలను బలి పెడుతూ దేశాన్ని…

ఇరాక్‌పై దాడికోసమే అబద్ధాలతో రిపోర్టు తయారు చేశాం -ఇంగ్లండ్ ఇంటలిజెన్స్ మాజీ అధికారి

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” కలిగి ఉన్నాడనీ, వాటివలన ఇంగ్లండు భద్రతకు ముప్పు అనీ నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదిక (డొసియర్) వాస్తవాలపై ఆధారపడిన నివేదిక కాదనీ, తమకు వచ్చిన ఆదేశాల మేరకు ఇరాక్‌పై దాడిని అనివార్యం చేస్తూ లేని సాక్ష్యాలతో తయారు చేశామనీ నివేదిక రచయితల్లో ఒకరైన బ్రిటన్ ఇంటలిజెన్స్ మాజీ సీనియర్ అధికారి ఇంగ్లండ్ ప్రభుత్వం నియమించిన చిల్కాట్ కమిషన్ ముందు సాక్ష్యం ఇస్తూ చెప్పాడు. సెప్టెంబరు 2002…