
భారత దేశ కరెన్సీ పతనం చెందడంలో కొంత పుంతలు తొక్కుతోంది. రోజుకొక రికార్డు నమోదు చేస్తూ పాతాళానికి దూసుకు పోతోంది. సోమవారం అది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలరు కు ఇప్పుడు రు. 52.77 పై చొప్పున రూపాయి విలువ పలుకుతోంది. అంటే రూపాయికి 1/52.77 డాలర్ల చొప్పున రూపాయి విలువ పలుకుతోంది.
సోమవారం వెలువడిన అక్టోబరు నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు భారత ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదించిన విషయాన్ని నిర్ధారించడంతో రూపాయి అమ్మకాలు పెరిగి దాని విలువ పడిపోయిందని విశ్లేషకులు భాష్యం చెబుతున్నారు. అదీ కాక స్ధానికంగా (దేశంలో) ఉండే ఆయిల్ దిగుమతిదారులు పెద్ద ఎత్తున రూపాయిలను అమ్మి డాలర్లను కొనుగోలు చేయడం వల్ల కూడా సోమవారం రూపాయి విలువ రికార్డు స్ధాయిలో పతనం అయిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. దిగుమతుల చెల్లింపులు డాలర్లలోనే చేయవలసి ఉంటుందని తెలిసిందే.
గత ట్రేడింగ్ సెషన్ ఐన శుక్రవారం ముగిసేనాటికి డాలరుకు 52.03 / 04 రు. గా ఉన్న రూపాయి విలువ సోమవారం సెషన్ ముగిసేనాటికి డాలరుకు రూ. 52.77 పై స్ధాయికి పడిపోయింది.
RUPAI VILUVA INTA TAGGIPOTUNTE PRABUTVAM EMI CHEYADA….? LEKA CHEYADANIKI CHETAKADO ARTAM KADU………….LOK SABA LO MANA FINANCE MINISTEREMO INFLATION SAGAM TAGGINDI ANTADU……….DARALEMO DOUBLE AINAVI…….ASALU MANA NAYAKULAKU GROUND LEVEL LO EM JARUGUTUNDO TELUSTUNDA……………? ELANTI VALLANTA MANA DESA NAYAKULU VEELLU MANALNI PALISTARU…………….ELANTI PRAJASWAMYAM LO VUNDE KANTE KONCHEM KATAMINA SARE COMMUNIST PALANALO VUNDADAME NAYAM………….KANEESAM VALLU PRAJALA KANEESA AVASARU GURTISTARU……….