హిందూ మహాసముద్రంలో మొదటి చైనా మిలట్రీ స్ధావరం త్వరలోనే


Indian Oceanహిందూ మహా సముద్రంలో మొట్టమొదటి మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయడానికి చైనా సిద్ధమవుతోంది. విదేశాలలో తన మొదటి మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా చైనా సోమవారం ప్రకటించింది. హిందూ మహా సముద్రంలో ఉన్న ‘సీ షెల్స్’ దేశంలో తన నౌకా దళాలకు మధ్యంతర సరఫరాల కోసం మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చైనా ప్రకటించింది. ‘సీ షెల్స్’ లో ఉన్న హార్మర్లలో తగిన దాన్ని ఎంచుకుని అక్కడ మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేస్తానని చైనా అధికారులు తెలిపారు.

ఎస్కార్టు నిమిత్తం వెళ్ళే చైనా నావికా దళాలు మధ్యలో ఆగి సరఫరాలను నింపుకుని తిరిగి ప్రయాణం అవడానికి తాను నెలకొల్పనున్న మిలట్రీ స్ధావరం ఉపయోగపడుతుందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ లో కాని, ఇతర దేశాలలో గాని ఉన్న హార్బర్ల వద్ద మధ్యంతర సరఫరాలు పొందే అవకాశం చైనా నావికా దళాలకు ఉన్నదని ఆ శాఖ అధికారులు తెలిపారు.

ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఇంటర్నేషనల్ సీబెడ్ అధారిటీ’ తో చైనా ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఇప్పటికే చైనాకు హిందూ మహా సముద్రంలో స్ధిరమైన చోటు దక్కిందని భావించవచ్చు. హిందూ మహా సముద్రంలో ‘పాలిమెటాలిక్ సల్ఫైడ్’ నిల్వలను వెతికి వెలికి తీయడానికి సదరు అధారిటీతో చైనా ఒక కాంట్రాక్టు కుదుర్చుకుంది. రానున్న పదిహేను సంవత్సరాల వరకూ అన్వేషణ జరిపే హక్కులు చైనాకు దఖలు పడ్డాయి. హిందూ మహాసముద్రంలో నైరుతి మూలన పదివేల చదరపు కి.మీ మేర అంతర్జాతీయ సీ బెడ్ లో అన్వేషణ జరపడానికి ఒక ‘చైనా అసోసియేషన్’ కు ఈ హక్కులు లభించాయి.

ఈ అన్వేషణ హక్కుల ద్వారా హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి ఇప్పటికే ఏర్పడింది. సీషెల్స్ లో మిలట్రీ స్ధావరం ద్వారా చైనా ఉనికి మరింతగా బలపడిందని భావించవచ్చు. సీ షెల్స్ స్ధావరం కోసం చైనా తన మొట్టమొదటి విమానవాహక నౌకను అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టనుంది. అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు లాంటి మిలట్రీ శక్తులకు ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా ఉన్న సముద్రాలలో అనేక మిలట్రీ స్ధావరాలు ఉన్నాయి. ఈ స్ధావరాలలో ఆ దేశాలు తమ విమాన వాహక నౌకలనూ, జలాంతర్గాములనూ లంగరేసి ఉంచాయి. వీటన్నింటికీ ఇప్పుడు చైనా కూడా జతకలిసింది.

అయితే, సీషెల్స్ లో నెలకొల్పనున్న మిలట్రీ స్ధావరానికి పెద్దగా ప్రాముఖ్యత లేదని చైనా చెబుతోంది. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సమీపంలోని విదేశీ నౌకా కేంద్రాలలో నౌకలకు మధ్యంతర సరఫరాలు అందజేయడం అంతర్జాతీయంగా అమలులో ఉన్న విధానమేనని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. జిబౌటి, ఒమన్, యెమెన్ లాంటి దేశాలలో చైనా ఇప్పటికే పునఃసరఫరా సౌకర్యాలు చైనా ఏర్పాటు చేసుకుందని కూడా అది గుర్తు చేసింది. సీషెల్స్ లో చైనా మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయనున్నదన్న వార్తలకు స్పందిస్తూ చైనా ఈ విషయాలు తెలిపింది.

డిసెంబరు నెల ప్రారంభంలో చైనా రక్షణ మంత్రి జనరల్ లియాంగ్ గువాంగ్లీ సీ షెల్స్ సందర్శించినపుడు అక్కడ మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ఈ సందర్శన సందర్భంగా మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయవలసిందిగా తాము చైనాను ఆహ్వానించామని సీ షెల్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-పాల్ ఆదం చెప్పాడు. సముద్ర దొంగలపై పోరాటానికి ఈ మిలట్రీ స్ధావరం అవసరమని ఆయన చెప్పాడు. తమ తమ దేశాల మిలట్రీ సహకారం గురించి ఈ సందర్శన సందర్భంగానే ఇరు దేశాల మంత్రులు అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నారని జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. చైనా సహకారానికి సీ షెల్స్ సంతోషం వ్యక్తం చేసింది. చైనా నావికాదళాలకు మధ్యంతర సరఫరాలు తమ హార్బర్లలో పొందడానికి కూడా చైనాను సీ షెల్స్ ఆహ్వానించింది.

హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి ఖచ్చితంగా ఇండియాకి అసహనం కలిగించేదే.

5 thoughts on “హిందూ మహాసముద్రంలో మొదటి చైనా మిలట్రీ స్ధావరం త్వరలోనే

  1. స్ధావరం పెట్టకముందే ధ్రెట్ గా చెప్పడం చైనా పట్ల ఇండియా అతిగా భయపడుతున్నట్లుగా అర్దం వస్తుంది. ప్రస్తుతానికి అది డిస్ట్రబెన్స్ గా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది.

