నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాక్కొని వెళ్ళగొట్టడం చైనాలోనూ మామూలే

ఇండియా, చైనా. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి రెండు స్ధానాల్లో ఉన్న దేశాలు ఇవి. ‘ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ’ లుగా ప్రపంచ ఆర్ధిక పండితులచేత ప్రశంసలు అందుకుంటున్న దేశాలు. కాని ఈ రెండు దేశాలు తమ ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసి, వారి వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టిమరీ ఆర్ధిక వృద్ధిని సాధిస్తున్నాయన్నది ఆ దేశాల ప్రజలకు మాత్రమే తెలిసిన సత్యం. భారత దేశంలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన…

3-డి వీధి చిత్రం సిద్ధం, ఇదిగో ఇలా -వీడియో

“ఇంకొన్ని వీధి చిత్రాలు” అంటూ నేను ప్రచురించిన వీధి చిత్రాల పోస్టు కింద నేను, వేణు గారూ త్రి-డి చిత్రాలను ఎలా గీస్తారబ్బా అని ‘హ్యాశ్చర్యపడి’ పోయాం. అందులో ‘హాశ్చర్యపడ్డానికి’ ఏమీ లేదు అని మిత్రుడు కెవిన్ ఒక వీడియోని తన వ్యాఖ్యలో ప్రచురించారు. ఇందులో త్రి-డి చిత్రాలు మనకు అలా ఎందుకు కనిపిస్తాయో వివరణ ఉంది. కెవిన్ ఇచ్చిన వీడియోని పట్టుకొని వెళ్తే ఇదిగో, ఈ వీడియో కూడా కనపడింది. మా హాశ్చర్యాన్ని నివృత్తి చేసిన…

చైనా, ఇండియాపై దాడి చేస్తుందని ప్రభుత్వం భావించడం లేదు -ప్రధాని

భారత దేశంపై దాడి చేయడానికి చైనా పధకం వేస్తోందన్న వాదనను భారత ప్రభుత్వం అంగీకరించడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం చెప్పాడు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఇరు దేశాల అభిప్రాయం అని ఆయన అన్నాడు. ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఇండియా, చైనా సరిహద్దులు మొత్తం మీద ప్రశాంతంగానే ఉన్నాయని లోక్ సభ సభ్యులకు తెలిపాడని ‘ది హిందూ’ తెలిపింది. “చైనా, ఇండియాపై దాడి చేయడానికి పధకం వేస్తోందన్న భావనను ఇండియా అంగీకరించడం లేదు” అని…

ఇంకొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు

యూరోపియన్ వీధి చిత్రాల్లో కనిపిస్తున్న త్రీ డైమెన్షనల్ ఎఫెక్టు చాలా అబ్బురపరిచే విధంగా ఉంటోంది. ఉదాహరణకి కింది ఫొటోల్లో ఎనిమిదవ ఫొటో చూడండి. ఆ బొమ్మ నిజానికి నేలపైన గీసిందే. బొమ్మ చివర స్త్రీ కూర్చుని ఉంది. కానీ చూస్తుంటే పులి నిజాంగా నిల్చుని ఉన్నట్లూ, స్త్రీ ఆ పులిపైన కూర్చుని ఉన్నట్లూ కనిపిస్తోంది. అలాగే పదకొండవ ఫొటో కూడా. ఇది నిజానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ త్రీ-డి ఎఫెక్టు ఎలా వచ్చిందన్నదీ ఓ పట్టాన అర్ధం…

ఆఫ్-పాక్ ‘హోం మేడ్’ బాంబులకు హడలుతున్న అమెరికా, పాక్‌కి సహాయం నిలిపివేత

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాలలోని మిలిటెంట్లు వాడుతున్న హోం మేడ్ బాంబుల ధాటికి అమెరికా ఠారెత్తుతోంది. అమెరికా, నాటో సైనికులను ఇంటి తయారీ బాంబులే వణికిస్తున్నాయి. ‘ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్’ (ఐ.ఇ.డి) గా పిలిచే ఈ బాంబులవల్లనే పలువురు అమెరికా, నాటో సైనికులు చనిపోవడంతో వాటిని ఎలా కట్టడి చేయాలో అర్ధం కాక సతమతమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ అమెరికా తన నిస్సహాయతను అంతా పాకిస్ధాన్ పైన చూపిస్తోంది. ఐ.ఇ.డిలను కట్టడి చేయడానికి పాకిస్ధాన్ సరైన…

2012 లో కుదేలు కానున్న బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ

వచ్చే సంవత్సరం బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర స్ధాయిలో కుచించుకుపోతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చాలా తక్కువగా ఉంటుందని ఈ బ్యాంకు గతంలోనే జోస్యం చెప్పింది. గతంలో అంచనా వేసినట్లుగా వృద్ధి చెందడానికి బదులు బ్రిటన్ ఎకానమీ కుచించుకుపోతుందని బ్యాంకు ఇప్పుడు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఎకానమీ 0.6 శాతం వృద్ధి చెందుతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ అంచనా వేసింది. దానికి బదులు 1.3 శాతం మేరకు కుచించుకుపోతుందని (లేదా…

కొత్త స్ధాయికి పతనమైన రూపాయి విలువ

భారత దేశ కరెన్సీ పతనం చెందడంలో కొంత పుంతలు తొక్కుతోంది. రోజుకొక రికార్డు  నమోదు చేస్తూ పాతాళానికి దూసుకు పోతోంది. సోమవారం అది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలరు కు ఇప్పుడు రు. 52.77 పై చొప్పున రూపాయి విలువ పలుకుతోంది. అంటే రూపాయికి 1/52.77 డాలర్ల చొప్పున రూపాయి విలువ పలుకుతోంది. సోమవారం వెలువడిన అక్టోబరు నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు భారత ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదించిన విషయాన్ని…

