దుర్గా నాగపాల్: 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించా

ఉత్తర ప్రదేశ్ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ను తాను 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు వాగుతుండగా రికార్డు చేసిన వీడియో బైటకొచ్చింది. దీనితో శాంతిభద్రతలను నియంత్రించడంలో భాగంగానే ఆమెను సస్పెండ్ చేశామన్న యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఫలితంగా అఖిలేష్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందిలో పడినట్లయింది. మింగలేక, కక్కలేక సమాధానాలు వెతుక్కోవలసిన పనిలో రాష్ట్ర ప్రభూత్వం పడిపోయింది. నిజాయితీ అధికారుల కంటే ఇసుక మాఫియాయే…

రక్తం కారేలా కొట్టుకున్న యు.పి పోలీసులు -వీడియో

ఇది ఇండియాలో మాత్రమే జరుగుతుందట! అలా చెప్పడం అతిశయోక్తే అయినా, జరిగింది మాత్రం ఘోరమే. ఏ తగాదా వచ్చిందో గానీ ఇద్దరు పోలీసులు బహిరంగంగా, అందరూ చూస్తుండగానే రక్తం కారేలా లాఠీలతో బాదుకున్నారు. కెమెరా పని చేస్తోందన్న స్పృహే లేకుండా కొట్టుకున్నారు. చూడడానికి ఒళ్ళు గగుర్పొడిచేలా కొట్టుకుని ఆనక వారిలో ఒకరు వీడియోగ్రాఫర్ తోనో, విలేఖరితోనో మాట్లాడారు కూడాను. తొమ్మిది రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. Times Now వార్తా ఛానెల్ ద్వారా యాహూ…