  2. వసంత్ గారూ, ఇక్కడ చైనా మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేస్తున్నందుకు నేను సంతోష పడుతున్నట్లు మీకెందుకు అనిపించింది? నేను సంతోషపడుతున్నట్లు ఎక్కడ ఉందో దయచేసి చూపండి.

    మీ వ్యాఖ్యలో మీ చైనా ద్వేషం మాత్రం కనిపిస్తోంది. అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే అది మీ యిష్టం. మీ హక్కు కూడా. ఎవరినైనా ఇష్టపడే హక్కు, ద్వేషించే హక్కు మీ సొంతం. చైనాలో కమ్యూనిస్టు వ్యవస్ధ లేదని అమెరికా, యూరప్ లు కూడా గుర్తించాయి. మీరెందుకు గుర్తించరో అర్ధం కాదు. కమ్యూనిస్టు వ్యవస్ధ లేదా సోషలిస్టు వ్యవస్ధ అని దేన్ని మీరు భావిస్తారు? ఎర్రరంగు జెండా ఉంటే చాలా? వారి విధానాలు అవసరం లేదా?

    ముందే ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని, ఆ అభిప్రాయాలనుండి నా బ్లాగ్ చదువుతున్నట్లయితే అది కూడదని నేను చెప్పదలుచుకున్నా. ఫ్రెష్ మైండ్ తో నా బ్లాగ్ చదవండి. విమర్శ చేయండి. అపుడు మీ విమర్శలో ఖచ్చితంగా అర్ధం ఉంటుంది.

    *** *** ***

    మీతో పాటు ఇక్కడొక వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘నాకు ఇంగ్లీషు రాదని’ ఆయన ఓ గొప్ప సంగతి కనిపెట్టేశాడు. నిజంగా కనిపెడితే సంతోషించేవాడిని. నేను ఇంగ్లీషు పండితుడ్ని కూడా కాదు. కనుక తప్పులు దొర్లే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. కాని వీడికి ఎంతసేపటికీ ఏదయినా తప్పులు కనిపిస్తాయేమో వాటిని పట్టుకుని ఎగతాళీ చేద్దామా అన్న యావే తప్ప మరొక ఉద్దేశ్యం ఉంటే కదా! పాజిటివ్ దృక్పధంతో చదివితే నిజంగా తప్పులు చెప్పగలుగుతాడు. ఉహూ, అసలు ఉద్దేశ్యం అది కాదు కదా.

    సీషెల్స్ లో మిలట్రీ బేస్ కి అంత ప్రాముఖ్యత లేదని చైనా చెప్పిన విషయాన్ని నా పోస్టులో రాశాను. అంతర్జాతీయంగా ఇది మామూలేనని చైనా చెప్పిన సంగతినీ, ఒమన్, యెమన్ లలో ఇలాంటివే స్ధావరాలు ఉన్న సంగతినీ చైనా చెప్పిన విషయం కూడా నా పోస్టులో రాశాను. సీషెల్స్ లో మిలట్రీ స్ధావరం పెడుతున్న కారణం చైనా ఏం చెప్పిందో కూడా రాశా. కాని ఈ బుర్రమందంకి అది కనపడి చావలా. కనపడక చైనా తాను హిందూ మహా సముద్రంలో మిలట్రీ స్ధావరం పెడుతున్న సంగతిని ఖండిస్తూ ఇచ్చిన ప్రకటననే పూర్తి వార్తగా నమ్మేసి చెత్త రాసేసాడు.

    ఇండియన్ ఓషన్ లో మిలట్రీ స్ధావరం పెడితే దాన్ని మిలట్రీ స్ధావరం అని చైనా ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదనీ ఈ బుద్ధి మందానికి ఎవరు చెప్పాలి?

    ‘ది హిందూ’ లో వార్త వచ్చిందనీ అది సరిగ్గా చూడమనీ నాకు సలహా ఇస్తున్నాడు. ఇంగ్లీషు వార్తలు ‘ది హిందూ’ ఒక్కటే ప్రచురిస్తున్నట్లు ఉద్దేశ్యం కాబోలు. నేను ఒక్క హిందూ నే కాదు. ఇంకా చాలా ఇంగ్లీషు వార్తా సంస్ధల వార్తలు చదువుతానని ఈ వ్యాఖ్య చూసైనా అర్ధం అవుతుందని భావిస్తున్నా.

    విషయాలు తెలియకపోవడం తప్పు కాదు. కాని ఏమీ తెలియకుండానే అన్నీ తెలుసనని భావించే ఈ బుర్రతక్కువ వారికి ఎప్పుడు బుద్ధొస్తుంది?
    ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడ్డాయి. అందువల్ల పశువులకి కూడా గడ్ది దొరకడం లేదు. అటు మనిషి, ఇటు పశువు ఏదీ కాని ఈ జాతికి ఎక్కువ గడ్డి పెట్టలేకపోతున్నందుకు చింతిస్తున్నా.

  3. నా అనుమానం ఏంటంటే, వీడసలు నా పోస్టు పూర్తిగా చదవలేదు. చదివి ఉంటే ఈ పనికిమాలిన వ్యాఖ్య రాసి ఉండేవాడు కాదు.

    హెడ్డింగ్ వరకూ చూసి అహా తప్పు కనిపెట్టేశాననుకుని ఎగేసుకుంటూ వచ్చి రాసేశాడు. సన్నాసీ, ఇకనుండైనా పూర్తిగా చదివి వ్యాఖ్యానించడం అలవాటు చేసుకో.

వ్యాఖ్యానించండి