ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్ కు చైనా సహాయం నిజమే!

– పహల్గాం ఉగ్రవాద దాడుల దరిమిలా ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్ పైన నాలుగు రోజుల పాటు ఇండియా మిసైల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్తాన్ లోపలికి చొచ్చుకు వెళ్ళిన భారత ఫైటర్ జెట్ లు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించింది. అనంతరం పాకిస్తాన్ సైన్యాధికారులు కోరటంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత సైన్యం ప్రకటించింది. ‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంగా పాకిస్తాన్ సైన్యానికి చైనా సైన్యం ప్రత్యక్ష సాంకేతిక…

పాక్ తో అణు సంబంధాలు కొనసాగుతాయి -చైనా

ఎవరేమనుకున్నా పాకిస్ధాన్ తో తమ అణు వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడే తాము పాకిస్ధాన్ కు అణు రియాక్టర్లు సరఫరా చేస్తున్నామని ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‘ (ఎన్.ఎస్.జి) నిబంధనలు కూడా తాము అతిక్రమించడం లేదని చైనా తెలిపింది. కనీసం రెండు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా సహకరిస్తోందని, ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైనా తన అణు వ్యాపారాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఎన్.ఎస్.జి…

అమెరికాకు పాకిస్ధాన్ “తలాక్! తలాక్!! తలాక్!!!” చెప్పనున్నదా?

జరుగుతున్న పరిణామాలు అమెరికా పట్టునుండి పాకిస్ధాన్ జారిపోనున్నదా అన్న అనుమాలు కలగజేస్తున్నాయి. పాకిస్ధాన్ నుండి అమెరికా మనుషుల (ప్రత్యేక భద్రతా బలగాలు లేదా సి.ఐ.ఏ గూఢచారులు) సంఖ్యను సగానికి తగ్గించాల్సిందిగా పాకిస్ధాన్ మిలట్రీ అమెరికాను డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ మిలట్రీ కోరిక మేరకు తమ పాకిస్ధాన్ నుండి తమ మనుషులను వెనక్కి పిలిపిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. “అనవసరమైన మనుషులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు సాయం చేయడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు”…