ఉక్రెయిన్ ఫైటర్ జెట్ SU-25తో కూల్చారు -2

ట్యాంకు విధ్వంసక ఇన్సెండియరీ బాంబులు, splinter-explosive బాంబులు ఆల్టర్నేట్ గా కాక్ పిట్ ను తాకితే ఏమవుతుందో ఒకసారి ఊహించండి! ఇవి ఆధునిక ట్యాంకును ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవి. ఇన్సెండియరీ బాంబులు పాక్షికంగా కాక్ పిట్ గుండా ప్రయాణించి అవతలి వైపు నుండి కాస్త మారిన రూపంతో బైటికి వచ్చాయి. (ఏవియేషన్ ఫోరెన్సిక్ నిపుణులు శ్రద్ధ పెడితే వాటిని విమానం కూలిన ఏరియాలో కనుగొనవచ్చు.) మందపాటి ట్యాంకు గోడలను ఛేదించుకుని పోయే విధంగా ఈ బాంబు గుళ్లను…

MH17: ఫైటర్ జెట్ గుళ్ళు పేల్చి కుల్చారు -జర్మన్ పైలట్

మలేషియా ప్రయాణీకుల విమానం MH17 ని బక్ మిసైల్ తో కూల్చారని ఉక్రెయిన్, అమెరికా, ఐరోపా రాజ్యాలు కట్టగట్టుకుని ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఈ ఆరోపణల్లో అగ్రభాగాన నిలిచారు. ఆనక అబ్బే పొరబాటున కూల్చి ఉంటారని నాలుక మడతేశారు. కానీ బక్ మిసైల్ తోనే కూల్చారని, కూల్చడానికి తగిన పరిస్ధితులను రష్యాయే ఏర్పరిచిందని ప్రస్తుతం వాదిస్తున్నారు. కానీ జర్మనీకి చెందిన ఏవియేషన్ నిపుణుడు పీటర్ హైసెంకో జులై 30…

MH17: మీడియా చెప్పనిదేమిటి? -అమెరికా హౌస్ సభ్యుడు రాన్ పాల్

(రాన్ పాల్ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ – మన లోక్ సభకు సమానం)లో 2013 వరకు సభ్యుడు. అమెరికా అధ్యక్ష పదవికి లిబర్టేరియన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో రెండు సార్లు అధ్యక్ష పదవికోసం పోటీ పడ్డారు. అమెరికా రహస్య గూడచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అరాచకాలను బైటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ తాను రాన్ పాల్ కే ఓటు వేశానని బహిరంగంగా చెప్పాడు. అమెరికా బహుళజాతి కంపెనీలకు రాన్ పాల్…

పొరబాటున కూల్చారు -అమెరికా

అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా ఇంటలిజెన్స్ అధికారుల ప్రత్యక్ష సహకారంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో మలేషియా విమానాన్ని కూల్చారని, అందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ ఆరోపణల నుండి వెనక్కి తగ్గింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పొరబాటున కూల్చి ఉండవచ్చని చెబుతోంది. అయితే అందుకు కూడా తమ వద్ద సాక్ష్యాలు లేవని మెల్లగా చెబుతోంది. ఈ వ్యవహారం చూస్తే మహా భారతంలోని…

దాగలేని నిజం: వార్ జోన్ మీదికి విమానాన్ని ఎందుకు మళ్లించారు?

ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతంలో కూల్చివేసిన మలేషియా విమానం MH17, తన రోజు వారీ రూట్ లో కాకుండా జులై 17 తేదీన కాస్త ఉత్తర దిశకు జరిగి ప్రయాణం చేసింది. రోజువారీ రూట్ లో ప్రయాణం చేసి ఉన్నట్లయితే MH17 అసలు తిరుగుబాటు ప్రాంతం దోనెత్స్క్ ప్రాంతం మీదకు వెళ్ళి ఉండేదే కాదు. కూలిపోయిన రోజున యధాప్రకారం ఆంస్టర్ డాం నుండి ఆగ్నేయ దిక్కులో నేరుగా ప్రయాణించకుండా కాస్త పైకి దిశ మార్చుకుని ప్రయాణించింది. ఆ రోజు…

బక్ మిసైళ్ళు మిలిటెంట్ల దగ్గర లేవు -ఉక్రెయిన్ అధికారి

మలేషియా విమానాన్ని కూల్చివేసింది తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే అని పశ్చిమ పత్రికలు, పశ్చిమ రాజ్యాధినేతలు తెగ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం ఇదే పల్లవి అందుకుని మిలిటెంట్లను పోరాట విరమణ చేసేలా సహకరించడం లేదని రష్యాకి కూడా పాపం అంటగట్టే ప్రయత్నం చేశారు. అయితే మిలిటెంట్ల దగ్గర అసలు బక్ మిసైళ్లే లేవని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పడంతో ఈ ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం అయిపోయింది.…

మలేషియా విమానం: ఎవరు కూల్చారు?

ఉక్రెయిన్ లో కూలిపోయిన విమానం దానికదే కూలిపోలేదని, ఎవరో కూల్చివేశారని పత్రికలన్నీ చెబుతున్నాయి. రష్యా తయారీ అయిన బక్ మిసైల్ తో విమానాన్ని కూల్చివేశారని, ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అనీ ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. తిరుగుబాటుదారులు మాత్రం అది తమ పని కాదని తమ వద్ద ఆ స్ధాయి మిలట్రీ పరికరాలు లేవని చెబుతున్నారు. భుజం మీద పెట్టుకుని ప్రయోగించే మిసైళ్ళు మాత్రమే తమ వద్ద ఉన్నాయని వాటితోనే ఉక్రెయిన్ ఫైటర్ జెట్ లను…

ఉక్రెయిన్: మలేషియా విమానం కూలి 295 మంది మరణం?

ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో మలేషియా ఎయిర్ లైన్స్ కి చెందిన ప్రయాణీకుల విమానం కూలిపోయింది. విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులే క్షిపణి ప్రయోగంతో విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పశ్చిమ కార్పొరేట్ సంస్ధలు పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాయి. ఆరోపణలను తిరుగుబాటుదారులు తిరస్కరించారు. విమానాన్ని కూల్చగల మిలట్రీ పరికరాలు తమవద్ద లేవని తెలిపారు. హిందూ మహా…