హిందూ మహాసముద్రంలో మొదటి చైనా మిలట్రీ స్ధావరం త్వరలోనే

హిందూ మహా సముద్రంలో మొట్టమొదటి మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయడానికి చైనా సిద్ధమవుతోంది. విదేశాలలో తన మొదటి మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా చైనా సోమవారం ప్రకటించింది. హిందూ మహా సముద్రంలో ఉన్న ‘సీ షెల్స్’ దేశంలో తన నౌకా దళాలకు మధ్యంతర సరఫరాల కోసం మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చైనా ప్రకటించింది. ‘సీ షెల్స్’ లో ఉన్న హార్మర్లలో తగిన దాన్ని ఎంచుకుని అక్కడ మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేస్తానని చైనా అధికారులు తెలిపారు.…

పాక్ వైమానిక స్ధావరాన్ని ఖాళీ చేసిన అమెరికా

పాకిస్ధాన్ హెచ్చరికతో అక్కడ ఉన్న వైమానిక స్ధావరాన్ని అమెరికా బలగాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. కొద్ది రోజుల తర్వాత పాక్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందని భావించినవారి ఊహలు, ఊహలుగానే మిగిలాయి. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి పాకిస్ధాన్ సైన్యం, పౌర ప్రభుత్వం ఔదలదాల్చాయి. ఆదివారం షంషి వైమానిక స్ధావరాన్ని పాకిస్ధానీ ఆర్మీ అమెరికా బలగాలనుండి స్వాధీనం చేసుకుంది. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో రెండు చెక్ పోస్టుల వద్ద ఉన్న పాక్ సైనికులను ఇరవై నాలుగు మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్…

పడిపోయిన భారత పారిశ్రామిక ఉత్పత్తి

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత భారత పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. సాధారణంగా ఎంతో కొంత (ఎంత తక్కువైనా) పెరుగుదలను నమోదు చేయవలసి ఉండగా, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదలను నమోదు చేయడం పరిశీలకులను నిశ్చేష్టుల్ని చేసింది. ఈ సంవత్సరం అక్టోబరు నెలలో గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి  5.1 శాతం తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఫ్యాక్టరీలు, ఖనిజ తవ్వకాలు, వివిధ యుటిలిటీ కంపెనీలు మొ.న రంగాల ఉత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తిగా పరిగణిస్తారు.…

సాహస కేరళ నర్సులకు కన్నీటి వీడ్కోలు -ఫొటోలు

ఈ ఇద్దరు నర్సుల పేర్లు పి.కె.వినీత, రేమ్యా రంజన్. కోల్‌కతా లో అగ్ని ప్రమాదానికి గురైన ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో వీరిరువురూ ప్రాణాలు కోల్పోయారు. వీరు నిజానికి చనిపోవలసిన అవసరం లేదు. ఆసుపత్రి యాజమాన్యం లాగానే తమ దారి తాము చూసుకున్నట్లయితే వీరు ఇప్పటికి శుభ్రంగా బతికి ఉండేవాళ్ళు. కాని వీరు తమ వృత్తి ధర్మాన్ని పాటించడానికే నిర్ణయించుకోవడంతో అగ్నిప్రమాదం వల్ల ఏర్పడిన దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చనిపోయారు. ఎ.ఎం.ఆర్.ఐ అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో కాలిన గాయాలకంటే ఊపిరాడక…

యూరోప్ సంక్షోభ పరిష్కారం, ది మిషన్ ఇంపాజిబుల్ -కార్టూన్

– ఎలక్ట్రానిక్ గాడ్గెట్: యూరప్ నాయకులారా! ఎలక్ట్రానిక్ గాడ్గెట్: మరో 11 గంటల 10 సెకన్లలో…..                        మీ యూరప్ ఖండం అంతర్గతంగా బద్దలు కానుంది.   ఎలక్ట్రానిక్ గాడ్గెట్: ఇక మీ కర్తవ్యం: ఐక్యంగా ప్రయత్నించి వినాశనాన్ని అడ్డుకోవడం                          కాని మీరు ఇప్పుడే కదలాలి! గుడ్ లక్!! ఎలక్ట్రానిక్ గాడ్గెట్: వెల్! ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? కదలండి!? యూరప్ నాయకులు: మేము ఎప్పుడూ లెవెన్త్ అవర్ వరకూ ఎదురు చూస్తాం!!! —                          —                             …

ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకున్న భారత ప్రభుత్వం

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం గతంలో వేసిన ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) అంచనాను తగ్గించుకుంది. పనిలో పనిగా ఈ సంవత్సరం కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్ లేదా బడ్జెట్ డెఫిసిట్) లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. “చెల్లింపుల సమతూకం” (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్) విషయంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నామని తెలిపింది. ‘చెల్లింపుల సమతూకం సంక్షోభం’ ఎన్నడో ఇరవై సంవత్సరాల క్రితం 1992 లో ఇండియా ఎదుర్కొంది.…

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల నిర్ణయం సస్పెన్షన్ -కార్టూన్

విపక్షాలతో పాటు, స్వపక్షాలు కూడా రిటైల్ రంగంలో ఎఫ్.డీ.ఐ లు ఆహ్వానించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో మన్మోహన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ఏకాభిప్రాయం సాధించి తిరిగి ప్రవేశపెడతానని పరోక్షంగా తెలిపింది. ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించేది లేదని చెబుతున్నాయి. బి.జె.పి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన కాలంలో రిటైల్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడుల్ని అంగీకరించాలని వాదించాడు. ఇప్పుడా పార్టీ యు-టర్న్ తీసుకున్నానని చెబుతోంది. చూద్దాం, ఎంతకాలమో! –…