అంబానీ ‘క్యాంప సూర్’ కోసమే బిస్లరీ ‘అన్ సేఫ్’ అయిందా?
నవంబర్ 22 తేదీన భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సంస్థ బిస్లరీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ పైన ప్రాసిక్యూషన్ నడిపేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన బాటిల్డ్ వాటర్ లో అనుమతించిన మోతాదుకు మించి బ్రోమైట్, పాలీ న్యూక్లియర్ ఆరోమేటిక్ హైడ్రో కార్బన్స్ (పిఏహెచ్) లు ఉన్నట్టు ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలటంతో కంపెనీని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఆధారంగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ…
