అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నికలు – భౌగోళిక రాజకీయాలు -పార్ట్ 2

– దరిమిలా, జర్మనీ లాంటి ఇండస్ట్రియల్ పవర్ హౌస్ లో కూడా జి‌డి‌పి పడిపోయింది లేదా ఎదుగు-బొదుగూ లేకుండా స్తంభించింది. 2022 కు ముందు తన గ్యాస్ అవసరాల్లో 45 శాతం రష్యా నుండి యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకోగా, అది ఇప్పుడు సున్నా కు చేరింది. ఫలితంగా ఈయూ దేశాల్లో ఇంధనం ఖర్చు అత్యధికంగా పెరిగింది. జర్మనీ మాన్యుఫాక్చరింగ్ రంగం (రసాయనాలు, ఉక్కు, ఆటో విడి భాగాలు మొ.వి) ఇంధనం పైన (ఎనర్జీ-ఇంటెన్సివ్) ఎక్కువగా ఆధార…