ఇరాన్ దాడుల్లో అమెరికా గల్ఫ్ స్థావరాలకు తీవ్ర నష్టం -ఫోటోలు

అమెరికా మిలటరీ (పెంటగాన్) అధికారులు యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టం వివరాలను ఎట్టకేలకు కాస్తయినా వెల్లడి చేసేందుకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక, నౌకా, మరియు వాయు దళాల స్థావరాల పైన ఇరాన్ మిలటరీ చేసిన దాడుల్లో తాము తీవ్రంగా నష్టపోయామని పెంటగాన్ అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన పలు యుద్ధ పరికరాలు (ఫైటర్ జెట్ విమానాలు, ఎం.క్యూ9 రీపర్ డ్రోన్ లు, మిసైల్ లాంచర్లు, రాడార్లు, మొదలైన పరికరాలను అమెరికా నష్టపోయింది. కాగా…

ఇరాన్ పై అమెరికా ఆధిపత్య యుద్ధం: నోట్స్ & అప్ డేట్స్ -4

హార్ముజ్ జల సంధి ని ఇరాన్ నియంత్రణ కు వదిలేస్తూ యుద్ధ విరమణ కు అంగీకరించటానికి ట్రంప్ సుముఖంగా ఉండటం గల్ఫ్ రాజ్యాలకు మింగుడు పడటం లేదు. సౌదీ అరేబియా, యు ఏ ఈ, కతార్ దేశాలు ఇప్పటి దాకా యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్ కి తెర వెనుక చెబుతూ వచ్చాయి. ట్రంప్ ప్రకటన వారిని భయాందోళనలకు గురి చేస్తూ ఉండాలి.

అమెరికా శాసిస్తుంది, ఇండియా పాటిస్తుంది!?

బిజెపి-ఆర్ఎస్ఎస్ పాలనలో, నరేంద్ర మోడి, అమిత్ షా ద్వయం హయాం లో ఇండియా పైన అమెరికా దాష్టీకం, పెత్తనం, కంట్రోల్ పెరిగిపోయిందన్న సూచనలు అమెరికా అధ్యక్షుడు, మంత్రులు, అధికారులు వరుసగా ఇస్తూనే ఉన్నారు. ఇండియా పైన తమ పెత్తనం సంపూర్ణం అన్న నమ్మకాన్ని వాళ్ళు తమ మాటల ద్వారా, ప్రకటనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఇవ్వటం కొనసాగుతూనే ఉన్నది. వారి సూచనల్లో ఎలాంటి తడబాటు లేకపోవటమే అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం! రైసీనా డైలాగ్ పేరుతో భారత…