మోడి ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా ఆందోళనలు, ఘర్షణ పంధాలో అరుణాచల్ Gen’Z’

అరుణాచల్ ప్రదేశ్ లో విద్యార్ధులు, యువకులు ఆందోళన బాట పట్టారు. మోడి ప్రభుత్వం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపడంతో ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపై దాడులకు దిగారు. ఎం‌ఎల్‌ఏ ల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ చర్యలకు మోడి ప్రభుత్వం ‘హింసాత్మక చర్యలు’ అని పేరు పెట్టింది. వారి ఆందోళనకు కారణం మోడి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన భారీ బహుళార్ధక సాధక ప్రాజెక్టు. దీని పేరు సియాంగ్ అప్పర్ ముల్టీ పర్పస్ పాజెక్ట్ (SUMP). శుక్రవారం (అక్టోబర్ 23)…