పొరుగు దేశమే మమ్మల్ని కాపాడుతోంది! -కాశ్మీర్ నేత ఫరూక్

– జమ్ము & కాశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి, పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వృద్ధ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు అయిన ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద ప్రకటన చేశాడు. అంతర్జాతీయంగా మన పొరుగు దేశమే కాశ్మీర్ ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతోందని తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. తన వ్యాఖ్యల ద్వారా బి‌జే‌పి నుండి ఖండన మండనలు ఎదుర్కొన్నాడు. “పొరుగు దేశం అంతర్జాతీయంగా అనేక చోట్లకు వెళ్ళి కాశ్మీరీ ప్రజల…