అమెరికా రసాయన దుష్ట చరిత్ర -2

(ఇది కూడా రామ్మోహన్ గారు రాసినదే.) విలియం బ్లం చెప్పింది నేను పాక్షికంగానే రాశాను. ఇరాక్ లో 1985 నుండి 1989 దాకా వివిధ రకాల విషపదార్ధాలను ఆయుదాల తయారీకి కోసం ఇరాక్ కు ఎగుమతి చేశారు. బాసిలస్ ఆంత్రాక్స్ – ఆంత్రాక్స్ కోసం క్లొస్ట్రిడియం బొటులినం -ఒక విషపదార్ధం. హిస్ట్రొప్లస్మా కాప్స్లేటం- శ్వాశకొశం, మెదడు, వెన్నెముక, హృద్రోగాలు కలిగించే విషం ఇది. బ్రుసెలా మెలిటిన్సి-అంగవికలురను చేసేపదార్ధం. క్లొస్ట్రియం పెర్విజెన్స్- దీర్ఘకాలిక జబ్బులను కలిగించటానికి. క్లొస్ట్రిడియం టిటాని-…

అమెరికాను చుట్టుముట్టిన యుద్ధ వ్యతిరేకత

సిరియాపై దాడికి సిద్ధపడుతున్న ఒబామా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అమెరికా ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభం లోకి నెట్టిన ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాలనుండి పాఠాలు నేర్వని పాలకులపై అమెరికా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజాభీష్టాన్ని గమనించిన అనేకమంది కాంగ్రెస్ సభ్యులు ఒబామా దాడి నిర్ణయానికి మద్దతు ఇవ్వాలా లేదా అన్న విషయంలో ఊగిసలాటలో పడిపోయారు. కాంగ్రెస్ సభ్యుల ఊగిసలాట వైఖరిని గుర్తించిన ఒబామా ప్రభుత్వం సిరియాలో రసాయన దాడి జరిగిందనడానికి రుజువు చేసే వీడియోలను…

అమెరికా రసాయన దుష్ట చరిత్ర, క్లుప్తంగా….

(ఇది రామ్మోహన్ గారి వ్యాఖ్య. కొంచెమే అయినా విలువైన సమాచారం!) అమెరికా జీవ రసాయన ఆ యుదాలను 1940 నుండి వాడుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ సంయుక్తంగా కరేబియన్ సముద్రంలొబాక్టీరియా స్ప్రే చేశాయి. లక్షలాది జలచరాశులు మరణించాయి. కొరియా మీదా వెదజల్లింది. దీనివల్ల లక్షలాది మంది ప్లేగు, ఆంత్రాక్స్, మెదడు వాపు వ్యాధి వగైరా రోగాలు ప్రబలి జనం మరణించారు. 1967-69లో ఏజెంట్ ఆరెంజ్ ను 23,607 ఎకరాల కొరియా పంట పొలాల మీద స్ప్రే చేసింది…

బహుశా, ఈ టెంప్లేట్ అందరికీ నచ్చుతుంది!

‘తెలుగువార్తలు డాట్ కామ్’ ఉరఫ్ ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కోసం టెంప్లెట్ వేట ఇంకా ఆగిపోలేదు. ఆక్సిజన్ అలంకారం (అదేనండీ, ధీమ్ ఉరఫ్ టెంప్లేట్) కూడా ఎవరికీ పెద్దగా నచ్చలేదని అర్ధం అయిపోయింది. మిత్రులు ఆ సంగతి నేరుగా చెప్పలేక ‘అది ఉంది కానీ ఇది లేదు’ ‘ఫర్ఫాలేదు, కానీ అంతకుముందుదే బాగుంది’ లాంటి వ్యాఖ్యలతో తమ అసంతృప్తిని పరోక్షంగా చెప్పేశారు. నిజానికి ‘ఆక్సిజన్’ నాకూ నచ్చలేదు. వేణు గారు అన్నట్లు అది క్లమ్సీగా…

చదువు: కొందరికి లక్షలతో, అనేకులకు వివక్షలతో…

‘అక్షర లక్షాధికారి’ అని శ్రీశ్రీకి పేరు. అక్షరాలను ఒడుపుగా పట్టుకుని, ఛందోబద్ధ పరిష్వంగాలను వదులించుకుని, లక్షలాది అక్షరాలతో యధేచ్చ ఉరికిపడే జలపాతంలా కవితా ఝరులను సృష్టించినందుకు ఆయనకు ఆ పేరు దక్కింది. ఇప్పుడు అక్షరాలతో లక్షాధికారులు అవుతున్నవారు ఎంతమందో కానీ, లక్షల రూపాయలకు అక్షరాలను అమ్ముకుంటున్నవారికి కొదవలేదు. తమ విద్యార్ధులకు ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లోనే విద్యా బుద్ధులు నేర్పిస్తున్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం విద్యను అమ్మి తీరాలని శాసించాయి. డంకేల్ ఒప్పందం ద్వారా,…

