అమెరికా ఎన్నికల్ని రష్యా, చైనా, ఇరాన్ ప్రభావితం చేస్తున్నాయిట!
“ఆడలేక మద్దెల ఓడు” అన్నాట్ట వెనకటికొకడు! ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన ప్రాజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం మాది అని ఒకటే ప్రచారం చేసుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా లాంటి దేశాలపై దుర్మార్గమైన దాడులు చేసి ఆ దేశ వ్యవస్థలని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు తగుదునమ్మా అంటూ “మా దేశ ఎన్నికలని ప్రభావితం చేస్తున్నాయ్ బాబోయ్” అంటూ తెగ ఏడ్చి చస్తోంది! “అయినా…, మన బంగారం మంచిది కానప్పుడు…”…














