190 అణ్వాయుధాలతో పాక్ ని దాటిన ఇండియా!

ప్రస్తుతం ఇండియా వద్ద 190 అణ్వాయుధాలు (న్యూక్లియర్ వార్ హెడ్స్) ఉన్నాయని అమెరికా కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) సంస్థ అంచనా వేసింది. పాకిస్తాన్ కంటే 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఇండియా వద్ద ఉన్నట్టు దీని అర్ధం. త్వరలో ఇండియా వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య యునైటెడ్ కింగ్డం ని మించిపోతాయని ఎఫ్ఏఎస్ అంచనా వేసింది. ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ సిస్టం – 2026 నివేదికను ఎఫ్ఏఎస్ డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సన్ రచించినట్లు…

“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…