ప్రశ్నలు పంపాల్సిన ఈ మెయిల్ అడ్రస్

పాఠకుల సలహా మేరకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ లో ‘ప్రశ్న-జవాబు’ కేటగిరీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠకులు తమ ప్రశ్నలు ఎక్కడ వేయాలో ఇంకా ఆలోచించలేదని ఆ కేటగిరీ ప్రారంభిస్తూ చెప్పాను. ‘ఎందుకో? ఏమో’ బ్లాగర్ గారు నా ఈ మెయిల్ అడ్రస్ కు ప్రశ్నలు పంపే అవకాశం ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు. ఆలోచించగా, చించగా…. అదే బెటర్ గా తోచింది. పాఠకులు తమ ప్రశ్నలను పంపాల్సిన నా ఈ-మెయిల్ చిరునామా: visekhar@teluguvartalu.com నేను…

అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

పోనీ, ఈ టెంప్లేట్ ఎలా ఉంది?

సెలెక్టా ధీమ్ మెజారిటీ పాఠకులకు నచ్చలేదని అర్ధం అయింది. ఒక్క తిరుపాలు గారు తప్ప ఇతర మిత్రులంతా బాగాలేదనే చెప్పారు. ముఖ్యంగా చందుగారు చెప్పినట్లు బ్లాగ్ లోని వివిధ టపాలకు తేలికగా ప్రవేశం ఉండేలా డిజైన్ ఉండడం చాలా అవసరం. అది సెలెక్టా ధీమ్ కి లేదని అర్ధం అవుతోంది. ఈసారి ఆక్సిజన్ ధీమ్ ని అమర్చాను. బహుశా ఇది బాగుందనుకుంటాను. దీని పైన కూడా మిత్రుల అభిప్రాయాలను కోరుతున్నాను.

‘తెలుగు వార్తలు’ కొత్త టెంప్లేట్, సూచనలివ్వండి!

సందర్శకులకు ఓ చిన్న విన్నపం! ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగు కోసం కొత్త టెంప్లేట్ ను అమర్చాను. ఇది పాఠకులకు అనుకూలంగా ఉన్నదని నా అంచనా. కానీ పాఠకులకు అనుకూలంగా ఉందా లేదా అన్న సంగతి ప్రధానంగా పాఠకులు చెప్పాలి తప్ప నేను కాదు. అందుకే మీ సూచనలను ఆహ్వానిస్తున్నాను.

సిరియా: 2 రోజులు కాదు, ఉధృత దాడికే సెనేట్ కమిటీ ఆమోదం

శాంతి కపోతం ఇప్పుడు ఇనప రెక్కల్ని తొడిగిన డేగగా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతిని బారక్ ఒబామాకు ఇచ్చినందుకు నోబెల్ కమిటీ సిగ్గుపడుతున్నదో లేదో గానీ సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మాత్రం ఖచ్చితంగా మరోసారి చనిపోయి ఉంటాడు. మొదట రెండు రోజుల పరిమిత దాడి అని చెప్పిన ఒబామా ఆ తర్వాత సెనేట్ కమిటీలో చర్చకు పెట్టకుముందే

నేను తప్పిపోతే బావుడ్ను -కార్టూన్

రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది అనడిగితే మౌనమే సమాధానం! ‘బిల్లుల ఆమోదానికి సహకరించం’ అని ప్రతిపక్షాలు మొండికేస్తే అప్పుడు కాస్త నోరు పెగుల్చుకుని ‘స్వదేశీ, విదేశీ రెండు కారణాలు పని చేస్తున్నాయి’ అని చెప్పి ఊరుకున్నారు. గట్టిగా అడిగితే మరిన్ని సంస్కరణలు తెస్తే మళ్ళీ మొదలు పెట్టొచ్చు అంటూ ‘పెనం మీంచి పొయ్యిలోకే దూకుతాం’ అని చెబుతారు, ప్రధాని మన్మోహన్.

నేను కాదు మోడి ప్రభుత్వం జైల్లో ఉండాలి -డి.ఐ.జి వంజార

గుజరాత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ప్రసిద్ధి చెందిన మాజీ డి.ఐ.జి వంజార తన ఐ.పి.ఎస్ పదవికి రాజీనామా చేశాడు. హోమ్ శాఖ కార్యదర్శికి రాసిన రాజీనామా లేఖలో ఆయన మోడి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడి నమ్మిన బంటు అమిత్ షాను ఉతికి ఆరేశాడు. వరుసగా అనేక బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడినందుకు గాను మరో 36 మంది పోలీసు

ఒడిషా: నీళ్ళు పట్టుకుందని దళిత మహిళను చావబాదారు

అంటరానితనం భారత దేశంలో లేనే లేదని చెప్పుకోవడానికి కొంతమందికి చాలా యిష్టం. లేదా భారత దేశంలో అంటరానితనం ఇంకా కొనసాగుతున్నదన్న నిజాన్ని ఒప్పుకోడానికి వారికి మా చెడ్డ చిన్నతనం. ఇతర మతాల లోపాలతో పోల్చుతూ హిందూమతం గొప్పతనం గురించి ఊదరగొట్టుకోవాలంటే దళితులపై సాగుతున్న అమానవీయ వివక్ష

సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం

సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని