ఈజిప్టు: ట్రోజాన్ హార్స్ (3)
రెండవ భాగం తర్వాత తద్వారా క్యాంప్ డేవిడ్ ఒప్పందం, ముఖ్యంగా అందులో మొదటి ఫ్రేం వర్క్ కేవలం పాక్షిక ఒప్పందమే తప్ప పాలస్తీనా సమస్యను పరిష్కరించే సంపూర్ణ ఒప్పందం కాదని తేల్చి చెప్పింది. అయితే రెండవ ఒప్పందం ఇజ్రాయెల్, ఈజిప్టు లకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందం కనుక, అందులోనూ ఆక్రమిత సినాయ్ నుండి వైదొలగుతామని ఇజ్రాయెల్ అంగీకరించినందున దాని జోలికి ఐరాస జనరల్ అసెంబ్లీ పోలేదు. దాని గురించిన అధికారిక వ్యాఖ్యానం కూడా ఏమీ చేసినట్లు కనిపించదు.…














