ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ధామస్ నియామకాన్ని రద్దుచేసిన సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ హెచ్ కపాడియా ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పి.జె.ధామస్ నియామకాన్ని రద్ధు చేస్తూ తీర్పునిచ్చారు. కేరళలొ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉండగా 1992లో పామాయిల్ ను అధిక ధరలకు దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న పి.జె.ధామస్ ను సి.వి.సి గా నియమించడం చెల్లదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ “సుప్రీం తీర్పు ప్రధానికీ, ఆయన ప్రభుత్వానికీ పెద్ద దెబ్బ” అని పేర్కొంది. సి.వి.సి ప్రతిష్ట సుప్రీం…