తెలంగాణ డిమాండ్‌పై అంతర్జాతీయ పెట్టుబడుల దృక్పధం ఎలా ఉంది?

తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు సాగుతున్నందున రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని గత సంవత్సరం నుండి ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం ఎదో ఒక ఆందోళన జరుగుతున్నందున రవాణా సౌకర్యం దెబ్బతిని కంపెనీల కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని వార్తా సంస్ధలు కూడా రాస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్ధల సిబ్బంది తమ తమ కార్యాలయాలకు చేరుకోవడంలో విఫలమవుతున్నందున నష్టం జరుగుతున్నదని అవి తెలుపుతున్నాయి. ముఖ్యంగా హైద్రాబాద్ బ్రాండ్ నేమ్ అంతర్జాతీయంగా మారుమోగుతున్న సందర్భంలో తెలంగాణ కోసం…